ధరణి కంటే భూ భారతి వేదింపులే ఎక్కువ ? SIR ఫారాల పంపిణీ పూర్తి చేయాలి.
పారింది ఎంత ? ఎండింది ఎంత
ఎల్ నినో ప్రభావంతో హడవుడి
ఎట్టకేలకు భీమ్ రెడ్డి అరెస్ట్ చర్లపల్లికి తరలింపు
మరిన్ని వార్తలు 👇
మూడు నెలల్లో బయటపడిన మూడు స్కాంలు - కమలం కొంపను కొల్లెరుగా మార్చాయా?
గల్ఫ్ ఆయిల్ భూ అక్రమాలపై పిర్యాదుల వెల్లువలు?
స్వేచ్ఛా న్యూస్ వరుస కథనాలతో బయటపడుతున్న సూత్రదారులు
అభివృద్ధితోనే మీ రుణం తీర్చుకుంటాను - సీఎం
టీఆర్ఎస్కు షాక్
20 నుంచి హాట్ హాట్ సమావేశాలు
మంత్రుల్లో కొరవడుతున్న నిర్ణయాధికారం - పవర్ అంతా ప్రైవేట్ సైన్యంలోకే!
అబ్కారీ బదిలీల్లో అవినీతిదే అధిపత్యం ?
కూకట్ పల్లి భూముల్లో మళ్లీ
ప్రజలకే తిప్పలు ?
మళ్లీ బట్టి లెక్కలు భయటపెట్టారు.
మరిన్ని కథనాలు
మూసీలో పనులకు డబ్బులు - అప్పుల రాజకీయం ఇప్పుడే ఎందుకు ?
ఆ లక్షల కోట్ల అక్రమ భూ విక్రయాల పై ఫీనిక్స్ కి మొదలైన టెన్షన్ - ఎప్పుడో చెప్పిందే నిజం.
మరో 200 కోట్ల అవినీతి అధికారి భాగోతం.
SRR రివర్ వ్యూ పై హైడ్రా ఫోకస్ – ఫోనోస్తే అగిపోతారేమో ?
తోపులాటలో కింద పడ్డ హరీష్ – అరెస్ట్ అయిన కవిత
సంచలన కథనాలు
నమస్తే,
నేను మీ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
మీకు ఇన్నాళ్లు ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగానే తెలుసు ?
ఇప్పుడు ఓ వెబ్ సైట్, ఈ పేపర్ కి ఓనర్ గా మీ ముందుకు వస్తున్నాను.
కళ్లముందే జరుగుతున్న అవినీతి, అన్యాయలు, అక్రమాలను చూస్తూ ఊరుకులేక
ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇన్నాళ్లు ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ పేరుతో ఒక్క భూ స్కాంల వెలిక్కి తీయడానికే పరిమితం అయ్యాను
ఇక నుంచి అన్ని రకాల స్కాంలను, స్కీంలను ప్రజలకు ఎలా చేరవేయాలి.
రాజకీయ నాయకుల అసలు రంగు ఏంటో ఎప్పటి కప్పుడు మీ ముందు ఉంచేందుకు
నేను స్వేచ్ఛాయుతంగా వ్రాసుకునేందుకు మళ్లీ స్వేచ్ఛ న్యూస్ నే ఎంచుకోవడం జరిగింది.
నాకు మీ అండదండలు ఎప్పటికి ఉంటాయని అశీస్తున్నాను.
ఇన్నాళ్లు ప్రజల ముందు నిప్పులాంటి నిజాలను ఎలా ఉంచామో ?
దాని కంటే 1000 రేట్లు అధారాలతో భయటపెట్టేందుకు రేడీగా ఉన్నాం.
ఇవాళ కూకట్ పల్లిలో జరిగిన 800 ఎకరాల భూస్కాం మీ ముందు ఉంచుతున్నాను.
80 వేల కోట్ల స్కాం జరిగినా నాయకులు ఎందుకు స్పందించడం లేదు.
హైకోర్టుకు చేరితే కాని ప్రజలకు తెలియని పరిస్థితి ఎందుకోస్తుంది.
ఇన్వేస్టిగేషన్ జర్నలిజానికి ప్రాణం పొద్దాం.
