BJP AP State Executive Member, Srikakulam Parliament Incharge,Former President: Vizianagaram Dist, Former President: BJYM (Yuva Morcha) Former President: ABVP.
అమ్మ పేరుతో ఒక మొక్క... భవిష్యత్ తరాలకు ఒక గొప్ప బహుమతి..ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ Narendra Modi గారు ఇచ్చిన "అమ్మ పేరుతో ఒక మొక్క" పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి, దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో మన మంతా భాగస్వాములమవుదాం.
#విజయనగరంజిల్లా47వఆవిర్భావదినోత్సవశుభాకాంక్షలు
సంగీత, సాహిత్య, నాటక, కళా, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట గుర్తింపు పొంది విద్యలనగరంగా విరాజిల్లుతున్న విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
విశాఖపట్నం కేంద్రంగా నాలుగు డివిజన్లతో 18 వ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా నేడు ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి.ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని శ్రీ Narendra Modi గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి Ashwini Vaishnaw గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
ఈరోజు విశాఖపట్నం కాకతీయ కన్వెన్షన్ లో జరిగిన భాజపా సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి,హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు రచించిన "ప్రజల కధే నా ఆత్మకథ" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా...
జి.ఆర్. కరుణాకర్ గారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులు.సిద్ధాంత నిబద్ధతతో పని చేసిన కార్యకర్త. విలువలతో పార్టీ కోసం రాజీలేకుండా నడిచిన నాయకులు. కార్యకర్తలతో మమేకమైన కరుణాకర్ గారి మరణం బాధాకరం.వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ నివాళులు.
వరుసగా రెండుసార్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని ఓడించిన సువేందు అధికారి గారిని శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ప్రకటించిన అమిత్ షా గారు.
పశ్చిమ బెంగాల్ తొలి భాజపా ముఖ్యమంత్రిగా రేపు ఉదయం పదవీ ప్రమాణస్వీకారం చేయనున్న సువేందు అధికారి గార్కి శుభాకాంక్షలు.
పెద్దలు శ్రీ ధవళ సర్వేశ్వరరావు గారు శ్రీ మద్వాల్మీకి రామాయణ పారాయణ 108 ఆవృత్తులు పూర్తి చేసిన సందర్భంగా విజయనగరం శంకరమఠంలో వారం రోజులపాటు నిర్వహించిన శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో ఈరోజు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు అభినందనలు.
50 ఏళ్ళుగా ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి అరాచకంతో, గూండా,హత్యా రాజకీయాలతో అక్రమవలసదారుల అండతో పరిపాలన సాగించిన కమ్యూనిస్టు,తృణమూల్ పాలనకు నేటితో ప్రజలు ముగింపు పలికారు.
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు మాజీ కేంద్రమంత్రి శ్రీమతి Daggubati Purandeswari గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రాజకీయాల్లో మీ విశిష్ట అనుభవం, ప్రజాసేవలో మీ కృషి స్ఫూర్తిదాయకం. మీరు మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపిస్తూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మరింత శక్తివంతంగా మీ నాయకత్వం ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
విజయనగరం విచ్చేసిన గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని వారి బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు అనేక గత సందర్భాలు గుర్తు చేయడం,పలు అనుభవాలను మాతో పంచుకోవడం, పలు సూచనలు చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది.
భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన,సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ అందరికి ఆదర్శప్రాయులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ,గ్రామీణ పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత మరియు సత్సంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రముఖ గాయని పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆశా భోస్లే గారి మరణం తీవ్ర విచారకరం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భారతీయ గాయనిగా, ఆమె సంగీత చరిత్రలోనే అత్యధికంగా పాటలు పాడిన కళాకారిణి సంగీత పరిశ్రమకు ఏడు దశాబ్దాలకు పైగా సేవలందించారు ఆమె స్మృతికి ఘన నివాళులు.
భారతీయ జనతా పార్టీ స్థాపనా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఇంటిపై మన జెండా...
భారతీయ జనతా పార్టీ నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులను స్మరించుకుంటూ నాయకులకు, మరియు అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
హనుమంతుడు శక్తి, అసమానమైన భక్తి, నిస్వార్థ సేవకు ప్రతీక.. మన అందరి పై ఆయన తన దివ్య ఆశీర్వాదాలను కురిపించాలని కోరుకుంటూ...
హనుమాన్ విజయోత్సవం పర్వదిన శుభాకాంక్షలు.
శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం.