ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే పేషంట్స్ ది, అది మర్చిపోవద్దు. ఒక్క నెల జీవితకాలం పెరిగినా, అది వాళ్ళకి, వాళ్ల కుటుంబీకులకు ఎన్నో జ్ఞాపకాలు మిగులిస్తాయి, మర్చిపోకండి.
ఎవరి నిర్ణయం వాళ్ళది, ఉచిత సలహాలు మానుకోండి.
ఒక patient నాతో Thank you sir అన్నారు. స్కాన్ లో క్యాన్సర్ లేదు,ట్రీట్మెంట్ పని చేసింది, నేను క్యాన్సర్ ఫ్రీ అన్నారు.చాలా ఆనందం గా అనిపించింది. వాళ్ళ ఆనందంలో భాగం అయినందుకు, ఆ ఈశ్వరుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొన్ని నిమిషాలు మైమరచిపోయాను.
మా పాపని NURSERY లో చేర్చుదాం అని స్కూల్ కి వెళ్ళాను. సుమారు లక్ష రూపాయలు అవుతుంది అంటే చేసేదేమీ లేక వాళ్ళు ఇచ్చిన ఫార్మ్స్ నింపుతున్న. నేను, నా భార్య మాట్లాడుకుంటుంటే ఒక ఆవిడ అంది, మీరు ENGLISH లోనే మాట్లాడాలి , ఇంట్లో అయిన ఇక్కడ అయిన, పాప తో కూడా ENGLISH మాత్రమే మాట్లాడాలి అని
నేను కూడా ఒకసారి హిమాలయాలకు వెళ్లి ఏదైనా BIRYANI RECIPE ని నేర్చుకొని వస్తా, అది క్యాన్సర్ ని నయం చేస్తుంది అని చెప్తా. ఇప్పుడు చేప ప్రసాదం లాగా biryani ప్రసాదం అని పెడతా, అప్పుడు నాకు మద్దతు ఇవ్వక పోవాలి, మీ అందరినీ శపిస్తా!
9వ తేదీన నేను exhibition grounds కి వెళ్లి చేపలు తెచ్చుకోవాలి అని అనుకుంటున్న, అక్కడ కొర్ర మీను చేపలు ఫ్రీ గా పంచుతారంట కదా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం అని చెప్తే, మనిషికి ఒక చేప చొప్పున ఇస్తారేమో ?
ఆ medicine/ ప్రసాదం/మందు లో ఏముందో చెప్తే దాని శక్తి పోతుంది అని చెప్పారట, అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి?
ఇంకా ఏమన్నా అంటే,side effects లేవు కదా అంటారు, ఒరేయ్ అసలు ఎఫెక్ట్ ఉంటే కదా side effects అని గట్టిగ అరవాలి అని ఉంది, ఇంకో వైపు నాకెందుకు లే అనిపిస్తోంది.
NIRF rankings లో నేను చదివిన PGIMER CHANDIGARH medical విభాగంలో రెండవ స్థానంలో ఉన్నందుకు ఆనందించాలో లేక తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా TOP 50 లో లేనందుకు బాధ పడాలో అర్థం కాట్లేదు @BRSHarish@KTRBRS
ఇది ఎవరిని దూషించడానికి చేసిన TWEET కాదు, మనం ఎందుకు వెనక బడ్డం?
మనం కూడా అందరి లాగే బ్రతకాలి, అందరి కన్నా మెరుగ్గా బ్రతకాలి అనే భావన తప్పు కాదు. దాని కొరకు డబ్బు సంపాదించడం తప్పు కాదు. కష్ట పడండి, మెరుగైన జీవితం కోసం ఆశ తో ఎదురు చూడండి.
నేను డబ్బు కోసం పని చేసే వైద్యున్ని
ఈ రొజు జీతం రాగానే చక చక EMI కట్టేసా, పోయిన నెల తీసుకున్న అప్పు కట్టేస, మా ఇంట్లో వాళ్ళకి కొన్ని డబ్బులు వేసా, మా అమ్మాయికి స్కూల్ ఫీజు కట్టెసా, ఇంకా మిగిలిన డబ్బులు ఎలా పొదుపు చేయొచ్చు అనే దాని మీద ఆలోచన చేస్తున్న.
కొంత మంది అయితే నిజంగానే తప్పు చేస్తున్న భావం లో ఉంటారు. అలా ఉండకండి. మీరు ఏ తప్పు చేయట్లేదు.
మీరు మీ శ్రమ కి ఒక ప్రతిఫలం ఆశిస్తున్నారు, అది తప్పు కాదు.
తప్పు అని ఎవరైనా చెప్తే, అది వినకండి. ఎదురించి మాట్లాడండి. అపరాధ భావన (Guilt feeling) లో ఉండకండి.