చిరంజీవి గురించి ఒక్కమాట!
ఈరోజు ఆఫీసులో ఒక ఫ్రెండ్‌తో AI గురించి మాట్లాడుతున్నాను.
అతను AIని బాగా వాడుతున్నాడు. నేను సరదాగా అడిగాను…
“అలా use చేస్తున్నావ్ AIని… tokens అయిపోతే?”
వెంటనే అతను అన్నాడు…
“అవేమైనా చిరంజీవి సినిమా tickets ఆ… అయిపోవడానికి?”
నవ్వుకున్నాను.
కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది…
ఏంటో… ఏ topic మొదలుపెట్టినా, ఎక్కడో ఒకచోట reference మాత్రం చిరంజీవి దగ్గరికి వచ్చి ఆగుతుంది.
చిన్నప్పుడు కొత్త jeans, stylish shirt వేసుకుని వస్తే…
“ఏరా… చిరంజీవిలా ఉన్నావ్!”
కొంచెం కోపం చూపిస్తే…
“ఏంటి… ఇప్పుడు చిరంజీవిలా కొడతావా?”
కాస్త swag చూపిస్తే…
“వీడో చిరంజీవి మరి…”
Dance బాగా చేసినా…
“బాగానే వేశావ్ కానీ… చిరంజీవిలా లేదబ్బాయ్.”
బద్ధకంగా ఉంటే…
“చిరంజీవిని చూసి నేర్చుకోండ్రా… ఎంత కష్టపడతాడో!”
కాలం గడిచింది.
మన problems మారాయి.
మన conversations మారాయి.
“మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి రా…”
“చిరంజీవిని చూడు… ఇప్పటికీ ఎలా dance చేస్తున్నాడో!”
“Weight పెరిగిపోతున్నా…”
“మీ చిరంజీవిని చూడు… ఎలా maintain చేస్తున్నాడో.”
“ఏంటో రా… life bore కొట్టేసింది. ఇంకేం చేయాలనిపించడం లేదు…”
“అరే… ఆయనని చూడు. ఇప్పటికీ ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి అని తపన పడుతూనే ఉన్నాడు. మనం ఎంత రా?”
Theatre ముందు ticket queues నుంచి AI tokens వరకు వచ్చేశాం.
ప్రపంచం మారింది.
Technology మారింది.
Generations మారాయి.
కానీ మన references మాత్రం చిరంజీవి దగ్గరే ఆగిపోయాయి.
ఇన్ని సంవత్సరాలుగా ఈ references ఇంత consistentగా ఉన్నాయంటే… వాటి వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంది.
ఒక తపస్సు ఉంది.
ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి.
ఎన్నో విమర్శలు ఉన్నాయి.
వాటన్నింటినీ దాటుకుంటూ వచ్చిన ఒక ప్రయాణం ఉంది.
కానీ ఇక్కడే ఇంకో lesson ఉంది.
మన జీవితాల్లో కూడా highs ఉంటాయి. Lows ఉంటాయి.
మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు…
“నీ వల్ల కాదు” అని ఎవడో ఒకడు అంటాడు.
మన ప్రయత్నాన్ని చూసి ఇంకొకడు నవ్వుతాడు.
మనల్ని discourage చేసేవాడు ఒక relative కావచ్చు.
Teacher కావచ్చు.
Friend కావచ్చు.
Colleague కావచ్చు.
ప్రతి మాటకి మనం బాధపడొచ్చు.
ప్రతి విమర్శకి వెంటనే సమాధానం చెప్పాలని ఆరాటపడొచ్చు.
కానీ ఆయన journey మనకు నేర్పిన lesson వేరు.
నీ మీద వచ్చిన విమర్శలకు నీ మాటలతో కాదు…
నీ కష్టంతో సమాధానం చెప్పు.
ఎందుకంటే చివరికి కాలం గుర్తుపెట్టుకునేది ఎవరు ఎవరిని ఏమన్నారు అన్నది కాదు.
