రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నాను.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించాం.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, చెరువులు, జలాశయాలు నిండాలి. పంటలు సమృద్ధిగా పండాలి. రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలి. ప్రతి కుటుంబం సంతోషంగా, సుభిక్షంగా జీవించాలి.
ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు, ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యత.
#VarunaYagam #Telangana
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(SIR) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ పార్లమెంట్ లోని, దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs) శిక్షణా కార్యక్రమంలో సూచించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ విజయవంతం చేయండం లో బూత్ లెవల్ ఏజెంట్లు, (BLAs)లది కీలకపాత్ర.
ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు, జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దేలా సర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలీ.
అర్హులందరూ జాబితాలో ఉండేలా దృష్టి పెట్టాలి.
నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో కొత్త ఓట్ల చేరికలు, పాత ఓట్ల తొలగింపులను బీఎల్ఏలు క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది.
అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా ఓటర్లు, అధికారులతో సమన్వయం చేయాలి.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ గారు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కోహెడ లో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేశాను. ఇన్నాళ్లు రేకుల షెడ్డుల్లో, కనీస సౌకర్యాలు కొరవడిన పండ్ల మార్కెట్ స్థానంలో ఆధునాతన సౌకర్యాలతో, రైతులకు సకల సదుపాయాలతో ఈ మార్కెట్ ను నిర్మించబోతున్నాం.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ లు శ్రీ వేం నరేందర్ రెడ్డి, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి , శ్రీ నవీన్ యాదవ్ , శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#KohedaFruitMarket
#IntegratedFruitMarket
#AgricultureDevelopment
#ModernMarketInfrastructure
#TelanganaDevelopment
#PrajaPalana
#TelanganaProgress
#IntegratedSubRegistrarOffice
#Koheda
జనగణన( Census 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్( Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్నాను. వెబ్ సైట్ ద్వారా నా వివరాలను నమోదు చేసుకున్నాను. ప్రజలందరు జనగణనలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీమతి భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ RV కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ శ్రీమతి ప్రియాంక ఆల, I&PR కమిషనర్ శ్రీమతి సీహెచ్. ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#Census2027 #SelfEnumeration #Janaganana #DigitalIndia #ParticipateInCensus
పరిశ్రమల శాఖ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన MOU లు, పురోగతిపై ఆరా తీశాను. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నాను.
MOU లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత క్రమంలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఆదేశించాను.
డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించాను.
MOU లు కుదుర్చుకున్న సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించాను.
ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaRising
#InvestTelangana
#IndustrialGrowth
#Telangana
#FutureCity
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళి అర్పించాను.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లు. వాళ్ల ఆదర్శాలతోనే ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.
#DrBRAmbedkar #AmbedkarJayanti #BharatRatna #TankBund #Hyderabad
వివిధ శాఖలలో గ్రూప్- 3 ఉద్యోగాలకు ఎంపికైన 1370 మందికి నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగులుగా బాధ్యతలు చేపట్టనున్న యువకులంతా...రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
HICC లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. భారత్ తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా కార్డియాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషదాయకం.
నేను డాక్టర్ ను కాకపోయినా ముఖ్యమంత్రిగా సమాజ రుగ్మతలను పరిష్కరించడంలో నాది డాక్టర్ లాంటి పాత్రనే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరగడం ఎంతో గర్వకారణం.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం పాలసీని మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.
#TelanganaRising #LifeSciencesHub #MedicalInnovation
சகோதர, சகோதரிகளே, வணக்கம்.
இருபது ஆண்டுகளுக்கு முன்பு, டாக்டர் மன்மோகன் சிங் அவர்கள் பிரதமராக இருந்தபோது, மகாத்மா காந்தி தேசிய ஊரக வேலைவாய்ப்பு உறுதிச் சட்டம் (MGNREGA) நாடாளுமன்றத்தில் ஒருமனதான ஒப்புதலுடன் நிறைவேற்றப்பட்டதை நான் இன்னும் நினைவில் வைத்திருக்கிறேன். இது கோடிக்கணக்கான கிராமப்புறக் குடும்பங்களுக்குப் பயனளித்த ஒரு புரட்சிகரமான நடவடிக்கையாகும். குறிப்பாக, பின்தங்கிய, சுரண்டப்பட்ட, ஏழை மற்றும் வறுமையின் பிடியில் உள்ள மக்களுக்கு வாழ்வாதாரத்திற்கான ஆதாரமாக மாறியது.
