సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని, సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔹 కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫస్ట్ హాఫ్’ పూర్తిగా విఫలం అయింది.
🔹 అన్ని రంగాల్లో రేవంత్ పాలన వైఫల్యం.
🔹 రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’.
🔹 కరెంటు కోతలు, ఎరువుల తిప్పలు, పంట కొనుగోలు సంక్షోభాలతో ఆనాటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది.
🔹 మళ్లీ కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం.
🔹 ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం.
పుష్కర తెలంగాణ.. ఇప్పుడు ముష్కరుల పాలు!
ఎందరో ప్రాణత్యాగాలు,
ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం
నేడు ఈ కాంగ్రెస్ ముష్కరుల పాలైంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం
ఏ పార్టీకి లేదు!
అధికారం దూరమైనా...
ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఉన్న ప్రేమ,
మమకారం అలాగే ఉన్నాయి.
25 ఏండ్ల క్రితం.. 27 ఏప్రిల్ 2001న.. కులబలం, ధనబలం, మీడియా పవర్, మజిల్ పవర్ ఏదీ లేకుండా ఒక బక్క పలుచటి మనిషి ఒంటరిగా ప్రారంభించిన ప్రయాణం మన గులాబీ జెండా!
ఎన్నో ప్రతికూల పరిస్థితులను, శక్తులను తట్టుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న చరిత్ర మనది. నాడు చీకట్లో చిరుదీపంలా మొదలై.. నేడు తెలంగాణకు శ్రీరామరక్షగా నిలిచిన మన బీఆర్ఎస్ ప్రస్థానం ఒక అద్భుతం.
బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు బతుకుతెరువు కల్పించాం. కానీ రేవంత్ రెడ్డికి ఆ కాన్సెప్టే అర్థం కాలేదు.
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టొద్దని అసెంబ్లీలోనే వేడుకున్నా వినలేదు.
ఇవాళ కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, పిల్లల బ్రేక్‌ఫాస్ట్, రైతుబంధు.. ఇలా అన్నీ బంద్ చేశారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఏ దేశమేగినా
ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా,
ఎవరేమన్నా
పొగడరా నీ తల్లి భూమి భారతిని..
ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్లినా
నేను సిరిసిల్ల ఎమ్మెల్యేనని గల్లా ఎగరేసి చెప్తా!
నాకు రాజకీయంగా జన్మనిచ్చిన
సిరిసిల్లకు ఎప్పుడూ రుణపడి ఉంటా!
మీ అందరికీ మాటిస్తున్నా,
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తా.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి రైతుబంధు ఇచ్చేవాళ్లు. కరెంట్ పోయేది కాదు, నీళ్లు కూడా పుష్కలంగా వచ్చేవి. పంటలు బాగా పండేవి.
కాంగ్రెస్ వచ్చినంక రైతుబంధు, కరెంట్ సరిగ్గా ఇస్తలేడు. రైతులు ఆగమాగం ఐతున్నారు.
రైతులు బాగుండాలంటే మళ్లీ కేసీఆరే రావాలి అంటున్న మహిళా రైతు.
రెండు నెలలుగా కళ్ళాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతూ.. చివరకు కళ్లముందే మొలకెత్తిన ధాన్యాన్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తున్న ఈ అన్నదాత ఆక్రందన వినే నాథుడే లేడా?
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు, పంట కొనేవాడు అంతకన్నా లేడు అంటూ కన్నీరు మున్నీరవుతున్న తెలంగాణ రైతు గోస గుండెల్ని పిండేస్తోంది.
#CongressFailedTelangana
ఒకే ఒక్కడు.. మన తెలంగాణను తెచ్చినవాడు.. కేసీఆర్ ✊
శూన్యం నుంచి మొదలై.. స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన మహా నాయకుడు.
పదవులను తృణప్రాయంగా త్యజించి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సింహగర్జన చేసిన ధీశాలి!
ఒకప్పుడు తెలంగాణలో వాగులు, వంకలు ఎండిపోయి,
చెరువులు, కుంటలన్నీ ముళ్ల పొదలతో నిండిపోయి నీళ్లు లేక నెర్రెలుబారి ఉండేవి.
ప్రజలు గుక్కెడు నీటి కోసం తండ్లాడేది.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అపర భగీరథుడు కేసీఆర్ గారు జలసంరక్షణ కోసం తీసుకున్న చర్యలతో
చెరువులు, కుంటలు మత్తళ్లు దూకి, భూగర్భ జలాలు పైపైకి ఉప్పొంగి, జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
మిషన్ భగీరథ ద్వారా మండుటెండల్లోనూ ప్రతి గ్రామానికి, గడప గడపకు నల్లా నీటిని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్!
బాచుపల్లి ఫ్లైఓవర్ కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం.. పబ్లిసిటీ పిచ్చి రేవంత్‌ది!
కేసీఆర్ గారి హయాంలోనే 90% పనులు పూర్తయిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను.. రెండున్నరేళ్లు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు క్రెడిట్ కోసం రిబ్బన్ కటింగ్ చేశాడు అనుముల హిట్లర్.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయం!
The tragic loss of lives in the unfortunate accident at Vizag Steel Plant is heartbreaking.
I extend my deepest condolences to the families of the workers who lost their lives and pray for the speedy recovery of those injured.
Dear @RahulGandhi Ji,
Did your..
"Mohabbat Ki Dukaan"
officially become
"HITLER’S MAKAAN..?? "
You cannot parade as the self-appointed guardian of the Constitution in Delhi while remaining silent as your nominated Chief Minister of Telangana, Mr. Revanth Reddy, openly glorifies blood-thirsty Adolf Hitler and cites his "assassination squads" as a source of operational inspiration
It is not just a chilling confession of an inherently fascist governance mindset, but also an unforgivable assault on our nation's foundational values. A democratic leader draws inspiration from actual statesmen; only a paranoid, power-drunk ruler searches for lessons in brutal dictators.
If celebrating totalitarian methods and proudly comparing local civic demolitions to the violent flattening of international war zones is your party's actual blueprint for governance, then the AICC should formally drop the ideological facade and rename itself as "ALL INDIA NAZI PARTY."
Your silence is an endorsement.
The nation is watching.
❇️ మెరిట్‌ను మింగేస్తున్న మేనేజ్మెంట్ కోటా.
పైసలు ఉన్నవాళ్లు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారని, మెరిట్‌కు విలువ లేకుండా పోతోందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్పందిస్తూ.. "డబ్బులు ఉన్నాయని డాక్టర్లు అయిపోయే ఈ విధానం అత్యంత అన్యాయమైనది. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవడానికి బలమైన రెగ్యులేటరీ సిస్టమ్ రావాలి. రేపటి రోజున మన కుటుంబ సభ్యులకు బాలేకపోతే డబ్బులు ఉన్న డాక్టరా? మెరిట్ ఉన్న డాక్టరా? ఎవరికి చూపిస్తాం? కాబట్టి మేనేజ్మెంట్ సీట్లను తగ్గించి, మెరిట్ కే ప్రాధాన్యతనిచ్చేలా ఫీజులను, కోటాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది" అని అభిప్రాయపడ్డారు.
❇️ ఒత్తిడిని లోపల దాచుకోవద్దు..
తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థులకు కేటీఆర్ ఒక తండ్రిలా, పెద్దన్నలా దిశా నిర్దేశం చేశారు. "నేను ఇద్దరు పిల్లల తండ్రిగా మీ బాధను, హెల్ప్లెస్నెస్ను అర్థం చేసుకోగలను. ఇలాంటి కష్ట సమయాల్లో భావోద్వేగాలను లోపలే దాచుకోవద్దు. అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో మాట్లాడండి, మీ బాధను పంచుకోండి. లైఫ్ ఇలాంటి బౌన్సర్లు విసురుతున్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి" అని హితవు పలికారు.
గతంలో కొందరు విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) బోర్డు లోపాలను ఎండగట్టినట్లుగా, నీట్ లోపాలను కూడా తాము రాజ్యసభ సభ్యుల ద్వారా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
♦️ నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత
♦️ ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగిస్తేనే వ్యవస్థకు బలమైన సందేశం
♦️ తప్పు బోర్డుది.. శిక్ష విద్యార్థులకా?
♦️ పేపర్ లీక్‌ల వల్ల ప్రతిభావంతులకు ఘోర అన్యాయం
♦️ నీట్ అంశాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం
మలేషియా పర్యటనకు ముందు బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ముఖాముఖి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET UG-2026) పరీక్షల కుంభకోణం మరియు పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన మోదీని కోరారు.
తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేశం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు.
మలేషియా అధికారిక పర్యటనకు వెళ్లే ముందు, జూన్ 4వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో నీట్ బాధితులు, లాంగ్ టర్మ్ విద్యార్థులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి నిర్వహించారు.
❇️ ఇది ప్రభుత్వ 'అట్టర్ ప్లాప్'.. విద్యార్థుల ఆవేదన
ఈ ముఖాముఖిలో విద్యార్థులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న మానసిక క్షోభను కేటీఆర్ ముందు ఏకరవు పెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మార్కులు సాధించినా, పేపర్ లీక్ కావడం వల్ల తమ శ్రమ అంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు, పేపర్ లీక్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారని విద్యార్థులు నిలదీశారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నించారు.
విద్యార్థుల ఆక్రోశంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. "మీ కోపంలో 100 శాతం న్యాయం ఉంది. ఈ పరీక్ష నిర్వహణలో ఇది ప్రభుత్వ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది.
తప్పు చేసిన పెద్దలను వదిలేసి, మిమ్మల్ని మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికీ అన్యాయమే. కానీ, ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మీ కసిని, ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ ఫోకస్ చేయండి" అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు.
