Scene lu practice start chesi kuda last ku movie drop chesara...
Aa saindhav place lo idi padina baa unnu
Between green tea antha baaga kaluputara masteruuu 😅 @VenkyMama
Andy Dufresne pulled off one of cinema’s greatest prison escapes, while Morgan Freeman’s unforgettable performance as Red made The Shawshank Redemption truly timeless.
40వసంతాల @VenkyMama తో నా అనుబంధం
1986 లో కలియుగ పాండవులు చిత్రం చూసినప్పుడు (అప్పటికి నా వయసు 15)
ఆ స్టైల్ యాక్టింగ్.. డాన్సులు, ఫైట్స్ చూసి
బలే ఉన్నాడు .. ఆకర్షణ స్టార్ట్ అయ్యింది.. ఆతరువాత వచ్చిన బ్రహ్మరుద్రులు ,అజేయుడు, భారతంలో అర్జునుడు , త్రిమూర్తులు, ఆఖరికి విజేత విక్రమ్ ప్రతి చిత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు నచ్చినవే.. ఎందుకంటే కథలను జడ్జి చేసే వయసు కాదు కాబట్టి.. టూ టౌన్ రౌడీ సినిమా విడుదల సందర్భంగా అనకాపల్లి లో అభిమాన సంఘం ప్రారంభించడం జరిగింది. బొబ్బిలిరాజ సినిమా టైమ్ కి రికార్డ్స్ మీద ఒక అవగాహన.
ఆ సినిమా 200రోజుల ఫంక్షన్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగినప్పుడు వచ్చిన ఆహ్వానం మేరకు హైదరాబాద్ సారధి స్టూడియో లో జరుగుతున్న కూలీ నెంబర్ 1 షూటింగ్ లో
@VenkyMama గారితో తొలి ఫోటో తీసుకోవడం జరిగింది..
వెంకటేష్ బాబు గారిని పర్సనల్ గా అప్పటికే వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్న స్వర్ణ కమలం షూటింగ్ లో కలవడం జరిగింది.
బొబ్బిలి రాజా టైమ్ లో వైజాగ్ ఫ్యాన్స్ తో
ఎక్కువ మెలోడీ థియేటర్ దగ్గర కలిసేవాడిని.
అనకాపల్లి లక్ష్మీ థియేటర్ లో బొబ్బిలి రాజా 107 రోజులు 4 ఆటలతో ప్రదర్శించబడి టౌన్ రికార్డు ..ఆ సందర్భంగా థియేటర్ వారికి షీల్డ్ ఇవ్వడం జరిగింది..
చంటి సినిమా 100 రోజులు వేడుకలు వైజాగ్ లో అభిమానులు జరిపినప్పుడు..
సుందరకాండ సినిమా షూటింగ్ గీతం కాలేజీ లో జరిగినప్పుడు వెంకటేష్ బాబు గారిని కలవడం జరిగింది.. ఎప్పుడు కలిసినా
మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి..
అని చెప్పేవారు. ఇంట్లో ఇల్లాలు100 రోజులు వేడుకలు కర్నూలు లో జరిగినప్పుడు ..లక్ష్మీ సినిమా 50రోజుల వేడుకలు ఏలూరులో జరిగినప్పుడు వెంకటేష్ బాబు చేతుల మీదుగా షీల్డ్స్ అందుకోవడం ఒక మంచి జ్ఞాపకం. అప్పట్లో ఫోన్లు లేకపోవడం వలన
వెళ్ళినప్పుడు కలవడం తప్ప పెద్దగా హీరో గారితో మాట్లాడే అవకాశం ఉండేది కాదు.
వెంకటేష్ బాబు గారి రికార్డ్ ల గురించి ఎక్కువగా అప్పటి సురేష్ మూవీస్ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ గారితో చర్చించేవాళ్ళము..ఆయన అభిమానులకు మంచి కో ఆపరేషన్ చేసేవారు .. పదిమంది స్నేహితుల్లో ఒక్కడిగా నేను హైదరాబాద్ వెళ్ళేవాళ్ళము.. ఆయన నన్ను పేరు పెట్టీ పిలిచే అవకాశం వస్తుందా ..రాదా..
అసలు నేను ఆయనకి తెలుసా ..తెలీదా..
ఇటువంటి సందేహాలతో చాలా ఏళ్ళు గడిచిపోయాయి...
నీ పని నువ్వు సిన్సియర్ గాచెయ్.. ఆశించకు. అని ఆయన చెప్పిన మాట నా మైండ్ లో నాటుకు పోయింది.. పర్యవసానంగా నేను ఏదైతే అనుకునేవాడినో దానికి మించి జరిగింది.
అదే విధంగా ఎవరి గురించి ఆలోచించకుండా
నా పని నేను సిన్సియర్ గా చేయడం వలన
వెంకటేష్ బాబు గారి తో నా అనుబంధం చాలా స్ట్రాంగ్ అయ్యింది.
ఈ జర్నీ లో ఎంతో మంది మంచి అభిమానులు పరిచయం అయ్యారు..
వాళ్లందరూ నా జీవితంలో గుర్తుండిపోయే
మంచి స్నేహితులు ..నా కుటుంబ సభ్యుల్లో ఒకరయ్యారు.
వెంకటేష్ బాబు గారిపర్శనల్ రాఘవ అన్నయ్య గారి తో నా అనుబంధం గురించి
ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.