మేము మంత్రి పదవి ఇవ్వాలని అడిగిన ప్రతిసారీ,గిరిజన సోదరులకు మరియు మాకు మధ్య పంచాయతీ పెట్టే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.ఇదంతా అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆలోచనా విధానమే.ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
మహబూబాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిపై సీఐ దురుసుగా ప్రవర్తించిన ఘటనను బంజారా సేవాదళ్ తీవ్రంగా ఖండిస్తోంది.
విద్యార్థిపై దాడికి పాల్పడిన సీఐని వెంటనే సస్పెండ్ చేసి,సమగ్ర విచారణ జరిపించాలని
@Banjara_sevadal డిమాండ్ చేస్తోంది.
@TelanganaDGP
రేపు జరగబోయే డీలిమిటేషన్లో ఎస్సీలకు ఏ విధంగా డిస్ట్రిక్ట్ యూనిట్లు ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలోని నియోజకవర్గాలను పరిమితం చేస్తున్నారో, అదే విధంగా మైదాన ప్రాంత బంజారా బిడ్డలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బంజారా సేవాదళ్ డిమాండ్ చేస్తోంది.
@TelanganaCMO@revanth_anumula
బంజారా సేవాదళ్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 50 సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న బంజారా సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. బంజారా సమాజానికి రావాల్సిన హక్కులు, న్యాయం సాధించడంతో పాటు, ప్రతి సమస్యపై పోరాడి బంజారా సోదరుల హక్కులను కాపాడేందుకు
ప్రతి సమస్యపై పోరాడి బంజారా సోదరుల హక్కులను కాపాడేందుకు ఈ సంఘం ఏర్పడింది. ప్రతి సమస్యపై ఐక్యంగా పోరాడుతూ, బంజారా సమాజ అభివృద్ధి కోసం బంజారా సేవాదళ్ పనిచేస్తుంది.
@TelanganaCMO@revanth_anumula@Banjara_sevadal
రిజర్వేషన్లు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇందిరాగాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన బస్సు యాత్ర కార్యక్రమం అట్టర్ ఫ్లాప్‌గా మారింది. సుమారు 100 మంది కూడా హాజరుకాని ఈ కార్యక్రమంలో 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు తదితరులు పాల్గొన్నప్పటికీ,
తెలంగాణ రాష్ట్రంలో బంజారా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో,బంజారా సేవాదళ్ పనిచేస్తుంది. బంజారా సోదరుల సంక్షేమం,అభివృద్ధి,హక్కుల పరిరక్షణే బంజారా సేవాదళ్ ముఖ్య ఉద్దేశం.ప్రతి కార్యకర్త చట్టసభల్లో అడుగుపెట్టి
కాంగ్రెస్ పార్టీపై బంజారా సమాజానికి తరతరాలుగా ఉన్న విశ్వాసాన్ని గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకుల పేర్లను తమ కుటుంబ సభ్యులకు పెట్టుకునేంత అభిమానం బంజారా బిడ్డలకు ఉంది. కానీ నేడు అదే బంజారా సమాజానికి రాజకీయ గుర్తింపు,ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం.
@revanth_anumula@TelanganaCMO
గిరిజనులకు న్యాయం చేస్తారనే ఆశతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. అయితే, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో గిరిజన సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు.
@BRSparty@KTRBRS@revanth_anumula@TelanganaCMO@INCTelangana
అప్పటి ప్రభుత్వం గ్రామపంచాయతీల ఏర్పాటు ద్వారా సుమారు 4,000 మంది సర్పంచులకు రాజకీయ అవకాశం కల్పించడంతో పాటు, మరో 4,000 మందికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రస్తుత సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం గిరిజన బిడ్డల నుంచి సుమారు 10,000 ఎకరాల భూమిని తీసుకున్న నేపథ్యంలో, అదే ఫ్యూచర్ సిటీలో కనీసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అక్కడ సేవాలాల్ మహారాజ్ విగ్రహంతో పాటు భవ్య మందిరం మరియు మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని బంజారా సేవాదళ్ తీర్మానించింది.
ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బంజారా సేవాదళ్ ప్రారంభమైన అనంతరం తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు నియామక పత్రాలను అందజేయడం జరిగింది.
సమావేశంలో బంజారా సేవాదళ్ డిమాండ్లు, హక్కులు మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
మ్యూజియం మరియు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన మద్దిమడుగు ప్రతిపాదనను వెంటనే రద్దు చేసి, ఫ్యూచర్ సిటీలో సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని బంజారా సేవాదళ్ డిమాండ్ చేస్తోంది.