இது இடம்பெயர்வதைக் கட்டுப்படுத்தியது; மக்கள், தங்கள் மண்ணுடனும், கிராமங்களுடனும், குடும்பங்களுடனும் இணைந்தே வாழ்வாதாரம் ஈட்ட வழிவகுத்தது. வேலைவாய்ப்புக்கு சட்டப்பூர்வமான உத்தரவாதம் வழங்கப்பட்டது. மேலும், கிராமப் பஞ்சாயத்துகளுக்கு அதிகாரம் அளிக்கப்பட்டது. மகாத்மா காந்தியின் 'கிராம சுயராஜ்யம்' கனவை நனவாக்குவதற்கான ஒரு உறுதியான நடவடிக்கை MGNREGA மூலம் எடுக்கப்பட்டது.
கடந்த 11 ஆண்டுகளாக, மோடி அரசாங்கம் கிராமப்புற வேலையற்றோர், ஏழைகள் மற்றும் பின்தங்கிய மக்களின் நலன்களைப் புறக்கணித்து, MGNREGA-வை பலவீனப்படுத்த அனைத்து முயற்சிகளையும் மேற்கொண்டு வருகிறது. கோவிட் பெருந்தொற்று காலத்தில் இது ஏழைகளுக்கு ஒரு உயிர்நாடியாக (சஞ்சீவினி) நிரூபிக்கப்பட்டபோதிலும், இந்த நிலை தொடர்ந்தது.
ஆனால், சமீபத்தில், அரசாங்கம் MGNREGA திட்டத்தை முற்றிலுமாகச் சிதைத்துவிட்டது என்பது மிகவும் வருந்தத்தக்கது. மகாத்மா காந்தியின் பெயர் நீக்கப்பட்டது மட்டுமல்லாமல், எந்தவொரு விவாதமும், ஆலோசனையும் இன்றி, எதிர்க்கட்சிகளின் நம்பிக்கையைப் பெறாமலேயே, இந்தத் திட்டத்தின் தன்மையும், கட்டமைப்பும் தன்னிச்சையாக மாற்றப்பட்டுள்ளன.
இனி, யாருக்கு, எவ்வளவு, எங்கே, எந்த முறையில் வேலைவாய்ப்பு வழங்கப்படும் என்பதை, கள யதார்த்தத்திலிருந்து வெகு தொலைவில் உள்ள டெல்லியில் அமர்ந்திருக்கும் அரசாங்கமே முடிவு செய்யும்.
MGNREGA திட்டத்தை அறிமுகப்படுத்துவதிலும் செயல்படுத்துவதிலும் காங்கிரஸ் கட்சி ஒரு முக்கியப் பங்கு வகித்தது, ஆனால், இது ஒருபோதும் கட்சி சார்ந்த பிரச்சினையாக இருந்ததில்லை. இது தேசிய நலன் மற்றும் பொது நலனுக்காக அர்ப்பணிக்கப்பட்ட ஒரு திட்டமாகும். இந்தச் சட்டத்தை பலவீனப்படுத்துவதன் மூலம், மோடி அரசாங்கம் நாடு முழுவதும் உள்ள கோடிக்கணக்கான விவசாயிகள், தொழிலாளர்கள் மற்றும் நிலமற்ற கிராமப்புற ஏழைகளின் நலன்களுக்கு எதிராகத் தாக்குதல் தொடுத்துள்ளது.
இந்தத் தாக்குதலை எதிர்த்துப் போராட நாம் அனைவரும் தயாராக இருக்கிறோம். இருபது ஆண்டுகளுக்கு முன்பு எனது ஏழை சகோதர, சகோதரிகளுக்கு வேலைவாய்ப்பு உரிமையைப் பெற்றுத் தர நான் போராடியது போலவே, இன்றும் இந்த கறுப்புச் சட்டத்திற்கு எதிராகப் போராட நான் உறுதியுடன் இருக்கிறேன்.
என்னைப்போலவே, அனைத்து காங்கிரஸ் தலைவர்களும், லட்சக்கணக்கான தொண்டர்களும் உங்களுடன் துணை நிற்கிறார்கள்.
