నర్సాపురం దెగ్గిర మొగల్తుర్రు మా కాపుర స్థలం, మా ఇంటిపేరు వేమూరి వారు, నేను టేలర్ హైస్కూలు లో 5వ ఫారం వరకు చదువుకున్నాను.
మా ఊళ్లోకెల్లా తెలివైన వాడిని.
ఈ కస్తూరి పూర్ణ వేంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద శర్మ వేషధారణ ఇంచుమించు నాలాగే ఉన్నా నాకంటే వెర్రిబాగులోడిలా ఉన్నాడు.
ఉన్నాడు సరే, సముద్రం దాటి, విదేశాలకు వెళ్లిన అనుభవం ఉండి, ఆతాలూకా కష్టసుఖాలు తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా అని తెలుసుకోవాలన్న ఇంగితం లేనివాడు.
#AnteSundaraniki
మేనకోడలి కోసం ఫ్రిజ్జిలో దాచిన KitKat ముక్క దొంగిలించినందుకు నా క్లయింటుకు విధించిన 4 గుంజీల కఠిన శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నాను, దయచేసి మనవతా ధృక్పధంతో మిగతా ముక్క కూడా తినేసి కొత్త KitKat తెచ్చి పాపకి తెలియకుండా ఫ్రిజ్జిలో పెట్టేలా తీర్పు సవరిస్తారని వేడుకుంటున్నాను.
అప్పుడెప్పుడో బారిష్టర్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళడానికి మా ఊళ్ళో నా మిత్రుడి దగ్గర మూడు వందలు అప్పు తీసుకున్నాను, అవి వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీ inflation adjustment అంటూ ఇప్పటికీ వడ్డిలే కడుతున్నాకానీ అసలు తీరింది లేదు..
మీకు అప్పు ఇచ్చే పరిస్తితి అసలే లేదు. 🙏
ఈటీవీలో పడమటి సంధ్యారాగం సినిమా.
బారిష్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు నా వ్యవహారమంతా ఈ సినిమాలో గుమ్ములూరి శాస్త్రి గారు పోషించిన ఆదినారాయణ పాత్రలాగానే ఉండేదని అందరూ అంటూ ఉంటారు.
పిల్లవాళ్ళందరూ పల్లెటూర్లలో స్థిరపడిపోయి వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటర్నెట్ కోసం రౌటర్లతో, హాట్ స్పాట్లతో కుస్తీలు పడుతూ హడావిడి చేస్తూ ఉంటే, పెద్దవాళ్లంతా "వీళ్ళు ఆఫీసుల్లో వెలగబెట్టే ఘనకార్యం ఇదేనా?" అంటూ నవ్వుతూ ముక్కున వేలేసుకుంటున్నారు.. 🤔
మరి ఆరోజు నేను నిడదవోలు నుండి చెన్నపట్నం వెళ్లే రైలులో వేరే ఎవరూ ఎక్కకూడదు నేనొక్కడినే వెళతాను అంటే మీరంతా నవ్వారు?
ఈరోజు బస్సుల్లో రైళ్లలో సీట్లు తీసేసి తిప్పుతున్నారు.
మీ అందరికీ ఈ పరిస్తితి కొత్తేమో కానీ నాకు కాదు.
#PhysicalDistancing
ఆంధ్ర, తెలంగాణ మిత్రులకు మనవి
మన తెలుగు యూనీకోడును సంకరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
మన యూనీకోడులోకి రెండు తమిళక్షరాలను చొప్పించడానికి ప్రయత్నాలు
జరుగుతున్నాయి
దీన్ని తెలుగుజాతిగా మనందరం వ్యతిరేకించాలి
-@vennelarajyam#AgainstTamilLettersinTeluguUnicode
తెలుగు భాష #Unicode లో తమిళ అక్షరాలు జోడించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్న #AgainstTamilUnicodeInTelugu ఉద్యమానికి స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నా
స్వాతంత్య్ర సంగ్రామమంత పెద్ద ఉద్యమం కాకపోయినా స్పూర్తిలో ఏమాత్రం తక్కువ కాదని తెలుగు వారమంతా ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపు ఇస్తున్నా..