ఒక కార్యకర్తగా మొదలై, శాసనసభ్యులుగా ప్రజలకు సేవలందించి, అతి పిన్న వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
BJP means Nation First. 🇮🇳🪷
Warm wishes to all karyakartas on the Foundation Day of @BJP4India.
Salute to every karyakarta who strengthened this organisation with hard work, sacrifice, and commitment. 🙏🏻
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, BJP is firmly moving towards a Viksit Bharat and Atmanirbhar Bharat.
#47YearsOfNationFirst
కరీంనగర్ జిల్లా :
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని రామయ్యను కోరుకున్నాను.
హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి రథోత్సవంలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ :
🔸ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన స్వయంభు దేవాలయం.
🔸వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టబడింది.
🔸ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ వేలాది గా తరలివచ్చి సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం మొదలుపెట్టి రథోత్సవం వరకు గొప్పగా నిర్వహించుకుంటున్నారు.
🔸జైశ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లుతుంది.
🔸ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవాలని పాత ఆలయం కి సౌకర్యాలు పెంచి గ్రామస్తుల సహకారంతో గొప్ప రథాన్ని నిర్మాణం చేసుకున్నాము.
🔸ఈ ఆలయ ప్రాంగణమంతా కొన్ని కోట్ల రూపాయలతో బాగు చేయించాము.
🔸వేలాదిమంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు, అనేక దైవిక కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా..ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని రెండు పెద్ద షెడ్డులు నిర్మాణం చేయడం జరిగింది.
🔸ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చేశాము. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసుకుందాము.
🔸వేలమంది భక్తులు ఇక్కడికి వచ్చేలా చేయడంలో ఇక్కడ ఉన్న యాజమాన్యం తోడ్పాటు అందించాలని కోరుతున్నాము.
🔸రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకున్నాను.
జై శ్రీరామ్..
హుజురాబాద్ ప్రజల గుండె చప్పుడు….
మల్కాజ్గిరి ప్రజల మనస్సులో స్థానం పొందిన
ప్రజా నాయకుడు….
తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్రతో ముందుకు సాగిన పోరాట యోధుడు… మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గసభ్యులు గౌరనీయులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
"For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion - we distribute it among friends, family and strangers alike, for it embodies our collective belief and profound faith. On average, nearly 2.5 crore devotees visit Tirumala every year. And when the sentiments and practices of Sanatanis are mocked or undermined, it is not merely hurtful; it shatters the trust and devotion of millions around the world.
Secularism must be a two-way street. Protection and respect for our faith cannot be negotiable. Our Sanatana Dharma is one of the oldest and ever-evolving civilizations and it's high time we establish the Sanatana Dharma Parirakshana Board." with the consensus of all the stakeholders.
#SanatanaDharmaParirakshanaBoard
జయ జయ హే తెలంగాణా జననీ జయకేతనం అంటూ..
తెలంగాణ అస్తిత్వ జయకేతనాన్ని ఎగురవేసిన తెలంగాణ ఆత్మ గౌరవ పొలికేక..
మనిషి మాయమవుతున్నాడంటూ
మానవత్వాన్ని ,మనిషి తత్వాన్ని శ్వాసించిన,
తెలంగాణ మట్టితనాన్ని ,మనిషితనాన్ని
విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ తాత్విక చైతన్య దీపిక..
మహామనిషి,తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన కవి అందెశ్రీ గారి మరణం తెలంగాణ ప్రజలకు,సాహిత్యలోకానికి తీరని లోటు
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ…
ఓం శాంతి 🙏
జోహార్ అందెశ్రీ!
ప్రజా కవి, రచయిత డా. అందెశ్రీ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తన అక్షరాలతో, పాటలతో కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాలను తాకిన ప్రజా కవి డా. అందెశ్రీ గారు.
ఆయన రచించిన వేలాది కవితలు, పాటలు తెలంగాణ భాష, సంస్కృతులకు అద్దం పట్టాయి. నిత్య జీవితంలోని కష్టాలను, ప్రకృతి అందాలు, మానవ సంబంధాలను ఆయన కవిత్వం పట్టి చూపింది. ఆయన నవలలు మరియు గేయాలు తెలంగాణ పల్లె జీవితాన్ని, ఆకాంక్షలను బలంగా ప్రతిబింబించాయి. "జయ జయహే తెలంగాణ జనని జయ కేతనం" గీతం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారింది. ఇది కేవలం ఒక పాట కాదు, దశాబ్దాల ఉద్యమ పతాక చిహ్నం. రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన కలం పాత్ర చిరస్మరణీయమైంది. ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక కావడం ఆయన సాహిత్యానికి దక్కిన గొప్ప గౌరవం. ఆయన మన మధ్య లేకపోయిన అందెశ్రీ పాటలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఆయన మరణం తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడికి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#AndeSri
నిరుద్యోగ భృతిని నీరుగార్చేసారు..
స్కూటీలు, ఆర్థిక సాయమని ఆడబిడ్డలను మోసం చేసారు.
పెన్షన్ల కోసం వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఎదురుచూస్తున్నారు..
అయినా కాంగ్రెస్ కి చీమ కుట్టినట్టు కూడా లేదు!
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడదాం..
జూబ్లీ హిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ కి బుద్ధి చెబుదాం!
#JubileeHillsWithBJP
తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం నిజాం - రజాకార్ల రాక్షస సైన్యంతో వీరోచితంగా పోరాడిన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కొమరం భీం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా ఘన నివాళులు
Birthday greetings to Home Minister Shri Amit Shah Ji. He is widely admired for his dedication to public service and hardworking nature. He has made commendable efforts to strengthen India's internal security apparatus and ensure every Indian leads a life of safety and dignity. Praying for his long and healthy life.
@AmitShah
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.
At Srisailam, in the divine presence of Lord Mallikarjuna and Goddess Bhramaramba, Hon’ble PM Shri @narendramodi ji offered prayers - invoking strength and grace for the nation.
Such moments remind us that beyond politics, India’s spirit lives in its temples, mantras, and timeless dharma.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
బిజెపి సీనియర్ నాయకులు శ్రీ సిద్దాల ఐలయ్య గారి సోదరుడు శ్రీ శంకర్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#BJP4Telangana