మీరే జర్నలిస్టుగా ప్రతి ఫోస్ట్ ని మా వెబ్ సైట్ లో ఫోస్ట్ చేయవచ్చు.
ఇట్లు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
9848070809.
రవి ది రియల్ ఫైటర్ ?
ఆంధ్రా లాబీయిస్ట్ లతో
అలుపెరుగని పోరాటం
OC కోసం HMDA పై తీవ్ర ఒత్తిడి
ఏసీబీతో పాటు కోర్టులో కేసులు ఉన్నందున ఇవ్వలేమంటున్న అధికారులు
ఆనాడు 10 కోట్లు ఇచ్చినట్లు
ఇప్పుడు మళ్లీ లంచాలు ఇచ్చే ప్రయత్నం.
ఆంధ్ర లాబీయిస్ట్ లు
Vs
తెలంగాణ సామాన్యుడి ఫైట్
ఆయన ప్రతిష్టాత్మక విదేశీ నోట్ల తయారీ కేంద్రానికి 12 ఏండ్లు డైరెక్టర్ గా పని చేశారు
నార్సింగి లో 500 గజాల కోసం 5 ఏండ్లుగా పోరాటం.
అపోజిషన్ పేరు మోసిన న్యాయమూర్తుల ఫ్యామిలీ ?
సైట్ లో ఒంటరిగా 2 నెలలు నిరసన దీక్ష
ఖాళీ చేయించేందకు తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి బెదిరింపులు
శవం వేలు ముద్ర వీలునామాతో
13 ఎకరాలు కబ్జా పై అదారాల సేకరణ.
ఎన్నికల హాడవుడిలో 50 కోట్ల లంచంతో
అనుమతులు తీసుకున్న ఎస్ఆర్ఆర్ రియల్టీ.
ట్రబుల్ షూటర్ ని అని పేరున్న ఓ మాజీ మంత్రికి
40 కోట్లతో డీల్ సెటిల్ అనే ప్రచారం ?
అరవింద కుమార్ కి 10 కోట్లు,
డైరెక్టర్ బాలకృష్ణ కోటి రూపాయలు
ఏసిబి కన్ఫెక్షన్ రిపోర్టులో పూసగుచ్చినట్లు చెప్పిన బాలకృష్ణ.
కాంగ్రెస్ సర్కాస్ వచ్చకా చకచక కొనసాగిన నిర్మాణ పనులు. ?
ఎల్ ఆర్ ఎస్ లు ఇచ్చిన లే-అవుట్ లో
6 వేల గజాల పార్క్ స్థలం, 12 వేల గజాలు రోడ్లు కబ్జా చేసి మూడు టవర్స్ నిర్మాణం.?
సీఎం కి పిర్యాదుతో క్షణాల్లో కదలిక.. మరసటి రోజే సైలెంట్ ?
హైడ్రా దగ్గరకు వెళ్లితే అందరి ముందే బిల్డర్స్ కి క్లాస్ పీకినా రంగనాథ్
ఆ తర్వాత 1,000 కోట్ల పబ్లిక్ ప్లేస్ పై ధ్యాసే లేని వైనం.
ఇప్పటికీ పరిటాల అనుచరుడిని అంటూ ఇంటికి వచ్చి బెదిరిస్తున్న మాజీ మావోయిస్ట్ ఉమా మహేష్ ?
హైకోర్టులో కేసు వేస్తే బెంచ్ మీదికి రానికుండా అడ్డంకులు ?
పాత కేసుల్లో ఒకే విచారణకు తుది తీర్పు ?
బంధువైన జడ్జి తీర్పుతో సిజేకు పిర్యాదు ?
13 ఎకరాల కబ్జా నిజమేనని ఎమ్మార్వో , కలెక్టర్ నివేదికలు.
రూ. 10 కోట్లు ఇవ్వడంతో రెవెన్యూ వాదనలను పట్టించుకోని హెచ్ఎండీఏ ?
బాలకృష్ణ గ్యాంగ్ అరాచాకాల్లో పూర్తి అధారాలు ఈ ప్రాజెక్ట్ లోనే ?