ஜெய் ஹிந்த்.
– அன்னை சோனியா காந்தி, காங்கிரஸ் நாடாளுமன்றக் குழுத் தலைவர், டெல்லி
"సత్యమేవ జయతే"
నేషనల్ హెరాల్డ్ అక్రమ కేసుపై ఢిల్లీ కోర్టు పెట్టిన చివాట్లు ప్రధాని మోడీ @narendramodi గారికి, బీజేపీ @BJP4India నీచాతి నీచ రాజకీయాలకు చెంపపెట్టు. ధర్మపీఠం ముందు ప్రతీకారానికి చోటు లేదని నిరూపణ జరిగింది. కక్ష్య సాధింపు రాజకీయాలకు స్థానం లేదని తేటతెల్లం అయ్యింది. ఆకాశం లాంటి కాంగ్రెస్ పార్టీపై ఏదో వేయాలని చూస్తే చివరకది మోడీ మొహం మీదే పడింది. ED నీ బానిసగా చేసుకొని, కాంగ్రెస్ అధినాయకత్వంపై బురద చల్లాలని చూసినా, గాంధీ కుటుంబాన్ని వేధించాలని కుట్రలు పన్నినా అంతిమగా న్యాయమే గెలిచింది. వ్యవస్థలను సొంతానికి వాడుకుంటున్నట్లు మరోసారి వాస్తవం రుజువైంది. ఇది అధర్మం అంతానికి, మోడీ గారి నిరంకుశత్వానికి చరమగీతం. స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను దుర్వినియోగం చేసినందుకు, కాంగ్రెస్ పార్టీపై అపఖ్యాతి మోపాలని చూసినందుకు, నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా @AmitShah గారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి.
@INCIndia@INC_Andhra@RahulGandhi@manickamtagore
Telangana's mark on the world of sports…
With a global football legend G.O.A.T #Messi
An incredible feat accomplished on #Hyderabad soil.
An occasion where #Telangana shone brightly on the world sports stage.
A message that proclaims Telangana has the capability to host the Olympics in the future.
#GoatIndiaTour #MessiInIndia
#TelanganaRising #TelanganaZarurAana
“తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025” లో భాగంగా పలువురు సినీ ప్రముఖులు కలిశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వైపు నుండి కావాల్సిన అన్నీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వారికి హామీ ఇచ్చాను. సినిమా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించాను. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు సహకరిస్తామని చెప్పాను.
ఈ భేటీలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ అల్లు అరవింద్, శ్రీ సురేష్ బాబు, శ్రీ దిల్ రాజు, శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి, శ్రీమతి జెనీలియా, శ్రీమతి అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
#TelanganaGlobalSummit2025
#TelanganaFilmDevelopment
#TelanganaFutureCity
ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలో ప్రజా పాలన విజయోత్సవ సభకు హాజరయ్యాను. 532 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభ ద్వారా తెలంగాణ పల్లె ప్రజలకు నా ఆలోచనను చెప్పాను…
సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వ వద్దు. పనితనం ఉన్న వాడు నాయకుడు కావాలి తప్ప… పైసలతో పదవులు కొనుక్కునే పరిస్థితి రావద్దు. అది గ్రామాల భవిష్యత్ కు మంచిది కాదు…
రెండేళ్ల ప్రజా పాలనకు కొనసాగింపుగా గ్రామాల్లో ప్రజా పాలన తెచ్చుకోవాల్సిన తరుణం వచ్చింది. మంచి వ్యక్తులను, సమర్థులను, గ్రామ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉన్నవాళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోండి. గ్రామాభివృద్ధి గురించి జిమ్మేదార్ తీసుకుని మంత్రులను కలిసి, సమస్యలను వివరించి, ఒప్పించి, మెప్పించి, పరిష్కరించే ఓపిక ఉన్న నాయకుడు గ్రామ సర్పంచ్ గా ఉండాలి.
ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, లొంగకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరాను.
#PrajaPalana
#TelanganaRising #WarangalDistrict
Along with Deputy Chief Minister Shri Bhatti Vikramarka and Telangana Congress MPs, I have invited Hon’ble Prime Minister Shri Narendra Modi ji to attend the #TelanganaGlobalSummit2025, being hosted by the people’s government on the 8th and 9th of this month at Bharat Future City.
#TelanganaRising