*రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె-ఆముదాలవలసలో మద్దతు తెలిపిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు*
గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడి ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చి, దాదాపు ఐదేళ్లు కావస్తున్న ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలంతా సమ్మె నిర్వహించారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తలపెట్టిన అంగన్వాడీలకు సమ్మెకు ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్రావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నేటి రోజుల్లో పేద ధనిక వర్గాల వారందరికీ పోషణ లోపం లేకుండా చూడటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని, అంతేకాకుండా ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రారంభిస్తూ ఆ తల్లి,బిడ్డ ల సంరక్షణ ధ్యేయంగా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారని అంగన్వాడీల సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామ్మోహన్ తో పాటు సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, గంగు కోటేష్, దువ్వాడ కరుణా సాగర, పప్పల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
@JanaSenaParty@JSPShatagniTeam@mnadendla@PawanKalyan
ఎంవివి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాస్తు కోసం సిరిపురం వద్ద రోడ్డు మూసేశారు! @JanaSenaPartyకి వచ్చిన అభ్యర్థన వల్ల @PawanKalyan గారు వెళ్లి చూడడంతో ఎంపీ గారు రోడ్డు తెరవమని సీపీ గారికి లెటర్ ఇచ్చారు. ఇప్పటి వరకూఎందుకు తెరవలేదని అడిగితే అరెస్ట్!
https://t.co/S5urlX3NiD
ముంచుకొస్తున్న #మిచౌంగ్ తుఫాను వల్ల రైల్వే శాఖ 118 రైళ్లను రద్దు చేసింది
భారత వాతావరణ శాఖ బులిటెన్ ప్రకారం తూఫాన్ నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కిమీలో కేంద్రీకృతమై ఉంది
ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
https://t.co/uUznNf8YU2
విశాఖ ఓల్డ్ సిటీ రోడ్డు విస్తరణ వల్ల 1917లో గవర్నరు బారన్ పెంట్‌ల్యాండ్ గారిచే ప్రారంభించబడిన పురావస్తు ప్రాముఖ్యత గల "హిందూ రీడింగ్ రూం" కట్టడానికి ఏమాత్రం నష్టం కలుగకుండా ఉండేట్టు మరియు ఆ భవనానికి మెరుగులు దిద్దేట్టు @TSivasankararao గారు జీవీఎంసీ అధికారులతో చర్చలు జరిపారు..
నేను ఎమ్మెల్యే, కన్నబాబు మంత్రి, జగన్ సీఎం అవ్వడానికి క్రైస్తవులే కారణం. క్రైస్తవుడైన @ysjagan సీఎం అయితే పాస్టర్లు ఎంత బలంగా ఉండొచ్చో మీరు చూస్తున్నారు -సువార్త సభలో ద్వారంపూడి
ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులతో సహా అన్ని మతాలు బలంగా ఉండాలంటే?
@PawanKalyan కావాలని ప్రజలంటున్నారు!!
ఈ సాయంత్రం పూజ్యశ్రీ కమలానంద భారతి గారు, శ్రీ ఎం వి ఆర్ శాస్త్రి గారు నేను పాల్గొన్న ఆఖరి ఎన్నికల అస్త్రం.. లాస్ట్ పంచ్ 👊
తెలంగాణా ఎన్నికలలో సనాతన ధర్మాన్ని.. పోరాడే తత్వాన్ని రక్షించడానికి #VoteForGlass#VoteForLotus@JanaSenaParty@BJP4Telangana
https://t.co/pjpY9C3mw7
వైసీపీ పోలీసుల ఇంటెలిజెన్స్ ద్వారా మళ్లీ డర్టీ గేమ్‌కు శ్రీకారం చుట్టింది. @PawanKalyan గారి కార్యక్రమం రద్దయ్యిందని తప్పుడు సమాచారం హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు పంపబడింది!
ఒక్కసారి కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యాక ఆయన్ని ఆపడం ఎవరితరం కాదన్నది ఇప్పటికే రుజువయ్యింది.
@JanaSenaParty
సరుబుజ్జిలిలో రోడ్ల దుస్థితిపై జనసేన-టిడిపిల ఉమ్మడి నిరసన
నేడు ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి జంక్షన్ వద్ద జనసేన,తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా "గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది" పేరుతో, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సభాపతి సీతారాం గారు సొంత నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ, ప్రధాన రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం కావడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. పాడైన రోడ్లను మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడం అత్యంత దయనీయమని వాపోయారు. భవిష్యత్తులో టిడిపి జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి శివాల సూర్యం, మండల అధ్యక్షులు అంబల్ల రాంబాబు, నాయకులు నందివాడ గోవింద్ తోట సునీత, సింగపురపు ఉమా మహేష్, పేడాడ రమణ, మజ్జి రాంబాబు, సేపాన రమేష్, పప్పల విజయకుమార్, సంగంశెట్టి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@JaiTDP@bolisetti_satya@JaiTDP@mnadendla
రోడ్ల దుస్థితిపై జనసేన-టిడిపిల ఉమ్మడి నిరసన
నేడు ఆముదాలవలస నియోజకవర్గంలో శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారి పై చింతాడ వద్ద జనసేన @JaiTDP ఉమ్మడిగా "గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది" పేరుతో, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ గారు @JanaSenaParty ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆముదాలవలసలో రహదారులు మృత్యద్వారాలను తలపిస్తున్నాయని, నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే ఆముదలవలస శ్రీకాకుళం ప్రధాన రహదారి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాబడిన నేటికీ పనులు జరగకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. స్థానికంగా సభాపతి సీతారాం సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సాధించేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలో సంయుక్తంగా పోరాడి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.
అనంతరం కూన రవికుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎన్నికలకు సిద్ధమవడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఆముదాలవలస నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై రానున్న రోజుల్లో జనసేన తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, పైడి మురళీమోహన్, ఎలకల రమణ, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
#GunthalaRajyamAP #WhyAPHatesJagan
@PawanKalyan@JSPShatagniTeam@bolisetti_satya@PawanKalyanFan
జనసేన, టీడీపి నేతలు, కార్యకర్తలందరూ గుంతల రోడ్లతో ఎన్నాళ్ళు మనకు ఈ పాట్లు?
నవంబర్ 18, 19 తేదీలలో రోడ్లపై ఎక్కడ గుంత కనిపించినా ఓ సెల్ఫీ తీసి #GunthalaRajyamAP#WhyAPHatesJagan
అనే హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో షేర్ చేసి
జగన్ రెడ్డి (మామయ్య) కళ్ళు తెరిపిద్దాం
@JanaSenaParty