ఉద్యమకాల సహచరుడు, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడు, ఆత్మీయుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో, శోకతప్త హృదయులై, కష్టకాలంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
#kcr#peddisudharshanreddy#brsaprty
వరంగల్ జిల్లాకు చెందిన RVR గ్రానెట్స్ అధినేత ఆర్. వేంకటేశ్వరరావు గారికి ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకుని, హైదరాబాద్‌లోని వారి నివాసానికి నా సతీమణితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించాము.
తెలంగాణ భవన్లో దివంగత బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు.
మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన వికాస్ కాలేజీ అధినేత ఏనుగుతల ఉప్పలయ్య గారి తల్లి ఏనుగుతల భద్రమ్మ ఇటీవల మరణించగా వారి స్వగృహం వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది.
మహబూబాబాద్ మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకులు గూగులోత్ లచ్చిరాం గారు ఇటీవల మరణించగా, వారి పార్థివ దేహాన్ని సందర్శించిన పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది.
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునివాళి 🙏
పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా నా తల్లిగారి ఆశీస్సులు తీసుకుని, అనంతరం నా సతీమణితో కలిసి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
"గురువు ఆశీస్సులు – తల్లి దీవెనలు – ప్రజల సంక్షేమమే మా లక్ష్యం."
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన కేసీఆర్ గారు.
ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ గారికి తెలిపిన యశోద డాక్టర్లు.
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు.
దాదాపు అరగంట సేపు అక్కడే నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ గారు స్పష్టం చేశారు.
ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి భరోసాను, ధైర్యాన్ని కేసీఆర్ గారు అందించారు.
డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... 👇🏻
"మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.
కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, దవాఖానా డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు జేఎస్ రావు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు... భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లి స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యాన్ని భరోసాను నింపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారితో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బాల్క సుమన్, మాలోత్ కవిత, గ్యాదరి బాలమల్లు, సతీష్ రెడ్డి, రజిని సాయి చంద్, పల్లె రవికుమార్, రాజారాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న
డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను...
#ambedkarjayanthi
మహబూబాబాద్ అభివృద్ధికి కీలకమైన మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ (POH/ROH) ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.
#TelanganaDevelopment
సెంట్రల్ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారితో కలిసి కాజిపేట్ను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
శాంతి, సహనం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలను మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం మన అందరికీ ఆదర్శం
మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు
#mahavirjayanthi
షడ్రుచుల సమ్మేళనంలా జీవితానుభవాలను సమంగా స్వీకరిస్తూ.. నవోత్తేజంతో కొత్త ఆశయాల దిశగా పయనించాలని ఆకాంక్షిస్తూ.. తెలుగు ప్రజలందరికీ
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#happyugadi#manukota#mahabubabad
విద్య ద్వారానే వనితకు విముక్తి అని నమ్మిన మహిళా చైతన్యమూర్తి, బాలిక విద్య ఉద్యమానికి పునాది వేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు...