ముఖ్యమంత్రి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు కల్పించిన పోలీసు భద్రత తరహాలోనే,మా నాయకుడికి తగిన భద్రత కల్పించాలని కోరుతూ అభిమానులు ఎల్బీ నగర్ ACP గారికి ఇప్పటివరకు 28 ఫిర్యాదులు సమర్పించారు.
ఇప్పుడు అయినా మా వినతిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను కోరారు.
@revanth_anumula@TelanganaDGP
#IStandWithRSP
రేవంత్...
మీ 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ??
గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా ??
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే.
ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి.
అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం.
ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు.
72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్ లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో.
కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు.
కేసీఆర్ గారు టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు.
పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి.
జై కిసాన్
జై తెలంగాణ
అధికారం శాశ్వతం కాదు...
కానీ మీరు ఆచరించే వృత్తిధర్మం చరిత్రలో నిలిచిపోతుంది!
భద్రత అనేది రాజకీయ నాయకులు అనుభవించే 'స్టేటస్ సింబల్' కాదు... దేశం కోసం, రాష్ట్రం కోసం శ్రమించిన ఒక నిజాయితీ గల అధికారికి 'రాజ్యాంగం కల్పించే రక్షణ కవచం.
కానీ నేడు తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్క ఓటరూ గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, RSP గారికి ఉన్న సెక్యూరిటీని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అర్ధాంతరంగా తొలగించడం... కేవలం ఒక రాజకీయ కక్షసాధింపు మాత్రమే కాదు, అది అధికార వ్యవస్థలో కనిపిస్తున్న అత్యంత దారుణమైన అపరిపక్వతకు నిదర్శనం.
ఈ చర్య ఎందుకు ప్రమాదకరమో, ఎందుకు ఇంత తీవ్రంగా పరిగణించాలో ఆలోచించండి:
1. SWAERO ఆత్మగౌరవంపై దాడి:
RSP గారు ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. 26 ఏళ్ల పాటు ఒక ఐపీఎస్ అధికారిగా తన నెత్తురును, చెమటను ఈ రాష్ట్ర శాంతిభద్రతల కోసం ధారపోశారు. విధి నిర్వహణలో ఎందరో నేరస్థులను ఎదురించి, తన ప్రాణాలను పణంగా పెట్టారు.
అంతకంటే ముఖ్యంగా, SWAERO ఉద్యమం ద్వారా అట్టడుగు వర్గాల పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, అక్షర జ్యోతిని రగిలించిన ఒక సామాజిక విప్లవకారుడు ఆయన. అలాంటి వ్యక్తి భద్రతను తీసేయడం అనేది... కేవలం ఒక వ్యక్తిపై చేసిన దాడి కాదు, ఆయనను నమ్ముకున్న లక్షలాది అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని అవమానించడమే.
2. ప్రశ్నించే గొంతుకు ప్రాణసంకటమా?
గురుకులాల దుస్థితిని నిలదీస్తే... ప్రభుత్వ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపితే... అధికార పక్షం తప్పులను ప్రశ్నిస్తే ప్రాణరక్షణను లాగేసుకుంటారా?
"మా తప్పులను ఎత్తిచూపితే మీ ప్రాణాలకు మీరే బాధ్యులు" అని పరోక్షంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారినే బెదిరించే స్థాయికి వ్యవస్థలు దిగజారితే, రేపు ఈ రాష్ట్రంలో సామాన్యుడి భద్రతకు గ్యారెంటీ ఎక్కడ ఉంది?
ఒక ప్రొఫెషనల్ ప్రభుత్వం విమర్శలను తన పనితీరుతో తిప్పికొడుతుంది కానీ, కక్షసాధింపులతో కాదు.
3. చరిత్ర మర్చిపోలేని హిపోక్రసీ (Hypocrisy):
ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు "నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు భద్రత కల్పించండి" అని కోర్టుల మెట్లు ఎక్కిన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు... నేడు అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతల భద్రతను లాగేసుకోవడం ఎంతవరకు సమంజసం?
నాడు తనకు భద్రత కావాలని పోరాడిన నాయకుడు,
నేడు ఆ CM కుర్చీలో కూర్చోగానే రూల్స్ మార్చేస్తారా?
4. ఇదేనా మీ 'ప్రొఫెషనల్' గవర్నెన్స్?
చివరగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని సూటిగా అడగాల్సిన ప్రశ్న ఒకటుంది... 26 ఏళ్లు రాష్ట్ర శాంతిభద్రతల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మాజీ ఐపీఎస్ అధికారికి బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేసిన ఈ ప్రభుత్వం... ఎలాంటి రాజ్యాంగ పదవుల్లో, అధికారిక హోదాలో లేని ముఖ్యమంత్రి గారి తమ్ముళ్లకు సబ్-మెషిన్ గన్స్ , భారీ కాన్వాయ్‌లు, ఎస్కార్ట్‌లు ఎందుకు ఇస్తోంది? రాష్ట్రానికి వాళ్లు 'ఏం పీకిర్రు' అని అంత విఐపీ భద్రత కల్పిస్తున్నారు?
సిస్టమ్ కోసం అహర్నిశలు పనిచేసిన నిజాయితీపరులకు సెక్యూరిటీ కట్... సొంత బంధువులకు మాత్రం సబ్-మెషిన్ గన్స్‌తో పహారా!
బంధుప్రీతికి పెద్దపీట వేస్తూ, ప్రశ్నించే గొంతుల ప్రాణాలతో చెలగాటమాడటం ప్రజాస్వామ్యంలో ఏ రకమైన న్యాయం?
మీరు లాక్కున్నది కేవలం ఇనుముతో చేసిన కారును మాత్రమే...
కానీ RSP గారి వెనక ఢాలులా నిలబడే లక్షలాది మంది యువత సంకల్పాన్ని ఏ ప్రభుత్వమూ టచ్ చేయలేదన్నది వాస్తవం.
ప్రజాస్వామ్యంలో పాలకులకు హుందాతనం అవసరం... కక్షసాధింపు కాదు!
ఓటర్లకు విజ్ఞప్తి:
నిజమైన నాయకుడు తన ప్రత్యర్థులను మెరుగైన పాలనతో, పదునైన ఆలోచనలతో ఎదుర్కొంటాడు. కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని ప్రత్యర్థి ప్రాణాలను పణంగా పెట్టడం 'అధికార దర్పం' అనిపించుకోదు...
అది ప్రభుత్వ 'నైతిక పరాజయం'.
ప్రభుత్వాలు మారొచ్చు, తుపాకులు, గన్మెన్లను లాగేసుకోవచ్చు... కానీ SWAERO లుగా ఆయన రగిలించిన చైతన్యాన్ని,
ఆయన వెంట నడిచే సైన్యాన్ని ఏ ప్రభుత్వమూ ఆపలేదు! ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజల కోసం పనిచేయాలి కానీ, ఇలాంటి కక్షపూరిత చర్యలకు కాదు.
#IStandWithRSP @RSPraveenSwaero
ప్రాణం తీసేది తూటా.. ప్రాణం పోసేది మాట! 🎯🔥
100 డిగ్రీల జ్వరం ఉన్నా సరే, గులాబీ సైనికుల కోసం కదిలివచ్చిన నాయకుడు కేటీఆర్ గారు! ఈ స్పీచ్ వింటే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే! ✊💥
@KTRBRS@RSPraveenSwaero@BRSparty
“2028 నవంబర్-డిసెంబర్లో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావడం పక్కా!” 🔥
అధికారులకు కేటీఆర్ గారి స్ట్రాంగ్ వార్నింగ్..
“డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. నేను, మా ఆర్.ఎస్. ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి
ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం,
వడ్డీతో సహా చెల్లిస్తాం.
@KTRBRS@RSPraveenSwaero@BRSparty
#KTR #RSPraveenKumar #BRS #Telangana
For decades, he stood as our shield. Today, WE become his shield!
RS Praveen Kumar is the heartbeat of a movement that cannot be silenced.
His safety is OUR responsibility,
and it is strictly non-negotiable.
To the entire SWAERO family and
every citizen who believes in justice:
Let them hear our roar!
Flood your timelines.
Post these hashtags until our united voice shakes the highest authorities.
We will not be ignored! ✊🔥
#IStandWithRSP #SecurityForRSP
📢 గురుకులాల పర్యవేక్షణ పేరుతో అధికారులతో ముఖ్యమంత్రి మైండ్ గేమ్స్!