ఈడీ రైడ్ చేసినా , ఏసీబీ ప్రత్యేకంగా కేసు నమోదు చేసినా జోరుగా అమ్మకాలు
ఎస్ఆర్ఆర్ లో 3 టవర్స్ లో కొంటే ఎప్పుడైనా ఇబ్బందులే.
ప్లాట్ ఓనర్ ప్రధానికి పిర్యాదుతో జీఏడికి చేరినా పంచాయితీ.
ఏసిబి నివేదిక సమర్పించినా,
నార్సింగ్ పోలీసుల రిపోర్టు పేరుతో అలస్యం.
అస్తమించని సూర్యుడిలా 500 గజాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్యామిలీ పై
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.
వీరి ఫైటింగ్ తో నార్సింగి బృందవనం కాలనీ లోని 120 ఏకరాల భూ బాగోతం బట్టభయలు.
✍️
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
5 వేల కోట్ల భూమి కబ్జా అంటూ
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ వరుస కథనాలు.
టైటిల్ లేకుండానే దగ్గుపాటి ఫ్యామిలీ అక్రమ నిర్మాణాలు.
షెడ్, స్టేడియం నిర్మాణం హైడ్రా ఎప్పుడు కన్నేస్తుంది?
వీవీఐపీలను ఒత్తిళ్లకు తలొగ్గి
చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా?
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
ఖానామెట్‌లో హైడ్రా వేల కోట్ల భూములను కాపాడుతుంది. మెండికుంట చెరువు వద్ద 11 ఎకరాలు, సర్వే నంబర్ 55లో మీనాక్షి వాసవి కబ్జా చేసిన 1200 కోట్ల భూమి, సర్వే నంబర్ 41/12, 13, 14ల్లో 3 వేల కోట్ల ఆస్తిని, 42లో వెయ్యి కోట్ల ఆస్తిని కాపాడేందుకు అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించింది. ఇలా మొత్తం 8 వేల కోట్ల ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేస్తే స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే సర్వే నంబర్లోని 41/9, 41/10, 41/11లో అపర్ణ, సినీ ఫ్యామిలీ దగ్గుపాటి సురేష్, వెంకటేష్‌లు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. అందుకు ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ వరుస కథనాలు రాసింది. ముమ్మాటికీ ప్రభుత్వ భూమియే అంటూ ఆధారాలతో సహా వివరించింది. దీంతో అధికారుల హెచ్చరికలతో అపర్ణ తోకముడిసినట్లు తెలుస్తుంది. సర్వే నంబర్ 41/9కి ఫెన్సింగ్ వేసేవారు మధ్యలోనే ఆపివేశారు. కానీ ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు చేసిన ఇండోర్ స్టేడియం లాంటి షెడ్లను ఎప్పుడు కూల్చివేస్తారు? వారి తండ్రి పేరుతో ఉన్న బాక్స్ క్రికెట్ స్టేడియానికి ఎప్పుడు నోటీసులు ఇస్తారని విమర్శలు మొదలయ్యాయి.. వారు వీవీఐపీలు అయినందునే వారి నిర్మాణాల జోలికి వెళ్లడం లేదా అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిర్యాదులు చేస్తేనే కూల్చివేస్తారా? ప్రభుత్వ భూమిపై సుమోటోగా కాపాడాలేరా అంటూ 5 వేల కోట్ల విలువ చేసే భూమిపై హైడ్రా తీరును ప్రశ్నిస్తున్నారు.
