Union Minister of State for Heavy Industries & Steel, Govt of India 🇮🇳 |Member of Parliament, Narasapuram Loksabha |BJP Andhra Pradesh State Secretary.
నరసాపురం పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో నేడు లోక్ సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాను.నా జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా ఇది నిలిచిపోతుంది.
ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నరసాపురం ప్రజలే! మీ అందరి ప్రేమానురాగాలకు సదా కృతజ్ఞుడనై ఉంటూ,మీ ఆకాంక్షల మేరకు పనిచే��్తాను.
(1/2)
తాడేపల్లిగూడెంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నేడు VHP, RSS కృషి సహకారంతో, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూ ధర్మ వైభవం, హిందువుల అస్తిత్వం సగర్వంగా నిలబడ్డాయి. మతాలకు అతీతంగా పౌరులందరినీ సమానంగా ప్రేమించాలన్న శివాజీ మహారాజ్ ఆదర్శాలే... నేటి ప్రభుత్వ ‘సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్’ విధానానికి మూలస్తంభాలు!
@bjp4india@bjp4andhra@narendramodi@NitinNabin@shivprakashbjp@blsanthosh@ncbn@pawankalyan@BolisettiSrinu
#shivaji_maharaj #bjpvarma #narendramodi #chatrapatishivajimaharaj #bjpindia
నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ హత్యా దివస్’ సదస్సులో పాల్గొన్నాను.
1975 జూన్ 25న శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను ఎలా కాలరాసిందో, ఆ చీకటి రోజుల్లో దేశం ఎదుర్కొన్న అరాచకాలను న���టి తరానికి, ముఖ్యంగా యువతకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉందాం.
@bjp4andhra @bjp4india @narendramodi @NitinNabin @blsanthosh @shivprakashbjp
#samvidhanhatyadiwas #bjpvarma #ɴᴀʀᴇɴᴅʀ��ᴍᴏᴅɪ #bjpindia
ఈ రోజు వెంకటరామన్నగూడెంలోని డా|| వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క 19వ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై యూనివర్సిటీలోని విశిష్ట రక్షిత సాగు పరిశోధన మరియు శిక్షణ కేంద్రాన్ని సందర్శ��ంచడంతోపాటు నూతన పరిశోధనల గురించి శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నాను.
గడచిన 19 ఏళ్లలో ఉద్యానవన విద్య, పరిశోధన మరియు రైతు సేవలలో ఈ విశ్వవిద్యాలయం అత్యున్నత కేంద్రంగా ఎదగడం గర్వకారణం. ఈ సంస్థ నుండి పట్టభద్రులైన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో ఉన్నత పదవులను అలంకరించడమే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగడం అభినందనీయం.
పట్టభద్రులవుతున్న యువ విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, భారతదేశ పోషకాహార భద్రత మరియు గ్రామీణ సంపద సృష్టికి కీలకమైన ఆవిష్కరణలకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశాను.
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan @NitinNabin @blsanthosh @shivprakashbjp
#bjpvarma #drysrhorticulturaluniversity #venkataramannagudem
తాడేపల్లిగూడెంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ! అణగారిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, మహిళల గౌరవమే ధ్యేయంగా సాగిన శివాజీ మహారాజ్ సుపరిపాలనే నేటి “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” పాలనకు నిజమైన స్ఫూర్తి.
@bjp4andhra@bjp4india@narendramodi@ncbn@pawankalyan@BolisettiSrinu
#bjpvarma #tadepalligudem #chatrapathishivajimaharaj #sabkasathsabkavikas #narendramodi
1975 నాటి కాంగ్రెస్ ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.
కేవలం ఎమర్జెన్సీని వ్యతిరేకించారనే కారణంతో 24 ఏళ్ల వయసులోనే రాజ్‌నాథ్ సింగ్ గారిని జైల్లో పెట్టారు. కనీసం చావుబతుకుల్లో ఉన్న కన్నతల్లిని చూసేందుకు, ఆమె చనిపోతే అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా పరోల్ ఇవ్వలేదు!
అలాంటి వాళ్ళు ఈరోజు ఏ మొహం పెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు?
ప్రాథమిక హక్కులని కాలరాసి, కన్నతల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వని ఆనాటి రాక్షస పాలనేనా మీ ప్రజాస్వామ్యం?
దేశం కాంగ్రెస్ నియంతృత్వాన్ని ఎప్పటికీ మరువదు!
@bjp4andhra@bjp4india@narendramodi@rajnathsingh
#SamvidhanHatyaDivas
#DarkDaysOfEmergency
Wishing the Hon'ble Union Minister of Education and Skill Development & Entrepreneurship, Shri @dpradhanbjp Ji, a very Happy Birthday. May you be blessed with good health, happiness, and a long life to continue your dedicated service in shaping the educational landscape and empowering the youth of our nation.
Delighted to meet Her Majesty Queen Máxima of the Netherlands, who is also the UN Secretary General's Special Advocate for Financial Health and a long-standing global voice for financial inclusion.
We discussed how India’s Digital Public Infrastructure led revolution is making financial services more accessible and affordable, while enhancing ‘Ease of Living’ and empowering people at scale.
India remains committed to sharing its experience with partner countries across the world.
@UNSGSA
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన ‘ఫుడ్ కోర్టు’ను స్థానిక ఎమ్మెల్యే, విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించాను.
పెద్ద నగరాలకే పరిమితమైన “ఫుడ్ స్ట్రీట్” కల్చర్‌ను తాడేపల్లిగూడెంకు తీసుకురావడం ఎంతో ఆనందదాయకం. ఆహార ప్రియుల కోసం ఒకేచోట 49 షాపులను ఏర్పాటు చేయించి ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు.
@bjp4andhra@bjp4india@narendramodi@ncbn@pawankalyan@bolisettisrinu
#bjpvarma #sabkasaathsabkavikas #bolisettisrinivas #tadepalligudem
తాడేపల్లిగూడెంలో శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించాను.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” అనే సమగ్ర పాలనా విధానానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ సుపరిపాలనే నిజమైన చారిత్రక ఆదర్శం. ��ణగారిన వర్గాల అభ్యున్నతి, రైతుల పట్ల శ్రద్ధ, మహిళల పట్ల అపారమైన గౌరవంతో ఆయన సాగించిన ‘హిందవీ స్వరాజ్య’ స్థాపన నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. విగ్రహం ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాన్ని ఇకపై ‘శివాజీ సెంటర్’గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు ప్రకటించడం హర్షణీయం.
ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ అఖిలభారత సహసంయోజక్ ఏలే శ్యామ్ కుమార్ జీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై!
భారత్ మాతా కీ జై!
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @PawanKalyan @BolisettiSrinu @NitinNabin @blsanthosh @shivprakashbjp @BJPMadhukarAP
#bjpvarma #chatrapatishivajimaharaj #tadepalligudem #bolisettisrinivas
A great meeting with Mr. Andy Jassy. I welcome Amazon's record $48 billion investment in India. This will create new opportunities for our youth. At the same time, it shows the growing interest across the world to invest in India!
@amazon
संविधान हत्या दिवस आज हमें उस काले दौर की याद दिला रहा है, जब भारतीय लोकतंत्र को बुरी तरह से कुचला गया था। यह हमें लोकतंत्र, संविधान और नागरिक अधिकारों ��ी रक्षा के लिए हमेशा प्रतिबद्ध रहने को प्रेरित करता है। आपातकाल का विरोध करने वाली सभी विभूतियों को सादर नमन।
स्वातन्त्र्यात् सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम्।
स्वातन्त्र्यान्निर्वृत्तिं गच्छेत् स्वातन्त्र्यात् परमं पदम् ।।
#SamvidhanHatyaDiwas
మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) తుది దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ గారితో కలిసి APL టోర్నీ ట్రోఫీని మరియు జెర్సీలను ఆవిష్కరించాను. ఈ టోర్నీలో పాల్గొంటున్న యువ క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
@bjp4andhra@bjp4india@narendramodi@ncbn@pawankalyan @andhrapremierleague @alwaysramcharan
#ramcharan #bjpvarma #andhrapradeshpremierleague #mangalagiri #peddi
ఈరోజు సాయంత్రం తాడేపల్లిగూడెంలో జరగనున్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగేలా పలు సూచనలు అందజేశాను.
