కేంద్ర విద్యాలయ నెం.1, ఉప్పల్‌లో ఆర్థిక శాస్త్రం (ఎకనామిక్స్) పీజీటీగా 31 ఏళ్లపాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన సల్గుటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం మరియు పదవీ విరమణ సన్మాన సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైందని, మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన శ్రీ సల్గుటి చంద్రశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజానికి, విద్యారంగానికి తన అనుభవాన్ని అందిస్తూ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం శ్రీ సల్గుటి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించి, వారి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేకల మేఘమాల విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ కేసు విషయాన్ని బయటకు లీక్ చేశారు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నాడు
రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచారని మాకు సమాచార�� వచ్చింది
అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్‌కు అడిగితే, ఆమె ఒప్పుకోలేదని వెన్నుపోటు పొడిచారని సమాచారం ఉంది
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌కే వెన్నుపోటు పొడిస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి
దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Dear @narendramodi Ji,
Dismiss MoS Bandi Sanjay immediately to ensure a fair investigation into the POCSO case filed against Bandi Bhageerath.
The whole nation is watching to see how genuine your #BetiBachao campaign truly is.
#BetiBachaoFromBJP
*నూతన డీజీపీ ఆనంద్ గారికి*
*శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే*
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఐపిఎస్ గారిని, హైదరాబాదులోని డిజిపి ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు.
ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ లో కోటి 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే స్టోన్ వాటర్ డ్రైనేజ్ పనులకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేసి, వెంటనే పనులు ప్రారంభించేందుకు జైల్ శాఖ డీజీ గారికీ సూచించవలసినది గా ఆయన కోరారు.
ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రాంతాల్లో వరద నీటి నిల్వ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు పేర్కొన్నారు.
అలాగే, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్దిష్ట కాలపట్టికలో పనులు పూర్తి చేయడానికి సంబంధిత మున్సిపల్ శాఖ అధికారుల కు సహకరించవలసినదగా జైళ్ల శాఖ అధికారులను ఆదేశించవలసినది కోరారు
. ప్���జల సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సంద��్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌ" కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
@BRSparty @TSwithKCR @KTRBRS
తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి మరియు శోభమ్మ గ���ర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..💐
@KTRBRS
*ఉప్పల్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు దిశగా ముందడుగు*
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఉప్పల్, భాగాయత్ లేదా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి భూమి కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.
ఈ మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి వినతిని పరిగణనలోకి తీసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా కల���క్టర్‌కు ప్రభుత్వం సూచిస్తూ, కాలేజీ స్థాపనకు అనుకూలమైన భూమి లభ్యత, స్థలం ఎంపిక, మరియు ఇతర సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని కోరింది.
ఈ చర్యతో ఉప్పల్ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కానుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడనుంది.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ���ాగంగా కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద నూతన పెన్షన్ గురించి ప్రజలను వివరాలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు.
నూతన పెన్షన్ లను వెంటనే లబ్దిదారులకు అందజేయాలి అని ఆయన కోర��ం జరిగింది.
*మృతు��ి కుటుంబానికి అండగా MLA*
చర్లపల్లి సీఐ సుధాకర్ గారితో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు.
ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్‌కు చెందిన ఎస్కే అజ్జు ( 3 సంవత్సరాలు) బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చర్లపల్లి పోలీస్ స్టేషన్ కి బాధిత కుటుంబ సభ్యులతో వచ్చి చర్చ��ంచారు.
గాయపడ్డ బాలుడికి న్యాయం చేయాలని అన్నారు.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే గారు సూచించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో @BRSparty నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల తెలంగాణ ఆత్మగౌరవ గర్జన.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కే���ీఆర్ గారి��ి వ్యవసాయ క్షేత్రము లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@BRSparty @KTRBRS @BrsBandari @TheHimanshuRaoK