From @PawanKalyan world to real life:
Everyone watches movies… few understand the mindset behind the characters.
Fight like Jay ⚔️
Fade like Gambheera 🌫️
Rise like Orochi Genshin 🐉
Live like Sanjay Sahu 🔥
#Panjaa#TheyCallHimOG#Jalsa
Made for your screens. ⚔️⛩️🔥
Set it as your #OGUniverse wallpaper and drop your screen in the replies. 🖤📱
Let’s see OG take over every screen. 🔴
#pawankalyan
పిడుగుపాటుకు రైతు మృతి పట్ల శ్రీ @PawanKalyan గారి విచారం
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటు��ు గురై రైతు శ్రీ పి. నూకరాజు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీ నూకరాజు తన కుమారుడితో కలిసి పొలం పనుల్లో ఉండగా పిడుగుపాటుకు గురైనట్లు, ఈ ఘటనలో శ్రీ నూకరాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడినట్లు కలెక్టర్ తెలిపారు.
మృతుడి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, గాయపడిన కుమారుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. శ్రీ నూకరాజు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వర్షాలు కురిసే సమయంలో పొలం పనుల్లో ఉన్న రైతులు, అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు తక్షణం సురక్షిత ప్రా���తాలను ఆశ్రయించే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం