‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ అంటూ..
మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు చేరుకోగానే బీజేపీ-ఎన్డీఏ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సభ ఆవరణలోకి ఆయన అడుగుపెడుతున్న సమయంలో ఎంపీలు ఒక్కసారిగా "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నేతలందరూ ఆయనను కలిసి ఆత్మీయంగా పలుకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఇంకెన్నాళ్లు ఈ అకృత్యాలు? .. అంటూ యాంకర్ కన్నీరు..
ఆడపిల్ల భారం అనుకుంటూ భూమ్మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తున్న దారుణాలు ఆగడం లేదు. జనగామలో మూడోసారి ఆడపిల్ల అని తెలిసి, సొంత తల్లే బలవంతంగా అబార్షన్ చేయించడంతో శ్రావణి తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది. ఇంకెన్నాళ్లు ఈ అకృత్యాలు? అంటూ 'బిగ్ టీవీ' యాంకర్ ధనలక్ష్మి లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
అమ్మ కోసం ఆవిష్కరణ.. కేరళం సీఎం ఫిదా!
తల్లికి ఇంటి పనులు సులభతరం చేసేందుకు కేరళంకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్ వంట చేయడం, ఆహారం వడ్డించే రోబోలను తయారుచేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న వయసులోనే ఆటోమేషన్‌లో అతడి అసాధారణ నైపుణ్యాన్ని సీఎం వీడీ సతీషన్, నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తూ.. భారత టెక్నాలజీ భవిష్యత్తు అని కొనియాడారు.
రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్
రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం వద్ద మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.
ఆ హక్కు బీఆర్ఎస్కు లేదు: వాకిటి శ్రీహరి
TG: పాలమూరు ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలని, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. గతంలో కర్ణాటకలో డ్యామ్‌లు నిర్మించినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కర్ణాటకతో చర్చలు జరిపామని, పాలమూరుకు శాశ్వత నీటి సమస్యను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
జై శాకంబరి.. మనసును హత్తుకునే వీడియో
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజైన ఇవాళ అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని సుమారు 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో ముస్తాబు చేశారు. ఇక రెండో రోజు పండ్లు, మూడో రోజు డ్రై ఫ్రూట్స్‌తో పాటు వివిధ ధాన్యాలతో దుర్గమ్మను అలంకరించనున్నారు.
‘సెల్ఫ్ అటెండెన్స్’.. ఐడియా అదిరింది
పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం ఓ టీచర్ వినూత్నంగా 'సెల్ఫ్ అటెండెన్స్' బోర్డును ఏర్పాటు చేశారు. పిల్లలు బడికి రాగానే తమ ఫొటో ఉన్న డబ్బాలను 'ఆబ్సెంట్' నుంచి 'ప్రజెంట్' వైపు మార్చుకుంటూ ఉత్సాహంగా హాజరు వేసుకుంటున్నారు.
చరిత్ర సృష్టించిన చానూ.. వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చానూ చరిత్ర సృష్టించారు. 48కేజీల విభాగం స్నాచ్‌లో 85కేజీలు, క్లీన్&జెర్క్‌లో 105కేజీల బరువు ఎత్తారు. దీంతో కామెన్వెల్త్లో హయ్యెస్ట్ వెయిట్ లిఫ్ట్ చేసిన మహిళా లిఫ్టర్‌గా రికార్డుల్లోకెక్కారు. ఈ ఫీట్‌తో ఆమె గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
మరో వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సోషల్ మీడియా వీడియోలో తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఘోర ప్రమాదం.. బస్సు ఎలా దూసుకెళ్లిందో చూడండి!
కేరళంలోని కుట్టిపురం వద్ద NH66పై ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు త్రిస్సూర్ నుంచి కోజికోడ్‌కు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుపక్కన డివైడర్‌ను ఢీకొని దానిపై బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మందికి గాయాలయ్యాయి. అక్కడే పార్క్ చేసి ఉన్న కారు కూడా ధ్వంసమైంది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఒకే చోట వేలాది ట్రక్కులు
చెన్నై సమీపంలోని భారత్ బెంజ్ ప్లాంట్ వెలుపల వేలాది కొత్త ట్రక్కులు వరసగా పార్క్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆకాశం నుండి తీసిన డ్రోన్ వీడియోలో ఈ భారీ వాహనాలు అచ్చం బొమ్మల(టాయ్) ట్రక్కుల్లా కనిపిస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ఆటోమొబైల్ రంగ అసాధారణ ఉత్పత్తి సామర్థ్యానికి, పారిశ్రామిక వృద్ధికి ఇది అద్దంపడుతోందని నెటిజన్లు అంటున్నారు.
జయకృష్ణను ఆదరించండి: మహేశ్‌బాబు
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈనెల 30న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్‌కు సూపర్ స్టార్ మహేశ్‌బాబు విషెస్ చెప్పారు. ‘మా అన్న కొడుకు సినీ పరిశ్రమలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్‌కు నా శుభాకాంక్షలు. నాన్న అభిమానులు, నా అభిమానులు జయకృష్ణను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మహేశ్ తెలిపారు.
BIG TV Telugu Relaunch Coordinating Editor Shaik Sartaj Speech
BIG TV Telugu — In a Bold New Avatar.
On the path of truth, to be the Voice of the People — we are here.
Objective. Accurate. Fast. Without Fear or Favour.
A New Era of News Begins Here.
Welcome to Asia's largest immersive news intelligence centre — bringing you breaking news, in-depth reporting, exclusive interviews, and stories that matter, from across Telangana, Andhra Pradesh, and beyond.
మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి: అనిరుద్‌రెడ్డి
TG: తనలాంటి యువ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో యువ నేతలను మంత్రులుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే పదవుల కేటాయింపుపై అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
BIG TV Relaunch Associate Editor Rajesh Vemula Speech
BIG TV Telugu — In a Bold New Avatar.
On the path of truth, to be the Voice of the People — we are here.
Objective. Accurate. Fast. Without Fear or Favour.
A New Era of News Begins Here.
Welcome to Asia's largest immersive news intelligence centre — bringing you breaking news, in-depth reporting, exclusive interviews, and stories that matter, from across Telangana, Andhra Pradesh, and beyond.
BIG TV Telugu Relaunch | Associate Editor Rohith Muthyala Speech
BIG TV Telugu — In a Bold New Avatar.
On the path of truth, to be the Voice of the People — we are here.
Objective. Accurate. Fast. Without Fear or Favour.
A New Era of News Begins Here.
Welcome to Asia's largest immersive news intelligence centre — bringing you breaking news, in-depth reporting, exclusive interviews, and stories that matter, from across Telangana, Andhra Pradesh, and beyond.
BIG TV Relaunch Associate Editor Ramadevi Maryada Speech
BIG TV Telugu — In a Bold New Avatar.
On the path of truth, to be the Voice of the People — we are here.
Objective. Accurate. Fast. Without Fear or Favour.
A New Era of News Begins Here.
Welcome to Asia's largest immersive news intelligence centre — bringing you breaking news, in-depth reporting, exclusive interviews, and stories that matter, from across Telangana, Andhra Pradesh, and beyond.