❇️ గ్రేస్ మార్కుల వెనుక పెద్ద మాయాజాలం!
గతంలో (2024) గ్రేస్ మార్కుల పేరిట జరిగిన అవకతవకలను, కటాఫ్‌లు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించగా, కేటీఆర్ ఎన్టీఏ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
"గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారో చెప్పడానికి ఎన్టీఏ వద్ద ఇప్పటికీ ఎలాంటి తార్కిక సమాధానం లేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. కొంతమందికి అడ్డదారిలో మార్కులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేయడం ఘోరమైన నేరం. ఈ లూప్‌హోల్స్ అన్నింటిపై పార్లమెంట్లో, స్టేట్ అసెంబ్లీలో గట్టిగా చర్చిస్తాం. చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చట్టసభ సభ్యులుగా మా బాధ్యత నెరవేరుస్తాం" అని హామీ ఇచ్చారు.
❇️ పాలకులకు భయం ఉండాలి
"మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారమవుతుందా?" అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వ్యూహాత్మకంగా బదులిచ్చారు. "మంత్రి రాజీనామా ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుంది. ప్రధాని గనుక మంత్రిని తొలగిస్తే.. తప్పు జరిగితే బాధ్యత వహించక తప్పదనే భయం అధికారుల్లో, బ్యూరోక్రాట్లలో వస్తుంది. లేకపోతే వ్యవస్థలో నిర్లక్ష్యం పెరుగుతుంది. స్కూల్లో బంక్ కొడితేనే పనిష్మెంట్ ఉన్నప్పుడు, వ్యవస్థను నాశనం చేసిన పెద్దలకు శిక్ష ఉండాలి. కొందరిని డిస్మిస్ చేసి కఠినంగా శిక్షిస్తేనే వ్యవస్థ దారిలోకి వస్తుంది" అని పేర్కొన్నారు.
❇️ దేశవ్యాప్తంగా రీ-నీట్ నిర్వహించాల్సిందేనా?
పేపర్ లీక్ అయిన రాష్ట్రాల్లోనే పరీక్ష పెట్టాలా? లేక దేశవ్యాప్తంగా నిర్వహించాలా? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. "ఇవాల్టి కనెక్టెడ్ ప్రపంచంలో లీకైన పేపర్ మిగతా రాష్ట్రాలకు వెళ్లలేదని చెప్పలేం. ఒక కోచింగ్ సెంటర్లో పలు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారు. ఎక్కడో ఒకచోట 1% లీక్ అయినా అది అందరికీ పాకుతుంది. కాబట్టి లీక్ పరిధిపై 100% స్పష్టత ఉంటే ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవచ్చు, లేదంటే దురదృష్టవశాత్తూ దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. అయితే, అసలు లీక్ కాకుండా ఉండేందుకు నేటి ఏఐ (AI) సాంకేతికతను వాడుకుని 'ఫూల్ ప్రూఫ్' సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టి పెట్టాలి" అన్నారు.
రేవంత్!
కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు..
నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా?
మొత్తం మానవజాతి చరిత్రలోనే
అతిపెద్ద నరమేథం సృష్టించిన హిట్లర్
నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా?
మొన్న ప్రజా పాలన అన్నావ్
నిన్న ఇందిరమ్మ పాలన అన్నవ్
నేడు "హిట్లర్ పాలన" అని ఒప్పుకున్నావ్.
రెండున్నరేళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు
నిజంగానే హిట్లర్ ఆరాచకాన్నే తలపించాయి
యుద్ధం మిగిల్చే విషాదాల్నే మించిపోయాయి.
హైడ్రా నుంచి మూసీ వరకు
లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు
పేదలపై విరుచుకుపడిన నీ బుల్డోజర్లు
“నయా నాజీ” పాలనకు నిజమైన సాక్ష్యాలు
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను
సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే
నీ నియంత పోకడలు బయటపడ్డాయి.
విధ్వంసమే నీ విధానమని
వికాసం అంటే నీకు తెలియదని
ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం
రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం.
ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను
నిలువెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం
స్వతంత్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యాయం.
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో
ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి!
తెలంగాణ గ్రామగ్రామాన లేచిన ఉక్కుపిడికిళ్లు
రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమికొట్టాయి!
తలకెక్కిన అధికారంతో విర్రవీగిన
హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో
మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం!
హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన
తెలంగాణను కాపాడుకునేందుకు
ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే
మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం!
హిట్లర్ హటావో! తెలంగాణ బచావో!!
జై తెలంగాణ!
మలేషియా పర్యటనలో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ గారు ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ గారి సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
సింగపూర్, మలేషియా దేశాల్లో అమలవుతున్న అభివృద్ధి విధానాలలో తెలంగాణలో అనుసరించదగిన అంశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి నమూనాలను తీసుకురావాల్సిన అవసరాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని కేటీఆర్ గారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సమాజం సభ్యులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్, బీఆర్ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.