గుంటూరు నగర అభివృద్ధికి కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారికి ప్రజలందరూ మద్దతుగా నిలిచి, భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు కోరారు. నాని గారి అనుభవం, కూటమి నాయకుల సహకారంతో గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
#BhashyamRamakrishna #KovelamudiLakshmiAparna #Guntur #GunturDevelopment #TDP
Union Home Minister Shri Amit Shah Ji has been a visionary leader whose unwavering commitment to national security, good governance, and the development of India continues to inspire millions.
On the occasion of his birthday, I extend my heartfelt wishes for his good health, happiness, and a long life dedicated to the service of our nation.
Happy Birthday, Hon’ble Shri Amit Shah Ji!
May you continue to lead India with strength, wisdom, and dedication.
#amitshah #BhashyamRamkrishna
పాలకొల్లులో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నేతల సమావేశం
నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని పాలకొల్లు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారితో కలిసి పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని ఆయన నివాసంలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాయకులు చర్చించారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు, సమన్వయ లోపాలకు తావులేకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల వరకు మూడు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని చర్చించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపైనా సమాలోచనలు జరిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు చర్చించారు.
#BhashyamRamakrishna #GottipatiRaviKumar #NimmalaRamanaidu #TDP #AndhraPradesh
నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం 17వ వార్డులో కొలువై ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారు, తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ వలవల బాబ్జి గారు పాల్గొన్నారు.
#BhashyamRamakrishna #TDP #Tadepalligudem #AndhraPradesh #శ్రీవిశ్వదుర్గేశ్వరిఅమ్మవారు
నేడు నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, నర్సాపురం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై, స్థానిక స్థాయిలో కూటమి శ్రేణుల సమన్వయంతో ముందుకు సాగాల్సిన కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది.
పెద్దపరిమి గ్రామంలో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#BhashyamRamaKrishna#Pedaparimi#DasaraNavaratri#AmmaVariPuja #AndhraPradesh
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారికి రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
#BhashyamRamakrishna #KanakaDurgaAmma #RajaRajeshwariDevi #DasaraNavaratri #AndhraPradesh
జగన్ దర్శకత్వంలో
స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో
ప్రకాశం జిల్లా దర్శిలో గొడ్డలి పార్టీ గుండాలు బీభత్సం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వేల మంది కర్రలు, రాడ్లతో వచ్చి దాడులకు తెగబడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అరాచకం రోజురోజుకూ శృతిమించిపోతోంది.
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఈరోజు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారిని, నరసాపురం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని మరింత బలోపేతం చేయడం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణ, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. సమష్టి కృషి, పటిష్టమైన వ్యూహాలతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సమావేశంలో చర్చించాం.
#TDP #Narasapuram #Achanta #AndhraPradesh #Alliance
ఈరోజు ఉదయం నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే శ్రీ నిమ్మల రామానాయుడు గారిని నర్సాపురం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారు, మాజీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు, కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
#NimmalaRamaNaidu #MantenaRamaraju #MagantiBabu #TDP #AndhraPradesh
నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రఘురామ కృష్ణంరాజు గారిని భీమవరంలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించాము.
కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ, ఎన్నికల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఈ సందర్భంగా కోరాను.
నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి, నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చాను.
#AndhraPradesh #RaghuRamaKrishnamRaju #Narasapuram #PoliticalMeeting #LocalBodyElections
ఈరోజు నరసాపురం పార్లమెంట్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారు, బీజేపీ నాయకులు మరియు కూటమి ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించడంతో పాటు కూటమి నాయకులందరూ సమన్వయంతో పనిచేసి నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమికి అత్యధిక విజయాలు సాధించేలా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించాము.
ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈరోజు గుంటూరు నగరంలోని ఆరండల్‌పేటలో నూతనంగా ప్రారంభమైన బేక్ సర్కిల్ బేకరీ (Bake Circle Bakery) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ, వినియోగదారుల ఆదరణతో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#BakeCircleBakery #Guntur #Arundalpet #BakeryInauguration #BusinessInauguration #NewBeginnings #Entrepreneurship #BestWishes
ఈరోజు గుంటూరులోని చంద్రమౌళి నగర్ 3వ లైన్లో ఉన్న భాష్యం MIIT క్యాంపస్‌లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, జగన్మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
జగన్మాత దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం, సర్వసౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను.
జై మాతా దీ! 🙏
#DeviSharannavaratri #BhashyamMIIT #Guntur #JaiMataDi
గుంటూరు నగరంలోని గోరంట్ల, ఆదిత్య రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భాష్యం అవని క్యాంపస్ గృహప్రవేశ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం ఆనందంగా అనిపించింది.
అత్యాధునిక సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ క్యాంపస్ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ క్యాంపస్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, మరెన్నో విజయాలను సాధించి విద్యా రంగంలో భాష్యం విద్యాసంస్థల పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు గుంటూరు జిల్లా గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని, అమ్మవారికి మరియు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాను.
అనంతరం స్వామివారి మహాప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ అధికారులతో మాట్లాడి, నవరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని సూచించాను.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#SriDeviNavaratri #VenkateswaraSwamy #Gorantla #Guntur #NavaratriMahotsavam
ఈరోజు విజయవాడలోని కానూరులో నూతనంగా ప్రారంభమైన డాక్టర్ హర్షితాస్ అడ్వాన్స్డ్ స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
డాక్టర్ హర్షిత గారు భాష్యం విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. భాష్యం విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, అత్యున్నత స్థాయిలో రాణిస్తుండటం ఎంతో గర్వకారణం.
ఈ క్లినిక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన చర్మ వైద్య సేవలు అందిస్తూ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించి మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
డాక్టర్ హర్షిత గారికి, వారి బృందానికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.
#DrHarshitha #AdvancedSkinClinic #Kanuru #Vijayawada #BhashyamStudents
చలపతి యూనివర్సిటీలో నిర్వహించిన చెస్ పోటీల కార్యక్రమంలో ప్రముఖ భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి గారితో కలిసి చలపతి యూనివర్సిటీ చైర్మన్ వై.వి. ఆంజనేయులు గారు, గౌరవనీయ ఎంపీ శ్రీ భాష్యం రామకృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ భాష్యం రామకృష్ణ గారు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి గారితో స్నేహపూర్వకంగా చెస్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
యువతలో మేధస్సు, ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించే చెస్ క్రీడకు ప్రోత్సాహం అందించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.
#BhashyamRamaKrishna #KoneruHumpy #ChalapathiUniversity #ChessCompetition #Guntur