Ee Film Evaraina Choodakapothe Miss Avvakunda Choodandi. Golden Standards In Film Making Ante Ento Choostharu. Every Bit Of This Film Deserves Your Time. Worth Watching Film. From The Introduction To Climax, You'll Experience A Crazy Ride.
పారడైస్ మూవీ ఎఫెక్ట్..
నాని–సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘బ్లడీ రోమియో’పై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ‘ది పారడైస్’ ఫలితం, నాని తదుపరి ప్రాజెక్టుల షెడ్యూల్స్ నేపథ్యంలో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. #TheParadise #Nani #Sujith #BloodyRomeo #Tollywood
స్టార్స్‌తో సినిమాలు.. ట్రోలింగ్‌కు గురవుతున్న డైరెక్టర్స్!
టాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమా చేయడం దర్శకులకు ఎంత పెద్ద అవకాశం అయితే.. అదే సమయంలో అది పెద్ద సవాల్‌గా కూడా మారుతోంది. స్టార్ హీరో సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు సినిమా ఏ మాత్రం తగ్గినా, ముందుగా సోషల్ మీడియాలో దర్శకుడిపైనే ట్రోలింగ్ మొదలవుతోంది. ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ చేసిన ఓం రౌత్ విషయంలో సినిమా విడుదల తర్వాత విజువల్స్, కథనం, పాత్రల చిత్రీకరణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ చేసిన మారుతి విషయంలోనూ సినిమాపై వచ్చిన స్పందన దర్శకుడి టేకింగ్‌పై చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చేసిన మెహర్ రమేష్ పరిస్థితి కూడా ఇదే. సినిమా ఆశించిన స్థాయిలో స్పందన అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో దర్శకుడి పేరు చుట్టూనే ఎక్కువగా చర్చ జరిగింది. అంటే స్టార్ హీరోతో సినిమా అనగానే హీరో ఇమేజ్ను ఉపయోగించుకోవడం మాత్రమే కాదు.. ఆ ఇమేజ్‌కు తగ్గ కథ, ట్రీట్మెంట్, ఎగ్జిక్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా దర్శకుడిపైనే పడుతోంది.
ఇప్పుడు ఇదే చర్చ యష్–గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’, నాని–శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ సినిమాల విషయంలోనూ కనిపిస్తోంది. ‘టాక్సిక్’ విషయంలో భారీ అంచనాలు, యష్ ఇమేజ్‌కు తగ్గ విజువల్ ట్రీట్మెంట్పై చర్చ జరిగినట్టే, సినిమాపై వచ్చిన విమర్శల్లో దర్శకురాలి టేకింగ్ కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ‘దసరా’ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ‘ది పారడైజ్’ విషయంలో కూడా ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉండటంతో, సినిమాపై వచ్చిన స్పందనలో దర్శకుడి టేకింగ్, కథనం, ఎగ్జిక్యూషన్ అంశాలపై చర్చ జరుగుతోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడికి సినిమా విజయం వస్తే హీరోతో పాటు దర్శకుడికీ క్రేజ్ భారీగా పెరుగుతుంది. అదే సినిమా అంచనాలను అందుకోకపోతే మాత్రం విమర్శల భారం కూడా దర్శకుడిపైనే ఎక్కువగా పడుతోంది. దీంతో టాలీవుడ్లో ఇప్పుడు “స్టార్‌తో సినిమా చేయడం పెద్ద అవకాశం.. కానీ ఆ స్టార్ ఇమేజ్ను సరిగ్గా హ్యాండిల్ చేయడం అంతకంటే పెద్ద బాధ్యత” అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
#nani #prabhas #chiranjeevi #yaash #toxic #entertainment #viralvídeo
15 కిలోలు తగ్గనున్న రామ్‌చరణ్!
'పెద్ది'తో హిట్ అందుకున్న రామ్ చరణ్ సుకుమార్‌తో మూవీకి రెడీ అవుతున్నారు. పెద్ది లుక్ కోసం బరువు పెరిగిన ఆయన ఈ సినిమాలో స్లిమ్ కన్పించేందుకు 15 కిలోల బరువు తగ్గుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 2 వారాల కిందట చరణ్ బేగంపేట ఎయిర్‌పోర్టులో కన్పించగా, వెయిట్ లాసైనట్లు స్పష్టమైంది. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 20న కొత్త మూవీకి పూజ చేసి, 2027 ఎండ్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలని సుక్కూ భావిస్తున్నారట
#RamCharan #sukumar @AlwaysRamCharan@aryasukku #RC17
#Theparadise లో అర్థం కాని ప్రశ్నలు
1) సినిమాలో ప్రతి యాక్షన్ సన్నివేశంలో వర్షం కురుస్తునే ఉండటం
2) 1980 నేపథ్యంలో అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి సవారి అనే తెగ అంత దీనస్థితిలో హైదరాబాద్ నగరం నడిబొడ్డులో అలా ఉంటుందని చూపించడం... వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం.. అందునా దేశం కోసం పోరాడిన ఆ తెగను ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేకపోవడం.. వాళ్లను కట్టు బానిసలుగా చూపించడం..
3) హీరో, విలన్ ఎప్పుడూ కావాలంటే అప్పుడు ఎంతో మందిని తెగ నరుకుతుంటారు.. అప్పుడు గుర్తుకు రాని చట్టం, న్యాయం లాయర్లు పతాక సన్నివేశాల్లో తీసుకరావడం
4) పూర్తి యాక్షన్ సన్నివేశాలతో ఎప్పుడు ఫైట్ చేస్తూ తీవ్ర గాయాలతో ఆ ఫైట్ ఎండ్ అయిన తరువాత తదుపరి సన్నివేశంలో హీరో మాత్రం నీట్‌గా.. ..జడలు రెండూ వేసుకుని... ఫేస్ క్లీన్‌గా కనిపిస్తుంటుంది. మిగతా ఆర్టిస్టులు మాత్రం డార్క్‌గా డీగ్లామర్‌గా కనిపిస్తుంటారు ఎందుకని?
5) రాఘవ జుయల్ (విలన్) అనుచరుడిని ఇంటర్వెల్ ఫైట్‌లో చంపేస్తాడు. కానీ ఇంటర్వెల్ తరువాత అతన మళ్లీ మెహన్‌బాబు అనుచర గణంలో కనిపిస్తాడు ఎలా?
6) హీరోయిన్ వాళ్ల అమ్మ హ్యాండీ కెమెరాతో తీసి సినిమాలు థియేటర్లో విడుదల చేయడం ఎలా కుదురుతుంది సార్.. మీరు దర్శకుడే కదా?
ఇలాంటి అర్థం కాని చిక్కు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.. ఎక్కడా లాజిక్ లేదు.. సినిమాలో ఎమోషన్ లేదు.. జడలు చూసుకుని మురిశారు.. ఎమోషన్‌ను విస్మరిచారు..
#nani
#TheparadiseReview
When love came straight from the heart ❤️
22 MILLION+ VIEWS & counting for the #Ranabaali first single ❤🔥🎼
▶️ https://t.co/DAI9Xyq2VN
#EndhayyaSaami – Telugu
#YedhayyaSaami – Tamil
#EntheKannaala – Malayalam
#EnayyaSaami - Kannada
#OMereSaajan - Hindi
An #AjayAtul musical 🎼
#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.
#NeverForget
#RanabaaliOnOct16th