Its an Official Page of Collector & District Magistrate,Markapuram District to catch up with the public of Markapuram and strive for betterment of the District.
మార్కాపురం పట్టణంలోని సర్ కార్యక్రమం లో జరుగుతున్న ఎన్యూమ్యారేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియతీరును మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారు.సమయం తక్కువగా ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు.ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు...
గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.ఎన్యూమ్యారేషన్,డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలని,ఈ ప్రక్రియలో ఇంకా వెనుకబడి ఉండటాన్ని గమనించి సిబ్బంది నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
తేది:-04.07.2026,కొనకనమిట్ల
కొనకనమిట్ల మండలం, తువ్వపాడు,అంభవరం గ్రామాల్లో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఆకస్మిక పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.
తేది:-04.07.2026,మార్కాపురం
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు,ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి,వెలుగొండ ప్రాజెక్ట్ SE అబు తాలిం,ఇతర అధికారులు.
వెలిగండ్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్.
తేది:-01.07.2026,దోర్నాల
దోర్నాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరుగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ప్రత్యేక సమీక్షసమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాసులు గారు.
తేదీ:-01.07.2026,మార్కాపురం
మార్కాపురం పట్టణంలోని నాయుడు వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,మున్సిపల్ కమిషనర్ నారాయణరావు గారు,ప్రజా ప్రతినిధులు,ఇతర మున్సిపల్ సిబ్బంది..
#NTRBharosaPension#SocialSecurity
త్రిపురాంతకం మండల కేంద్రంలోని మండలప్రజాపరిషత్ కార్యాలయం లో జరుగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR ) కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,మార్కాపురం ఎస్ డీ సీ శ్రీ సత్యనారాయణ గారు, తదితరులు...
మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న DCC–District Consultative Committee,జిల్లాస్థాయిసమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయసునీత గారు, పాల్గొన్న వివిధ బ్యాంకుశాఖల మేనేజర్లు లు,మెప్మా,వ్యవసాయ శాఖ,ఉద్యాన,DRDA,మైక్రో ఇరిగేషన్,తదితర శాఖల అధికారులు.
తేది:-29.06.2026,మార్కాపురం
మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,ఇతర అధికారులు.
#PGRS#GrievanceRedressal
తేది:-29.06.2026, మార్కాపురం
మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాసులు గారు,ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు,వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు,రైతులు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డు లోని నీళ్ల ట్యాంక్ ఏరియా,పూల సుబ్బయ్య కాలనీ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు...
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా తర్లుపాడు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు,ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది.
#PulsePolio2026#EndPolioNow
తేది:27.06.2026,గిద్దలూరు
గిద్దలూరుమండలం,కిష్టంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంసందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సంజీవని సభలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయసునీత గారు.