కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలులో, తొలిరోజే అత్యధిక ఉపాధి కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం NDA కూటమి ప్రభుత్వ పాలనా చిత్తశుద్ధికి నిదర్శనం. అదేవిధంగా, ఈ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి రూ.1,414.16 కోట్ల నిధులు విడుదల కావడం హర్షణీయం. గ్రామీణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ, ముందుకు సాగుతోంది.
డెహ్రాడూన్‌లో జరిగిన 21వ నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి, జిల్లా వాసి అయిన పెదిరెడ్ల చైత్ర దీపికను ఈరోజు తాడిగడప క్యాంప్ కార్యాలయంలో అభినందించడం జరిగింది.
ఇప్పటివరకు ఆర్టిస్టిక్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో 62 పతకాలు సాధించి తన అద్భుత ప్రతిభతో మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన చైత్ర దీపిక, భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశ��నికే గర్వకారణంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతగా భావిస్తూ, అందులో భాగంగా నేడు భవానిపురంలోని ఎన్���ీయే కార్యాలయంలో తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 48 మంది లబ్ధిదారులకు రూ.34,07,396 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేయడం సంతోషంగా ఉంది.
గత రెండేళ్ల కూటమి పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 866 మంది లబ్ధిదారులకు రూ.10.61 కోట్లకు పైగా CMRF ద్వారా సాయం అందించి ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసాగా నిలవటం జరిగింది. ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
పశ్చిమ విజయవాడ ప్రజలకు నేను ఇచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేయ���ం జరిగింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ కనెక్టివిటీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎర్రకట్ట–రాజరాజేశ్వరిపేట రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని నేడు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించి, వెంటనే DPR సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వన్‌టౌన్–టూటౌన్ మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు పూర్తిగా ఉపశమనం లభి��్తుంది. అలా��ే స్థానిక వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకుని, పశ్చిమ విజయవాడ అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది.
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, జ్ఞాన దీప్తి, మన సంస్కృతికి ప్రతిరూపం శ్రీ స్వామి వివేకానంద గారి స్మృతి దినం సందర్భంగా ఆ మహనీయుడికి నా హృదయపూర్వక నివాళులు. "లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి" అంటూ ఆయన అందించిన సందేశం యువతకు నిరంతర స్ఫూర్తి.
ప్రపంచంలో ఆధునికతకు, సాంకేతిక పురోగతికి జపాన్ పెట్టింది పేరు. అలాంటి జపాన్‌కు చెందిన పారిశ్రామిక దిగ్గజాలే ప్రధాని @narendramodi గారి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ... 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' వంటి సరికొత్త విధానాల వల్ల భారత్‌లో స్టార్టప్‌లు, తయారీ రంగం, సాంకేతిక ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, రానున్న రోజుల్లో సాంకేతికత మరియు ఆవిష్కరణల రంగాల్లో భారత్ జపాన్‌తో సహా ప్రపంచ అగ్రదేశాలను అధిగమిస్తుందని కొనియాడుతున్నారు.
మన్యం ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన విప్లవ జ్యోతి, ధైర్యసాహసాలకు మారుపేరు అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
గత వైస్సార్సీపీ ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమకు ఒట్టి శంకుస్థాపనలకే పరిమితమై రాయలసీమకు తీరని అన్యాయం చేస్తే... నేడు NDA కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, రాయలసీమ తలరాతను మార్చే JSW స్టీల్ ప్లాంటు పనులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం. కడప జిల్లా జమ్మలమడుగులో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది.
సీఎం @NCBN గారిని ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశాను. సర్వేపల్లి నియోజకవర్గంలో పీ4 కార్యక్రమంలో భాగంగా సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాను. ఆయాకార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బుక్ లెట్ ను బాబు గారికి అందించాను. తొలి ఏడాదిలో రూ.52 కోట్లతో పనులు చేపట్టడం, ప్రస్తుతం మరో రూ 34 కోట్ల పనులకు సన్నాహాలు చేస్తుండడంపై మనస్ఫూర్తిగా అభినందించారు. వేలాది సైకిళ్ల పంపిణీ, పెద్దసంఖ్యలో వాటర్ ప్లాంట్లు, సోలార్ వీధిదీపాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, హైస్కూళ్ల అభివృద్ధి, గిరిజన కాలనీల దత్తత తదితర కార్యక్రమాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణలో భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపినందుకు గాను, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి సీషెల్స్ దేశం అత్యున్నత పురస్కారం ‘Guardian of the Blue Horizon’ లభించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి సమర్థవంతమైన దౌత్యనీతి, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయ��కున్న నిబద్ధత వల్ల నేడు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది.
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్‌బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. పోలియో మహమ్మారి రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ రక్షణ కవచాన్ని ప్ర��ి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగించింది. నన్ను 47 వేల ఓట్లతో గెలిపించిన పశ్చిమ నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 'అభివృద్ధి ప్రయోగశాల' గా మారుస్తున్నాను. తాగునీటి పైప్లైన్లు, ప్రజల ఆరోగ్యం కోసం మొబైల్ మెడికల్ బస్సులు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు, రూ.27 కో��్లతో లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పనులు చేపట్టాం. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను, వ్యాపార వర్గాల నుండి దందాలను అరికట్టాం. ఇంకా ప్రజలకు చేయాల్సిన సేవ చేయాల్సింది కొండంత ఉందని, భవిష్యత్తులోనూ ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా, కూటమి ఏకగ్రీవంగా గెలిచేలా అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చాను.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10,715 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేస్తూ ర��ండు దశాబ్దాలుగా కొనసాగిన వారి నిరీక్షణకు తెరదించింది. 2020, 2023 సంవత్సరాల్లోనే కేంద్ర ప్రభుత్వం వీరంతా OPSకు అర్హులని స్పష్టం చేసినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. నేడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, కూటమి ప్రభుత్వం న్యాయం చేసి వేలాది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి మార్చడమే లక్ష్యంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు తీసుకొచ్చిన '' పీఎం శ్రీ '' పథకం విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు దక్కగా... ఆ నిధుల వి��ియోగంలోనూ దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం కూటమి ప్రభుత్వ సమర్థతకు, నిబద్ధతకు నిదర్శనం
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ, గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి దార్శనిక నాయకత్వంలో భారత్ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. తయారీ, ఆవిష్కరణల రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న భారత్, ఇంజనీరింగ్ ఎగుమతుల్లో గత ఏడాదితో పోలి��్తే 24.48% వృద్ధిని నమోదు చేసింది. ఒక్క మే నెలలోనే ఈ ఎగుమతులు $12.31 బిలియన్లకు చేరుకోవడం దేశ ఆర్థిక బలానికి నిదర్శనం.
యువత భవిష్యత్తు పట్ల గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికున్న నిబద్దతకు నిదర్శనం నేడు ప్రారంభమైన 'పీఎం వికసిత భారత్ రోజ్‌గార్ యోజన'. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగాల్లో చేరే యువతకు రూ.15,000 ఆర్థిక భరోసాతో పాటు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నేడు రూ.2400 కోట్ల భారీ ప్రోత్సాహకాలను విడుదల చేయనుండడం హర్షణీయం. గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వికసిత భారత్ నిర్మాణంలో కీలక మైలురాయి.
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'వీబీజీ రాంజీ' పథకం దేశంలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుండి ప్రారంభం కానుండటం ఎంతో హర్షణీయం. ఈ కీలకమైన పథకం ప్రారంభానికి APని ఎన్నుకోవడం అనేది, మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు మరియు అందిస్తున్న మద్దతుకు స్పష్టమైన అద్దం పడుతోంది.