@bjp4andhra@bjp4india@narendramodi@ncbn@pawankalyan@BolisettiSrinu
#chatrapathishivajimaharaj #bjpvarma #tadepalligudem
#APL2026 ర���జధాని అమరావతిలో క్రికెట్ జాతర... మంగళగిరి స్టేడియంలో మెగా పవర్ వైబ్స్
మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 అత్యంత వైభవంగా ప���రారంభమైంది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారుల్లో నూతోనోత్సహాన్ని నింపారు.
ఈ సందర్భంగా క్యాపిటల్ అమరావతి వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు రామ్ చరణ్ గారు టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ అద్భుత ఆవకాశమని పేర్కొన్నారు.
రాజధాని అమరావతి బ్రాండ్ ఇ��ేజ్... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్... ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మైదానంలో పరుగుల సునామీ.. నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఫీవర్ మధ్య.. భారీ సంఖ్యలో అభిమానులు, క్రీడాభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ మెగా క్రికెట్ పండగలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (@BjpVarma) గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ @KesineniS గారు తదితరులు పాల్గొన్నారు.
@Andhra_Cricket_
@AndhraT20League
@naralokesh
@JayShah
@BCCI
#Ramcharan
#Mangalagiristadium
#AndhraPremierLeague
#ACAstadium
#mpsanasathishbabu
మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) చివరి దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నాను. ప్రముఖ హీరో రామ్ చరణ్ గారితో కలిసి ఈ టోర్నీ ట్రోఫీ, క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించాను.
“ఎవరైతే ఆడతారో.. వారే వికసిస్తారు” (జో ఖేలేగా.. వో ఖిలేగా) అన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో, మన యువ క్రికెటర్లలో దాగిన అద్భుతమైన ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్���ోత్సహించేందుకు ఈ లీగ్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాలుపంచుకుంటున్న క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan @AndhraT20League @AlwaysRamCharan
#ramcharan #bjpvarma #andhrapradeshpremierleague #mangalagiri #peddi
ఈరోజు హైదరాబాద్‌లో పద్మవిభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి జీవన ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయులు శ్రీ మాశర్మ గారు రచించిన “వెంకయ్య ‘నాయకుడు’” పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నాను.
నెల్లూరు జిల్లా చవటపాలెంలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి భారత ఉపరాష్ట్రపతిగా దేశ రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆయన ఐదు దశాబ్దాల నిస్వార్థ ప్రజాసేవ మాకందరికీ స్ఫూర్తిదాయకం.‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ ద్వారా దేశ గ్రామీణ రూపురేఖలను మార్చిన కృషి. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ ద్వారా ఎన్నో కోట్ల మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు అందించి, వారి సొంతింటి కలను నిజం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషి, క్రమశిక్షణ, విలువలతో కూడిన ఆదర్శవంతమైన రాజక���య జీవితాన్ని అద్భుతంగా అక్షరబద్ధం చేసిన రచయిత శ్రీ మాశర్మ గారికి ప్రత్యేక అభినందనలు. ఆ భగవంతుడు శ్రీ వెంకయ్య నాయుడు గారికి నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan @nitinnabinbjp @blsanthosh @shivprakashbjp @MVenkaiahNaidu @kishanreddybjp @satyakumar_y
#bjpvarma #venkaiahnaidu #booklaunch #narendramodi