గురుకులాలకు వస్తువులు అందజేయడంలో ఇంతకు ముందున్న పారదర్శకత ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అధికారులు, మంత్రులైన అద్దూరి లక్ష్మణ్ కుమార్, అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ లను బలిపశువులను చేస్తున్నారు.
కానీ వస్తువుల కొనుగోలు, నిధుల వ్యవహారాలు వచ్చేసరికి మాత్రం ఎవరికీ తెలియకుండా స్టార్ హోటళ్లలో మీటింగ్ లు పెడుతున్నారు. అక్కడ ఒక ముసాయిదా జీవో సిద్ధం చేసి, సచివాలయంలో తమకు ఇష్టమైన అధికారులతో సంతకాలు చేయించి, నేరుగా ముఖ్యమంత్రికి పంపించేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఆయా శాఖల మంత్రులకు కనీసం సమాచారం కూడా లేదు. ఈ పద్ధతులు చూస్తుంటే ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతోంది!
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
📢 కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీకి మరో కొత్త మార్గం!
తెలంగాణలో ఉన్న మంత్రులకు తోడుగా, ఇంకొందరిని మంత్రులుగా నియమిస్తే, తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలో వారే చూసుకుంటారు. మఫత్‌లాల్, రమేష్ జైన్, నిరంజన్ జైన్ వంటి వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చి, దేశవ్యాప్తంగా దోచుకున్న డబ్బును బస్తాల్లో నింపి తీసుకురండి అని చెప్పండి.
ఈ బడ్జెట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత కేటాయించారు, ఎంత దోచుకోవాలో అనేది నేరుగా ఒక సబ్ హెడ్ పెట్టి చూపించండి. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ప్రజా ధనాన్ని దోచుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇన్ని పన్నాగాలా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
26 ఏళ్లు నా భార్యాబిడ్డలను వదిలేసి దేశ రక్షణ కోసం నా ప్రాణాలను పణంగా పెట్టాను. నాపై 3 సార్లు హత్యాయత్నం జరిగినా ఏనాడూ వెనకడుగు వేయలేదు. నా సేవలను గుర్తించి రాష్ట్రపతి ఇచ్చిన 'శౌర్య పతకం' నా ధైర్యానికి సాక్ష్యం.
కానీ, ప్రజా సమస్యలపై నిలదీస్తున్నానన్న అక్కసుతో నేడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాత్రికి రాత్రే నా భద్రతను కుదించింది. నా గన్ మెన్లను, కారును లాక్కుంది. నా దగ్గర స్థిరాస్తులు లేవు, నా ఆస్తి నా ప్రజలే!
నాకు భద్రత తగ్గించినా, నన్ను చంపే ప్రయత్నం చేసినా సరే... నా ఆత్మ కూడా ప్రజల కోసమే మాట్లాడుతుంది!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నా పోరాటం ఆగదు, నేను ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా. ✊
#Telangana #CongressFails #PeoplesVoice
@RSPraveenSwaero
Thanks a million, @KTRBRS Anna garu for the voice of solidarity. Under your leadership we will continue this epic fight against injustice in Telangana. Come what may 👊
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఎక్కువ కాలం పని చేశారు.
కాంగ్రెస్ విధివిధానాలు పాటించడం వల్లనే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది.
తిరిగి ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆయనను లేకుండా చేయాలని చూస్తుంది.
గురుకులాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు.
మాజీ మంత్రి,శ్రీనివాస్ గౌడ్.
@VSrinivasGoud
కేసీఆర్ గారితో జరిగే సమావేశాల్లో వ్యక్తుల గురించి కాదు... తెలంగాణ గురించి మాట్లాడుతాం.
తెలంగాణ బాధలు, రైతుల కష్టాలు, యువత భవిష్యత్తు, నిరుద్యోగుల ఆశలు, సామాజిక న్యాయం, రాష్ట్ర అభివృద్ధి ఇవే చర్చకు వస్తాయి.
ప్రతిపక్ష రాజకీయాల కంటే ప్రజల సమస్యలకు పరిష్కారాలే మా ప్రాధాన్యం.
తెలంగాణను ఇంకా ఎలా బాగు చేయాలి? అనే ఆలోచనే ప్రతి సమావేశానికి కేంద్రబిందువు.
— డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్
#Telangana #BRS #RSPraveenKumar
@RSPraveenSwaero
మైనర్ బాలిక పోక్సో కేసులో ఎందుకు సిట్ వేయలేదు?
కనీసం బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్