సొంత పార్టీ వాళ్లకే న్యాయం చేయలేని రేవంత్.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడా?
కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పిండు.
డబ్బులు తీసుకొని సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టే, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నడు.
రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దన్నందుకే, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దయ్యేలా కేసు వివరాలు లీక్ చేశాడు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు బతుకుతెరువు కల్పించాం. కానీ రేవంత్ రెడ్డికి ఆ కాన్సెప్టే అర్థం కాలేదు.
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టొద్దని అసెంబ్లీలోనే వేడుకున్నా వినలేదు.
ఇవాళ కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, పిల్లల బ్రేక్‌ఫాస్ట్, రైతుబంధు.. ఇలా అన్నీ బంద్ చేశారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
వర్షం పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టే హైదరాబాద్ మునిగిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు
మరి రెండున్నర సంవత్సరాలలో నువ్వు ఏం చేశావు?
అంతకు ముందు 60 ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా.. అప్పుడు ఏం చేసారు?
- హరీష్ రావు
Video Credits - RAJ NEWS
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జైపూర్ పవర్ ప్లాంట్ స్కాం బయటపెట్టిన హరీష్ రావు
జైపూర్ ప్లాంట్ DPRకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు అయినా టెండర్లు పిలిచారు
టెండర్లు పిలిచి వాళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్లు కట్టబెట్టారు.. ఏడాదిన్నర అయినా DPRకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు
ఆలస్యం కారణంగా సింగరేణి పై ఏడాదికి రూ.750 కోట్లు, రోజుకు రెండున్నర కోట్ల నష్టం
ఇంకో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఒక ఆంధ్ర అతనిని జైపూర్ లో నియమించారు
ఎన్టీపీసీ అతి తక్కువ ధరకు ఇచ్చే విద్యుత్తు ఉండగా ఎక్కడో జైపూర్‌లో పవర్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు?
తనకు 24% వాటా చేస్తున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వం పాకిస్తాన్ బార్డర్ జైసల్మేర్‌లో 1400 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు
సింగరేణి వాడు పోయి పాకిస్తాన్ బార్డర్లో సోలార్ ప్లాంట్ పెట్టాలి అంట.. సింగరేణి పని ఏంది, అక్కడ ఎక్కడో సోలార్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు, అసలు ఎవరి కోసం పెట్టిస్తున్నారు
- హరీష్ రావు
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి పెట్టారు
కావాలంటే రేపు మీడియా వాళ్ళు వెళ్లి కొంచెం తవ్వి చూడాలి
ఇదంతా వీడియో తీస్తున్నందుకు ఒక కార్మికుడి ఫోన్ గుంజుకున్నారు
- హరీష్ రావు
బాధిత బాలికకు సరైన వైద్యం అందించలేక,
పేదలకు వైద్యం అందించే నిమ్స్ ఆస్పత్రిలో
కనీసం మెడిసిన్ కూడా ఇవ్వకుండా బయట నుంచి తెచ్చుకోమన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యం ఇప్పించే తెలివి లేదు కానీ,
మేం వస్తున్నామని తెలిసి వందల మంది పోలీసులను పెట్టారు.
బాధితులు తమ సొంత డబ్బులతో మెడిసిన్ బయట కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే..
రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న @revanth_anumula .. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో.
రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుంది.
మహిళా మంత్రిగా ఉన్న @seethakkaMLA గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం.
అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.
2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది.
కానీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు.
అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.
మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు.
ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి.
సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.
రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. పాలమూరుకు చేసింది సున్నా!
నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే..
సమైక్య పాలకుల పక్షాన నిలబడి, మన తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్ రెడ్డిది.
ఉమ్మడి పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నాడు.
పాలమూరు ప్రజల నోట్లో మట్టికొట్టి తెలంగాణ సమాజానికి నమ్మకద్రోహం చేసిండు.
ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా.. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహే!
Protection from Submergence in Telangana due to Polavaram Project Reservoir and Backwater Effects.
@BRSparty have urged the Polavaram Project Authority to immediately provide compensation, rehabilitation, flood protection infrastructure, and establish a dedicated PPA office in Bhadrachalam to protect the lives and livelihoods of the people of Telangana.
Before Telangana was a state, it was a wound.
A dream that came with a price.
A silence that turned into a roar.
From sacrifice came identity.
A state born from courage.
Jai KCR.
Jai Telangana.
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
మనం కూడా గాలి గాలి కావొద్దు...
ఆగమాగం కావొద్దు!!
నన్ను పదేండ్ల ఉద్యమకాలంలో
పది లక్షల తిట్లు తిట్టిండ్రు..
అయినా నేనెప్పుడూ నారాజ్ అవ్వలే,
ఎవ్వరికీ భయపడలే..!
పట్టుదలతో ఉన్నాం కాబట్టే,
ఈరోజు ఇక్కడదాకా రాగలిగినం."
- 18 లక్షల మంది హాజరైన
'తెలంగాణ మహాగర్జన' సభలో కేసీఆర్ 🔥
#TelanganaFormationDay #Telangana
(ఫైల్ వీడియో : 2010)