ఆధ్యాత్మిక చైతన్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక ‘తొలి ఏకాదశి’
తెలుగు సంవత్సరంలో పండుగలకు నాంది పలికే తొలి ఏకాదశి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#TholiEkadashi#JanaSenaTelangana
23.07.26 తేదీన సబ్బవరం మండలం, ఇరువాడ జి.ఎస్ కన్వెన్షన్ హాల్లో సబ్బవరం మేజర్ పంచాయతీ, పైడివాడ, పైడివాడ అగ్రహారం మరియు ఆరిపాక పంచాయతీల నుండి సుమారు 500 మంది నాయకులు మరియు కార్యకర్తలకు కండువాలు కప్పి జనసేన పార్టీలోనికి సాధరంగా ఆహ్వానించడం జరిగింది@JanaSenaParty@JSPShatagniTeam#jsp
చిన్నంపల్లి లో రెపరెపలాడిన జనసేన జెండా..
కళ్యాణదుర్గం నియోజకవర్గ సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో అట్టహాసంగా వేడుకలు...
జెండా ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ @tc_varun గారు...
గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ...
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన మరింత బలపడాలి...
ఔత్సాహిక నాయకులకు భవిష్యత్తులో సువర్ణ అవకాశాలు...
అహుడ పరిధిలో 900 కు పైగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి పని చేస్తున్నాం...
విశేష అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నాం...
@JanaSenaParty అధినేత @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధనే జనసైనికులకు మార్గదర్శకం...
శ్రీ TC Varun గారి సమక్షంలో భారీ సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరికలు...
కళ్యాణదుర్గం ఇన్చార్జ్ శ్రీ బాల్యం రాజేష్ గారి ఆధ్వర్యంలో...
జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ టీ.సీ.వరుణ్ గారు...
జై జనసేన.. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో మార్మోగిన చిన్నంపల్లి...
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు, వివిధ శాఖల డైరెక్టర్లు, జిల్లా మరియు నగర కమిటీ నాయకులు, మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, నాయకులు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 36 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
అధ్యక్షులవారి స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి స్థాయిలో జరగనుంది.
#JSPMembershipToLeadership
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership
Peak hypocrisy! After 16 paper leaks during your tenure, you’re now claiming to speak for students?
Aren’t you, the BRS leaders, answerable to the youth of Telangana first?
అంటే దీని బట్టి మీరు కనీసం మళ్లీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే ఆలోచన కూడా పెట్టుకోకూడదు !
Am i right? @KTRBRS
By the way Happy Birthday sir 💐
#PaperLeaks #TelanganaYouth
#Accountability #BRS
@JSPTelangana@itsRamTalluri@JanaSenaParty
A special message to Gen Z and youth standing up for accountable education: I applaud your tenacity. But..... don't get trapped by external extremes or divisive elements. If you hear anyone saying anything that is anti-India and our country, walk away.
Stay righteous to your cause and focus on your future. 🇮🇳 🇮🇳
#SkillUpIndia #GenZ #YouthMentorship #InformedCitizenship #VijayIndian #DelhiProtests #NEET #PaperLeak #GenZ #WeHearYou #CJPProtest #NationFirst #StudentVoiceTo
కలసికట్టుగా పని చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మనదే
•క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటే గెలుపు సులువవుతుంది
•విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా కష్టపడాలి
•శ్రీ @PawanKalyan గారు ఆశయాల సాధనే ధ్యేయంగా అడుగులుపడాలి
•జనసేన పార్టీ విజయవాడ నగర సమీక్షలో రాష్ట్ర మంత్రి శ్రీ @kanduladurgesh , జనసేన పార్టీ నాయకుల ప్రసంగం
‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామ’ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పేర్కొన్నారు. నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తే గెలుపు మరింత సులువవుతుందని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా మన ప్రణాళికలు ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కష్టపడి పని చేస్తే వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారి నేతృత్వంలో విజయవాడ నగర సమీక్ష సమావేశం సుజన కన్వెన్షన్ హాలులో శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ... “ఈ రోజు రాష్ట్రంలో జనసేన జెండా రెపరెపలాడుతోంది అంటే దానికి కారణం జనసైనికులు, వీరమహిళల అలుపెరగని శ్రమే. సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా రాత్రింబవళ్లు పడిన కష్టం, చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయం. అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మనం శ్రమించాల్సిన అవసరం ఉంది. విజయవాడ గడ్డపై జనసేన జెండాను గర్వంగా ఎగరవేయడమే మన తదుపరి లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి నుంచే ప్రజల్లో ఉందాం. వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరాల్లో తోడుగా నిలబడుతూ ప్రజలకు మరింత చేరువవుదాం. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వారి నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుదాం.
•ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అది సాధ్యం కాదు
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం కోసం అధినేత శ్రీ @PawanKalyan గారు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీలను నియమించారు. అందులో భాగంగా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా వెళ్లే అవకాశం నాకు దక్కింది. విజయవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరించాను. కేవలం అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా, వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను. నన్ను కలవడానికి వచ్చిన వారిలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు తామంతా పార్టీ స్థాపించినప్పటి నుండి జనసేన జెండాను మోస్తున్నామని గర్వంగా చెప్పారు. దశాబ్ద కాలంగా వారిలో ఉన్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్లికేషన్లు అందించిన వారిలో అత్యధికులు దైనందిన జీవితంలో కష్టపడి పనిచేసే సామాన్యులే. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. సమాజంలో కింది స్థాయి వర్గాలుగా ఉన్న శ్రామికుల్లో ఇంతటి బలమైన రాజకీయ భావజాలం, మార్పు కోసం ఆరాటం ఉండటం నిజంగా అద్భుతం. ఇలాంటి నిస్వార్థమైన అండ ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ పార్టీకీ సాధ్యం కాదు. అక్కడకు వచ్చిన విభిన్న వర్గాలను చూస్తే ఒక విషయం స్పష్టమైంది. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో లేదా మతానికో పరిమితమైనది కాదు. ఇది అన్ని కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆశయాల నుంచి పుట్టిన నిజమైన పార్టీ. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మనం కీలక భాగస్వాములుగా ఉంటూ, పార్లమెంట్, శాసనసభలలో ప్రజా గళాన్ని అత్యంత బలంగా వినిపిస్తున్నాం. మనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా, అద్భుతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకువస్తున్నాం. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో అయితే పార్టీని స్థాపించారో, ఆ ఆశయాల సాధనే ధ్యేయంగా మనం సరైన దిశలో అడుగులు వేస్తున్నాం. ఈ కూటమిలోని మూడు పార్టీలు ఇదే ఐక్యతతో, పరస్పర సమన్వయంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో కచ్చితంగా అఖండ విజయం సాధిస్తాం’’ అన్నారు.
•రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం మనదే : శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు
శాసనమండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుంది. ఈ రెండేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాం. ముఖ్యంగా విజయవాడలో శాంతిభత్రలు విఘాతం కలగకుండా చూశాం. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పని చేయాలి. ముఖ్యంగా డివిజన్లలో చాలా సమస్యలు ఉన్నాయి.
ఓం నమో నారాయణాయ
సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన రోజు, శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం సుఖ, శాంతులతో, సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.
#TholiEkadasi#ekadasi
హైదరబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో, శ్రీ నిమ్మకాయల పెద్దిరాజు, శ్రీ రామ్ మోహన్, శ్రీమతి పైబోయిన లలిత నాయుడు, గరగ నాగమణి నేతృత్వంలో విజయవంతంగా జరిగిన శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూల మంత్ర మహా హోమం.
#Varahi#JanaSenaTelangana
Andhra Pradesh Hon'ble Deputy Chief Minister & Forest Minister Sri @PawanKalyan Garu welcomed trained Kumki elephants Jayant and Abhimanyu at Mangalagiri, fed them, and flagged off their journey from Palamaneru to Guchimi Camp in Parvathipuram Manyam to help prevent human-elephant conflicts.
#KumkiElephants