చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు మన కృష్ణుడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.అందరికీ మా తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Let us give you the opportunity to participate in traditionally charged fun events like 'break the pot'. Quickly register from the QR code in the poster.
Credits:
Design: Ranga
Content: Ruchitha
Krishnastami, which celebrates the birth of lord Krishna, is drawing near. On this occasion, Akshara is going to conduct several events celebrating the festival on CEESAT ground on September 6.
అన్న క్షేమని కోరుతూ చెల్లి పడే తపన....తమ్ముడు మంచి కోరుతూ అక్క పడే తపన
చెల్లి కి ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలి అనే అన్న ఆరాటం....
వీటికన్నా స్వఛ్చమైన ప్రేమ ఎంత చేసినా దొరకదు కదా!
మనసుని మమతగా నింపుకున్న ప్రతి సోదరి కి
ఆ సోదరిని సర్వంగా భావించే సోదరను కి రక్షా బంధన్ శుభాకాంక్షలు!
ఆగస్టు 29వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాషా ఉద్యమ కర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈ రోజు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఈయన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29వ తేదీన "తెలుగు భాషా దినోత్సవం"గా జరుపుకుంటారు.
మనిషి పుట్టిన తరువాత మొదటగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే అదే మన మాతృభాష. ఈ భాష ద్వారా భావాలను వ్యక్తపరచగలం. ఎన్ని భాషలు ఉన్నా మన మాతృ భాష యొక్క గొప్పదనం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు అనే పదం లోనే ఎంతో మాధుర్యం ఉంది. తేనెలొలుకు భాష మన తెలుగు భాష. #తెలుగుభాషాదినోత్సవం
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, మరియు ఎందరో వీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విడిపించారు. 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రంగ రంగ వైభవంగా జరుపుకుంటూ, సుసంపన్నమైన భారతదేశాన్ని కలిసి నిర్మిద్దాము. జై హింద్!
"ఈ అర్ధరాత్రి సమయాన్న, ప్రపంచము నిద్రిస్తుండంగా, భారతదేశం జీవనం మరియు స్వాతంత్ర్యం తో మేల్కొంటుంది." అని పండిట్ జవహర్లాల్ నెహ్రు గారు స్వాతంత్ర్య భారతదేశానికి చాటి చెప్పారు.
ఉస్తాద్ భగత్ సింగ్, సుఖఃదేవ్ థాపర్, అల్లూరి సీతారామరాజు, లాలా లజపత్ రాయి, వీర్ సావర్కర్,
స్నేహితుల దినోత్సవం రానే వచ్చింది. జీవితంలో ఎక్కువ కాలం స్నేహితుల తో గడిపిన జ్ఞ్యాపకాలు చిరస్మరణీయంగా గుర్తుఉండిపోతాయి. అవసరమైన సమయం లో ఓదార్పునిచ్చే ఉనికిని, గాయాలను నయం చేసే శక్తి తో పాటు ఆశను పునరుద్ధరించే తిరుగులేని బంధం.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా తెలుగు సినిమాలలోని
మన అక్షర కుటుంబంలో చేరిన నూతన సభ్యులకు మా హృదయపూర్వక అభినందనలు. తెలుగు భాషని, సంస్కృతిని మరో స్థాయికి తీసుకువెళ్లే మా ప్రయత్నములో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను సృష్టిస్తారని ఆశిస్తున్నాము.
ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండే వారే మన వైద్యులు అలాంటి వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే
Credits:-
Design: Ranga
Content: Mahesh
కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు. వైద్యులే అసలైన దేవుళ్లు.
ఎల్లప్పుడూ అంకితభావంతో మరియు బాధ్యతాయుతమైన ఆరోగ్య కార్యకర్తగా, మీరు మీ రోగాలను నయం చేయడానికి ముందుంటారని మాకు తెలుసు.. అందుకే మీకు వేల వేల వందనాలు.
నేడు త్యాగుల పండుగ ఈద్ - ఉల్ -అదా పర్వదినం
సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం కోసం
నమ్మిన సిద్ధాంతాల కోసం కన్న ప్రేమ ని కూడా విడిచి బలి త్యాగానికి నిదర్శనమైన అజ్రత్ ఇబ్రహీం త్యాగానికి స్ఫూర్తిగా తీసుకుంటూ ...
సాటి వారి కష్ఠాలు సామాజికంగా పంచుకుంటూ ....
గెలిచినప్పుడు నీ ప్రోత్సాహం ఓడినప్పుడు నీ ఓదార్పు విజయంలో నీ ప్రశంస ఇలా నా జీవిత పయనంలో నీవు అడుగడుగునా నాకు తోడుగా నిలిచావు దుఃఖ సమయంలో నా కంట నీరుగా జారావు నీ తోడు లేని నేను గూడు లేని పక్షిలా తిరిగాన నీ చెయ్యి నా బాహువుల మీద నుంచి ని తోడు
నాకు కడవరకు అందించు నాన్నా....
విజయంలో నీ ప్రశంస ఇలా నా జీవిత పయనంలో నీవు అడుగడుగునా నాకు తోడుగా నిలిచావు.దుఃఖ సమయంలో నా కంట నీరుగా జారావు .
నీ తోడు లేని నేను గూడు లేని పక్షిలా తిరిగాను
నీ చెయ్యి నా బాహువుల మీద నుంచి ని తోడు
నాకు కడవరకు అందించు నాన్నా....#FathersDay#fatherhood
నా పేరు వెనుక చిరునామా నువ్వు
నా పసితనానికి పెద్దరికం నువ్వు
నా అల్లరికి ఆనకట్ట నువ్వు
పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో బ్రతకడం నేర్పించిన తొలి గురువు అయ్యావు.అలసి యున్నపుడెల్ల సేద దీరె చల్లని నీడవైనావు.గెలిచినప్పుడు నీ ప్రోత్సాహం, ఓడినప్పుడు నీ ఓదార్పు.
ఈ జూన్ 14వ తేదీన, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటూ, మీరు కూడా మీ రక్తాన్ని 'బ్లడ్-బ్యాంక్స్'కు వెళ్లి దానం చేసి, నలుగురి ప్రాణాలను కాపాడండి.
Credits:-
Design: Santhosh
Content: Anhinav
ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుంది, లెక్కలేనన్ని వ్యక్తులకు జీవనాధారంగా పనిచేస్తుంది. నిస్వార్థంగా రక్తదానం చేయడం వలన ప్రాణాలను కాపాడడమే కాకుండా మానవత్వానికి ఉదాహరణగా కూడా నిలుస్తుంది.
"ప్రాణం అంతా మన రక్తంలో ఉంటుంది. రక్త దానం చేసి ప్రాణ దాతులు అవ్వండి."