Lancham isthene kaani teeyanu ani direct ga chepthunnaru both jcb driver and corporator. What to do ? What can we expect Commissioner sir @Our_GMC
Resolve avthundha ee problem? Akkada bank ki vacche senior citizens are suffering. Koddhiga daari adigithe 3000/-kadithene teesthaam
నిన్న నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు.
రాజకీయాల్లో అతనికి ఎవరిపట్లా మొగ్గు లేదు.
అభిమానం లేదు… ద్వేషం లేదు…
కేవలం నిశ్శబ్దంగా గమనించే మనిషి.
మాట్లాడుతుండగా రాజకీయాల ప్రస్తావన వచ్చింది.
పవన్ కళ్యాణ్ పేరు వినగానే అతని ముఖంలో ఒక చిన్న మార్పు. ఆశ్చర్యం… ఆ తర్వాత గౌరవం. కాసేపు మౌనంగా ఉండి, ఆపై నెమ్మదిగా ఇలా అన్నాడు
“నిజం చెప్పాలంటే…
అధికారంలోకి వచ్చాక ఆయన మారిపోతారని అనుకున్నాను.
కానీ కాదు… ఆయన అలాగే ఉన్నారు.
అదే స్వభావం. అదే సత్యం.”
ఆ మాటలు విన్నప్పుడు నాకు ఒక రకమైన గర్వం కలిగింది.
తర్వాత అతను మరొక మాట కూడా అన్నాడు,
ఆ మాటలు మాత్రం నన్ను లోపల నుంచి కదిలించింది
“ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండి కూడా
ప్రజల కోసం తన జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు ఎక్కడ కనిపిస్తాడు?
ప్రభుత్వ నిధుల మాట కాదు…
స్వంత సంపాదనతో సాయం చేసే మనసు అందరికీ ఉండదు.”
అప్పుడే అర్థమైంది. ఇవి అభిమానుల చప్పట్లు కాదు. వ్యతిరేకుల విమర్శలు కూడా కాదు.
ఇవి…
ఒక తటస్థ మనిషి కళ్లతో చూసిన నిజం.
మనసుతో అంగీకరించిన సత్యం.
అధికారం చాలామందిని మార్చేస్తుంది అంటారు.
సూత్రాలను తుడిచేస్తుంది.
విలువలను నిశ్శబ్దంగా దూరం చేస్తుంది.
కానీ కొంతమంది మాత్రం మారరు.
ఎందుకంటే వాళ్ల లో పదవి అహంకారం ఉండదు.
నిన్న నా స్నేహితుడి మాటల్లో
నేను ఒక ఆశను చూశాను.
నిజాయితీ ఇంకా బతికే ఉంది.
నాయకత్వం ఇంకా బ్రతికే ఉంది.
అలాంటి నాయకులు ఇప్పటికీ ఉన్నారు.
నేను నమ్మిన నాయకుడు గొప్పోడు అని గర్వంగా చెప్పగలను ❤️❤️❤️
జై @PawanKalyan 🙏🫡
జై జనసేన ✊