బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావున్ని స్మరించుకుంటూ...
#sardarsarvayipapannagoud
భారతీయ సంప్రదాయ ఔన్నత్వానికి..
సోదర, సోదరీమణుల ఆత్మీయబంధానికి ప్రతీక నిలిచే రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
#rakshabandhan
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక!
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులు కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు తెలంగాణ ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్‌ను చూపే సందర్భం!
మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతి, సౌభాగ్యం, మత సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.*
దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలంద��ంచిన స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
నేడు ��్రపంచబాలకార్మికవ్యతిరేక
దినోత్సవం..
బాలకార్మిక వ్యవస్థను అంతం చేద్దాం..
బాలలందరిని బడికి పంపిద్దాం..
వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మనందరి బాధ్యత...
పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ గారికి ఘన నివాళి.
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ వీరుడి త్యాగం అసమానమైనది.
జై జవాన్ – జై హింద్ 🇮🇳
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,
ప్రపంచ దార్శనికుడు, భారత దేశ కీర్తి పతాక,
భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, వారికి ఇవే మా ఘన నివాళులు...!!
#AmbedkarJayanti2025
సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత,స్వాతంత్ర్య సమర యోధులు, దళితుల వికాసం కోసం కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా,
ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరం పునరంకితం అవుదాం. ఆ మహనీయునికిదే మా వినమ్ర నివాళి!🙏
ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసింది. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం.
మీ అందరిపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ..
#eidmubarak
మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ..
ఇంటింటా ఆనందాన్ని మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు..
#HappyUgadi
చెడు మీద మంచి విజయాన్ని సూచించే హోలీ పండుగ, ప్రేమ, ఐక్యత, స్నేహభావాన్ని ప్రోత్సహించే పవిత్ర పర్వదినం.
ఈ రంగుల పండుగ సంతోషం, ఆరోగ్యం, శాంతి మరియు సంపదను తీసుకురావాలి. ప్రేమతో, ఐక్యతతో అందరూ ఆనందంగా ఉం���ాలని ఆకాంక్షిస్తున్నాము.
మీకు మీ కుటుంబ సభ్యులకు
హోలీ పండుగ శుభాకాంక్షలు!
ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలి...
సమాజంలో గౌరవంగా బ్రతకాలి... మహిళలందరి ముఖంలో చిరునవ్వు వుండాలి...
మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడదాం...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
#NationalWomensDay#WomensDay2025