నువ్వు ఏం చేశావు.
ఎంత కష్టపడ్డావు.
ఏం సాధించావు.
నీ సమాధానం నీ ఫలితం లో ఉండాలి.
Twitterలో 140 అక్షరాల్లో కాదు.
మాటకి ఇంకో మాట చెప్పొచ్చు.
కానీ ఫలితం వచ్చిన రోజు…
చాలా మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు.
బహుశా అందుకేనేమో…
“చిరంజీవి” అనే పదం ఒక self-help book.
మన ముందు ఉన్న barriersని ఎలా దాటాలో చెప్పే ఒక virtual classroom.
Lifeలో ఎక్కడైనా stuck అయినప్పుడు…
“ఇదిగో… ఇలా కూడా ముందుకు వెళ్లొచ్చు” అని దారి చూపించే ఒక compass.
ఎందుకంటే.. ఆయన ఒక actor మాత్రమే కాదు… అంతకు మించి.
ఆయన entertainment మాత్రమే కాదు… అంతకు మించి …
మన మాటల్లో ఒక reference.
మన ప్రయత్నాల్లో ఒక inspiration.
మన కష్టాల్లో ఒక lesson.
మన నమ్మకంలో ఒక ధైర్యం.
అందుకే…
ఆయన కష్ట జీవి.. అందరికీ ఇష్ట జీవి..
మన మెగాస్టార్ చిరంజీవి !!
Birthday రేపు అయినా..
సంబరాలు మాత్రం ఈ నెలంతా...
అభిమానులు మాత్రం ఈ నేలంతా...
Happy Birthday, Boss! 👑🎉
#HappyBirthdayChiranjeevi #MegastarChiranjeevi #BossCelebrations @KChiruTweets@sushkonidela
In a world increasingly divided by extremes, true leadership is not about choosing the Left or the Right, it is about choosing what is right.
The Middle Path is not neutrality. It is the courage to rise above ideology, reject polarization, and put humanity first.
Whether it is Mr. @elonmusk or Sri @PawanKalyan, both envision the Middle Path, a philosophy that balances society, prioritizes humanity, and rises above ideological extremes.
#Ideology
మంచానికే పరిమితమైన ఓ నిరుపేదకు ప్రభుత్వం అందాల్సిన సాయం కూడా అందలేదు… కారణం ఒక్కటే ఆధార్ లేకపోవడం.
పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు ఎస్సీ పేటకు చెందిన గాలింకి లాజర్ గారి పరిస్థితి శ్రీ @PawanKalyan గారి దృష్టికి వెళ్లగానే వెంటనే స్పందించారు. అధికారులు ఆయన ఇంటికే వెళ్లి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, వైద్యం, పింఛన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు ప్రారంభించారు.
ప్రజల బాధ తన బాధగా భావించి వెంటనే స్పందించే నాయకత్వమే అసలైన ప్రజాసేవ.
కళాకారుల పిల్లలకు 10వ తరగతి తర్వాత ఉన్నత విద్యకు రాయితీలు లేదా ప్రత్యేక అవకాశాలు కల్పించాలని కళాకారులు కోరగా.
“ఇప్పుడే ఈ విషయం చెప్పారు కాబట్టి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం” అని హామీ ఇచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
అంతకుముందే, రాష్ట్రవ్యాప్తంగా కళాకారులందరికీ హెల్త్ చెక్-అప్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం ఆయన కళాకారుల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
My leader @PawanKalyan is unfairly targeted in #SugaliPreethi case for no fault of his.
Here’s is detailed thread divided on Legal-Administrative and Political Aspects to set the record straight.
@JanaSenaParty@JSPShatagniTeam (1/n)
Pawan Kalyan Garu is the Greatest inspiration For the Smart Kitchen Project & He named this As Dokka Seethamma Mid Day Meal
#PawanKalyan Donated 10L From His Own Money.
Right Now 12K meals Per day
From July 13th onwards 1L/Day 👏
- KADAPA District Collector.