Deeply shocked and saddened by the sudden passing of Payal Mehta, senior journalist, Network18.
Payal was a sincere and dedicated journalist who always went the extra mile for a story. She travelled to Andhra Pradesh on several occasions to report from the ground, and whenever we met in Parliament, she would make it a point to reach out and share updates.
What I will remember most is her enthusiasm, her commitment to journalism, and the warm smile with which she approached everyone.
My heartfelt condolences to her family, friends and colleagues at Network18. Her untimely passing is deeply saddening. Om Shanti.
విశాఖ వేదికగా పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేశాం. రూ.8,874 కోట్ల విలువైన భూములపై 28,445 పేద కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందించిన వేళ, వారి కళ్లల్లో చూసిన ఆనందం అతిపెద్ద సంతృప్తి ఇచ్చింది. ఇటు పేదలకు భరోసా, భద్రత కల్పించేలా పట్టాలు అందించాం. అటు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నాను. విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ... ప్రతి పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#PedalakuPattabhishekam
#MeeilluMeeHakku
I’m delighted to welcome Mazagon Dock Shipbuilders Limited to Andhra Pradesh! The Navratna Defence PSU will anchor a modern greenfield shipyard at Dugarajapatnam, with an investment of around ₹15,000 crore over the next 5–7 years and the potential to create nearly 45,000 direct and indirect jobs.
This is a major boost to Andhra Pradesh’s maritime ambitions. With our long coastline, strategic location and strong industrial ecosystem, we are determined to be at the forefront of India’s journey to become one of the world’s top five shipbuilding nations by 2047.
The Dugarajapatnam cluster will catalyse a wider ecosystem across shipbuilding, ship repair, marine engineering, manufacturing, logistics and allied industries.
We will extend every support to MDL to turn this ambitious project into a world-class shipbuilding hub.
@MazagonDockLtd
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది...
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.....
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది...
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.
దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.
సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
It was my pleasure to attend the ‘Varanasi–Vadnagar Seva Sankalp Abhiyan’ in the holy city of Kashi today and celebrate Hon’ble PM Shri @narendramodi ji’s inspiring 25-year journey of selfless service.
Prior to the event, offered prayers at the Shri Kashi Vishwanath Temple alongside Hon'ble Union Defence Minister Shri @rajnathsingh ji, Union Minister Shri @ichiragpaswan ji, and UP Chief Minister Shri @myogiadityanath ji, seeking peace and prosperity for all Indian citizens.
Andhra Pradesh remains fully committed to the unity of the NDA and the progress of our nation. NDA’s strength lies in our unity, and a 'Viksit Bharat' is our shared mission!
#HarHarMahadev
#JaiShreeRam
సమస్త విశ్వానికి దివ్య వాస్తుశిల్పి, సృష్టికర్త, కళా నైపుణ్యానికి ప్రతీక శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. విశ్వకర్మ భగవాన్ను సృజన, నైపుణ్యం, నిర్మాణానికి ఆదిపురుషుడిగా భారతీయ సమాజం గౌరవిస్తుంది. తమ నైపుణ్యంతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వకర్మ భగవాన్ స్ఫూర్తి కనిపిస్తుంది. శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ప్రతి శ్రామికుడి చేతికి గౌరవం, ప్రతి నైపుణ్యానికి గుర్తింపు, ప్రతి సృజనకు ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాను.
Warmest birthday greetings to Hon’ble Prime Minister Shri @narendramodi Ji!
As India's longest-serving democratically elected Prime Minister, your leadership has been truly historic. Marking 25 exemplary years of public service, from leading Gujarat as a transformational CM to guiding the nation as a revolutionary PM, you have given a new momentum to India's growth story.
Your vision of 'Seva, Sankalp, and Sushasan' continues to inspire 140 crore citizens across the nation.
May Lord Venkateswara bless you with a long, healthy, and prosperous life in service to Bharat.
#HappyBdayPMModi #SevaSankalpAbhiyan
ఓం నమో వేంకటేశాయ.
శ్రీవారి సన్నిధిలో ప్రతి భక్తుడూ ప్రశాంతతను, దివ్యానుభూతిని పొందేలా ప్రపంచ స్థాయి మోడల్ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. ఆ దిశగా ఈ రోజు మరికొన్ని అడుగులు పడ్డాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సు లో పిలిగ్రిమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, సరి కొత్త హంగులతో తీర్చిదిద్దిన శ్రీవారి మ్యూజియాన్ని ప్రారంభించాను. ఆధ్యాత్మికతకు సాంకేతికత జోడైతే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఈ కేంద్రాల సందర్శన తెలియజేస్తుంది. ఈ రోజు ప్రారంభించిన ఈరెండు విభాగాలు తిరుమల క్షేత్ర విశిష్టత, ఏడు కొండల వాడి పురాణ చరిత్ర మరింత అద్భుతంగా తెలియజేస్తూ తిరుమల కొండకు వచ్చిన భక్తులకు మరింత దివ్యానుభూతిని కలిగిస్తాయి. అదే విధంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను, తిరుమల వచ్చే భక్తుల కోసం తీసుకువచ్చిన ఇన్స్యూరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమాలకు పెద్ద మనసుతో ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన దాతలకు నా ధన్యవాదాలు, అభినందనలు.
@TTDevasthanams
పల్నాడు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజానేత, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, పల్నాడు ప్రగతి కోసం ఆయన చూపిన దార్శనికత ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
ఓం నమో వెంకటేశాయ:
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది. స్వామివారి కృపతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను. ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం ఆ వేంకటేశ్వరుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ 2027 కేలండర్, డైరీలను ఆవిష్కరించాను. బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న టీటీడీ బోర్డుకు, అధికారులకు, యంత్రాంగానికి అభినందనలు.
@TTDevasthanams
The energy, enterprise and ideas of our youth are the driving force behind our vision for a Swarna Andhra Pradesh!
I look forward to joining the PanIIT Andhra Pradesh Summit 2026 in Vijayawada on October 3.
Andhra Pradesh is emerging as a hub for the technologies that will shape the future, from AI and quantum computing to deep-tech, space-tech, clean energy, data centres and advanced manufacturing. Here, we are building an ecosystem where talent finds opportunity & technology drives growth.
I invite our young innovators, entrepreneurs, IIT alumni and technology leaders to be part of this journey. Bring your ideas, expertise and ambition. Together, let us build the blueprint for #SwarnaAndhra2047 and contribute to #ViksitBharat2047.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో ఆయన దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ ఇంజనీరింగ్ రంగంలో శిఖర సమానులు భారతరత్న డాక్టర్.మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ.. వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని తలమానికంగా నిలబెట్టేందుకు ఎనలేని సేవలు అందిస్తున్న ఇంజనీర్లు అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
#EngineersDay
From the archery grounds of Vijayawada to the top of the global podium in Mexico! History has been made!
Heartiest congratulations to Dhiraj Bommadevara on becoming the FIRST Indian male archer to win individual Gold at the Archery World Cup Final!
Today, the entire state of Andhra Pradesh and the nation are beaming with pride as you have ended a 16-year wait for India, sealing victory with a flawless 10 in the final shoot-off.
Dhiraj, you have shown the world what relentless grit, focus and determination can achieve. You are an inspiration to the immense talent across our state. Wishing you immense success. Keep hitting the bullseye!
@BommadevaraD
#ArcheryWorldCup
#DhirajBommadevara
ఓం గణేశాయ నమః
వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
@ManagingTrustee