ఆ భూములు లావణి పట్టా, ఎక్స్సర్వీస్మెన్లవిగా మార్చి అమ్మారు
లావణి పట్టా భూములను అమ్మకం, కొనుగోలు చేసినా (POT యాక్ట్ 1977 ప్రకారం ) ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కులు ఉన్నాయి. ఈ భూముల పై 1990లో క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టింది. లావణి పట్టా భూములను పక్కన పెట్టి మాజీ సైనికులుగా పట్టాలు సృష్టించారు. 1962లోనే ఫార్మ్ 9 ఇచ్చినట్లు దొంగ ఎక్స్సర్వీస్మాన్ గా ఎంట్రీలు ఇచ్చారు. 1963లో జీఓ నెం. 743 ద్వారా సైనికులకు ఇవ్వాలని అనుకున్నా, అది 1989 లో మెమో నెం 8136/89 ప్రకారం సైనిక సంక్షేమ డైరెక్టర్ నిర్దారించిన తర్వాత అమల్లోకి వచ్చింది. కాని 1963లో అలోచన వచ్చిన దాని కంటే ముందే 1961లో ఫారం 9 ఇచ్చారని చెప్పడం ఫేక్ డ్యాకుమెంట్స్ తో లావాణి నుంచి తప్పించుకునేందుకే ఈ మాజీ సైనికుల పేర్లతో 1961-1965 నాటకాలు చేస్తున్నారు. 1993లో జీవో నం. 1117 ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించారు. 1989 తర్వాతనే కొంతమంది ఎక్స్సర్వీస్మెన్లకు పట్టాలు ఇచ్చారు. అలాగే 1960 మధ్య కాలంలో ఫ్రీడమ్ ఫైటర్స్, పొలిటికల్ సఫరర్స్ లాంటి వారికే ప్రభుత్వం భూమి కేటాయించేది.
అక్కడ హైకోర్టు తీర్పు అమలు చేసింది. ఇక్కడ హైడ్రా చర్యలు తీసుకోవచ్చు.
ఖానామెట్ లో దొంగ పత్రాలతో మాజీ సైనికుల పేర్లతో క్లెయిమ్ చేస్తున్నవారిపై ఇటీవల హైకోర్టు ఫేక్ అని తెల్చి స్వాదీనం చేసుకోవాలని అదేశాలు ఇచ్చింది. సర్వే నం. 41/12, 41/13, 41/14లోని 3 వేల కోట్ల విలువ చేసే 15 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాంటి దొంగ పత్రాలతో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ వారంతా కోర్టుల్లో ఏదో కేసు వేసుకుని ఆ ఆర్డర్లను చూపించి కాలం గడుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారు. అయితే పొజిషన్ తీసుకునేందుకు హైడ్రాకు అన్ని అర్హతలు ఉన్నాయి. రాత్రికి రాత్రి పేదల ఇళ్లను కూల్చివేసిన హైడ్రా, వీవీఐపీలవి, సినీ ప్రముఖులవి ఎందుకు చట్టాలు అడ్డువస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. 5 వేల కోట్ల భూమిని కాపాడిన పేరు ప్రభుత్వానికి దక్కుతుంది ! ఎన్నో పథకాలకు డబ్బులు సమకూర్చినట్లు అవుతుంది
*ఇసుక మాఫియా అక్రమాలకు బలైన నిండు ప్రాణం
అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిపిన లారీలు
భుజంపై రోగిని మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు
భుజంపై మోసుకుని వెళ్ళే సరికి ప్రాణాలు కోల్పోయిన వంశీ
దగ్గుపాటి లీగల్ టీమ్‌కి,
మీ లీగల్ టైటిల్ తెలుసా?
ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమియే!!
మీరు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళతో రెగ్యులర్ చేసుకోవాలని చూస్తున్నారు !!
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
*హైడ్రా అన్ని గమనిస్తుంది*
1ప్రభుత్వ భూమిలో 20-05-1993న సప్లిమెంటరీ సేత్వార్ ఫైల్ నెం. జీ8/2867/93 ద్వారా మీరు చెప్పిన షేక్ హమ్మద్కి పట్టా ఇచ్చారు (నం. బి/727/1994). దీని ప్రకారం పట్టా ఇచ్చిన తర్వాత జీ.ఓ. నెం. 1117 ఆఫ్ 1993 ప్రకారం 10 ఏళ్లు నిండిన తర్వాతనే కదా, మీరు కలెక్టర్ వద్ద నుంచి ఎన్వోసీ తీసుకుని కొనుగోలు చేయాల్సింది?
1992లో మీ మాజీ సైనికుడు కాసాని కృష్ణకు జీపీఏ చేస్తారు. ఆ తర్వాత అతని భార్యకు 1995లో సేల్ డీడ్ చేసుకుంటారు. దాన్ని 1996లో మీ దగ్గుపాటి కుటుంబం పేరుపై ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది?
