విధి నిర్వహణలో మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో గురువారం ఉన్నతాధికారులతో కలిసి 12 మంది ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు.
ఈ నెల 2వ తేదిన గజ్వేల్ ప్రజ్జాపూర్ డిపోనకు చెందిన బస్సులో జగదేవ్‌పూర్ వద్ద ఒక ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన కండక్టర్ ఓం ప్రకాశ్, డ్రైవర్ సలీమ్ బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులో రూ.15 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.50 లక్షల నగదు ఉంది. వెంటనే డిపో అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై సహాకారంతో రూ.18 లక్షల విలువైన ఆ బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తమ నిజాయితీని నిరూపించుకున్నారు.
మరోక ఘటనలో.. బాన్సువాడ డిపో బస్సులో ఈ నెల 4వ తేదిన ఒక ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయారు. సంగారెడ్డి బస్ స్టేషన్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు అతడు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే వారు జోగిపేట కంట్రోలర్ జన్నుబాయికి సమాచారం చేరవేశారు. జోగిపేటలో కండక్టర్ బస్వరాజు సాయంతో ఆ బ్యాగును జన్నుబాయి తీసుకుని.. ప్రయాణికుడికి అందజేశారు. అందులో రూ.2.50 లక్షల నగదుతో పాటు ఒక ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ ఉంది.
మణుగూరు డిపోనకు చెందిన డ్రైవర్ మహేశ్ గత నెల 28న అమలాపురం సర్వీసులో విధులు నిర్వహిస్తుండగా.. అశ్వారావుపేటలో ఒక ప్రయాణికుడు పర్సును మరిచిపోయారు. అందులో రూ.లక్ష నగదు ఉంది. పర్సులో ఉన్న గుర్తింపు సమాచారంతో ప్రయాణికుడికి ఫోన్ చేసి మానవత్వంతో పర్సును డ్రైవర్ అందజేశారు.
అలాగే, కల్వకుర్తి డిపోనకు చెందిన కండక్టర్ ప్రసాద్, డ్రైవర్ అనిల్ కుమార్‌లు.. 2 లక్షల విలువైన బ్యాగ్‌ను ప్రయాణిడికి అందజేశారు. అదే డిపోనకు చెందిన కండక్టర్ ప్రసాద్, బాలరాజులు ఈ నెల 25న బస్సులో మరిచిపోయిన ల్యాప్‌టాప్‌ను ప్రయాణికుడికి అప్పజెప్పారు. దేవరకొండ బస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేస్తోన్న ముత్తమ్మ.. ప్రయాణికుడి మరిచిపోయిన రూ.30 వేల విలువైన ఫోన్‌ను అందజేశారు.
ఆదిలాబాద్ డిపో కండక్టర్ రమణ, డ్రైవర్ గులాబ్లు గత నెల 31వ తేదిన ఒక ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగ్‌ను అందజేశారు. అందులో 12 గ్రాముల బంగారు అభరణంతో పాటు ఒక ఫోన్, రూ.1000 నగదు ఉంది. అలాగే, ఎయిర్ ఫోర్ట్ పుష్పక్ బస్సులో మరిచిపోయిన ల్యాప్ టాప్, విలువైన పత్రాలతో కూడిన బ్యాగ్‌ను డ్రైవర్ మీర్జా ప్రయాణికుడికి అందజేశారు.
ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ నిర్వహణలోనే కాక.. మానవత్వంలో ముందుండటం అభినందనీయమని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ఉద్యోగులు నిజాయితీని నిరూపించుకుంటుండటం చూస్తుంటే.. ప్రజల కోసం ఆర్టీసీ సిబ్బంది ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో తెలుస్తోందని అన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC @bigtvtelugu@RTVnewsnetwork@TV9Telugu@NtvTeluguLive@way2_news@TelanganaCMO@eenadulivenews
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
@TGSRTCHQ @PROTGSRTC
If you think 'this time will be different,' you're exactly who betting companies love!
The house always wins, but you're not the house.
#SayNoToBettingApps
బెట్టింగ్ అనేది మీకు ఈజీ మనీ తెచ్చిపెట్టే ఆట కాదు-మీ భవిష్యత్తును చిద్రం చేసే భూతం! ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ మహమ్మరిని తరిమికొట్టేందుకు #BetFreeChallenge లో చేరండి. బెట్టింగ్ రహిత సమాజానికి పాటుపడండి.
#SayNoToBettingApps
ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు.
సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి.
హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతి ప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి.
@MORTHIndia #RoadAccident @HiHyderabad @tsrtcmdoffice @YakaswamyChalla
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేయనుంది. భక్తులు కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి.
With a view to reaching out to the devotees of Lord Shri Rama in far flung areas of Telangana, the #TSRTC has taken up pious task to deliver Bhadrachalam Sri Sitarama Kalyanam Talambralu to their doorstep.
Devotees have to pay Rs 116 and register their details at nearby #TSRTC Cargo parcel centers and the staff will home deliver the ‘Talambralu’ after the celestial wedding.
https://t.co/jeTK5Ncogw
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సందర్భం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #NaatuNaatu పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కడం మనకెంతో గర్వకారణం.
#RRR చిత్ర దర్శకుడు @ssrajamouli గారికి, సంగీత దర్శకుడు @mmkeeravaani గారికి, ఇతర చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు.