గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి తెలంగాణలో రెండు రోజుల పర్యటన ముగించుకొని తిరుగుపయనం వెళ్తుండగా ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయంలో జిహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ వీడ్కోలు పలికారు..
@rashtrapatibhvn
పచ్చని గడ్డిఅన్నారం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి – బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని శారదానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందజేసిన - బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్లో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ BLAలు మరియు BLO (Booth Level Officers)లతో కలిసి పలు బూత్‌లను సందర్శించారు.
దిల్‌సుఖ్‌నగర్‌లోని లోటస్ లాప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో చైర్మన్ కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాహితినగర్ కాలనీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాహితినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు సమావేశమై కాలనీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసమే లక్ష్యంగా..
పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపేందుకు విచ్చేస్తున్న
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి హృదయపూర్వక స్వాగతం - సుస్వాగతం..
#TelanganaWelcomesNitinNabin
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి - బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సిండికేట్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా, రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి తెలంగాణ ఘన స్వాగతం పలుకుతుంది...
#TelanganaWelcomesNitinNabin
సరూర్‌నగర్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన - బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
సరూర్‌నగర్ చెరువు బండ్ బలోపేతం, సుందరీకరణ పనులను బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఈరోజు ఉదయం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలానగర్ కాలనీ వాసులు శ్రీ రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు హయత్‌నగర్‌లో నిర్వహించిన వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ప్రజలకు అవసరమైన కొత్త అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేట్లను వెంటనే సిద్ధం చేయాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అధికారులను కోరారు.
గడ్డిఅన్నారం డివిజన్ భారతీయ జనతా యువ మోర్చా సీనియర్ నాయకులు మొగిలి శివ రామ్, శారద నగర్ కాలనీవాసులు శరత్ గారి జన్మదిన సందర్బంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో న్యూ గడ్డిఅన్నారం కాలనీలో మొక్కల నాటి కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, మహోన్నత విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా గౌతమ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాను.
జయశంకర్ సార్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి.
#ProfJayashankar#Telangana#Tributes