2002 వరకు ఎందుకు మ్యుటేషన్ చేయించుకోలేదు?
21960లో అప్లికేషన్ పెట్టుకుంటే, 1964లో A3/E1/11993/60 గా 08-04-1964న ఫారం-9 ఇచ్చారని చెప్పుతున్నారు.
వారి జీపీఏలో ఫైల్ నంబర్ ఉందా? అప్పటికి ఈ భూములన్నీ ప్రభుత్వ భూములే. 1993 తర్వాత సేత్వార్ ఇష్యూ చేశారు కదా?
ఎలా ప్రభుత్వ భూమిని 1992లో జీపీఏ, 1995లో సేల్ డీడ్ చేయించుకుంటారు? 1960లో పెట్టుకున్న అప్లికేషన్లు ఫేక్ అని అప్పటి రంగారెడ్డి కలెక్టర్ శేషాద్రి అన్నింటినీ రద్దు చేశారు. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ టైపింగ్ మిషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో లేవని తెలుసు కదా?
3మీ కుటుంబం 5 డాక్యుమెంట్లలో ఎమ్మార్వో క్లియరెన్స్ ఫైల్ నంబర్లు 48/891/93, 449/93 అని పేర్కొన్నారు. ఆ ఫైళ్లు ఎమ్మార్వో ఆఫీసులో ఎందుకు దొరకడం లేదు?
4మీ దగ్గర అన్ని రికార్డులు ఉంటే 2015 నుండి ఇంకో ఎవ్వరో కేసు వేస్తే ఎందుకు కోర్టుల్లో నిరూపించుకోలేకపోతున్నారు?
OS 1256/2021 కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండా ఆపేందుకు హైకోర్టు (CRP 4096/2024) నుండి ఎందుకు స్టే తీసుకొచ్చారు?
5ఇలా ఈ 5 ఎకరాలే కాదు. మంత్రి హజరోద్దిన్కి ఇచ్చిన ఇండోర్ స్టేడియం భూములు, రామనాయుడు పేరుతో కడుతున్న నెట్ క్రికెట్ — ఇలా మొత్తం 26 ఎకరాలు ఫేక్ సర్టిఫికేట్లతో భూ దందాను ప్రభుత్వంతో కలిసి రెగ్యులరైజ్ చేసుకునేది నిజం కాదా?
6అపర్ణ రియాల్టీ పేరుతో ఉదయ్ కుమార్ రెడ్డి తన సెక్యూరిటీని పెట్టించి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది వాస్తవం లేదా? ఒక మంత్రి మళ్లీ ఎన్వోసీ ఇప్పించి అనుమతులు ఇచ్చేందుకు అపర్ణకు అప్పగించారనే ఆరోపణలో వాస్తవం లేదా? ఈ భూమి క్లియర్ చేసుకుంటే మిగతా ప్రభుత్వ భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో కొట్టేసిన మరో 21 ఎకరాలు ఎవ్వరూ అడగని వేల కోట్ల బిజినెస్ చేసుకోవచ్చని మీకు ఆలోచన లేదా?
ఖానామెట్‌లో వీళ్ల కబ్జాలు ఆగేదెప్పుడు ?
సిని పెద్దల మాటున 26 ఎకరాల ఆక్రమణ !
బంధువైన మంత్రి అండదండలతో
మొదలైన పనులు
ఎంఓయూ ద్వారా అనుచరుడి
రియల్ సంస్థకు అప్పగింత?
హైడ్రాకి ఆధారాలు ఇస్తాము !!
సవాలుగా తీసుకొని వేల కోట్ల ప్రభుత్వభూమి ని కాపాడుతారా !
@TelanganaCMO@BRSparty@BJP4Telangana@INCTelangana@Comm_HYDRAA
రూ. 20 వేల కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు ?
అదాని కోసమా?
అన్నదమ్ముల ఆస్తుల పెంపకం కోసమా?
రాత్రిపూట పనులతో ఏమనుకోవాలి?
99 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు పనులేలా?
Full detailed story comment box లో
@TelanganaCMO@BRSparty@BJP4Telangana@INCTelangana