ఆగస్టు 16న హైదరాబాద్లో జరగనున్న మా కుమార్తె వివాహ వేడుకలకు సూపర్ స్టార్ @UrstrulyMahesh గారిని, శ్రీమతి నమ్రత గారిని ఆప్యాయంగా ఆహ్వానించే అదృష్టం కలిగింది.
వారితో గడిపిన కొద్ది క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. వారు చూపించిన ఆప్యాయత, ప్రేమ, వినయం, మా కుటుంబ యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న తీరు నా హృదయాన్ని హత్తుకుంది.
ఎంతటి శిఖరాగ్రంలో ఉన్నా అదే సరళత, అదే మానవత్వం, అదే అభిమానాన్ని పంచే మహేష్ బాబు గారు నిజంగా గొప్ప వ్యక్తి. శ్రీమతి నమ్రత గారి ఆత్మీయత, ఆదరణ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.
ఈ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భగవంతుడు మహేష్ బాబు గారికి, నమ్రత గారికి ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏❤️
#JananiSuryaPayanam