భూభారతి, సాదా బైనమా, నక్ష సర్వే, రెవెన్యూ సదస్సులు, నారాయణపురం భూ సమస్యలపై గురువారం ఐ.డి.ఓ.సి లోని కాన్ఫరెన్స్ హాలులో CCLA కమిషనర్ లోకేష్ కుమార్, కమిషనర్, ల్యాండ్ సర్వే రాజీవ్ గాంధీ హనుమంతు లతో సమావేశమైన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, అడ్మిషన్ల వివరాలు మరియు విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద నక్ష సర్వే జరుగుతున్న ప్రదేశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేయడం జరిగింది.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అభివృద్ధి, వానాకాలం సీజన్, సంక్షేమ పథకాల అమలు, జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా అటవీశాఖఅధికారి విశాల్ బత్తుల,అదనపు కలెక్టర్లు రెవెన్యూ కె.అనిల్ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమం,వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పురుషోత్తం లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అడ్మిషన్ల పెంపు పై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
కొత్తగూడెం, గంగారం మండలాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ టెలికాం సంస్థల ప్రతినిధులతొ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమావేశం నిర్వహించి నెట్వర్క్ లేని మండలాలు గ్రామాలను గుర్తించి మొబైల్స్ సేవలను అందించడం కోసంసంస్థల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పురుషోత్తం, అధికారులతో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని గుమ్మడూరు లో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల నిర్మాణం పరిశీలించారు.
బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్ద వంగర మండలం ఉప్పరిగూడెంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సంబంధిత అధికారులు.
జిల్లాలోని అక్రమ ఇసుక రవాణా, మన ఇసుక వాహనం పథకం అమలు, లింగ నిర్ధారణ పరీక్షలు, మాతా శిశు సంరక్షణ,క్లినికల్ హాస్పిటల్ అనుమతులు, తదితర అంశాలపై సోమవారం కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ డాక్టర్ శబరిష్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వి.సి లో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ తొ కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోదాం పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులు.
హైదరాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో నీట్ పరీక్షల నిర్వహణ, ధాన్యం తరలింపు, ప్రజా పాలన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులతో పాల్గొన్నారు
శుక్రవారం గంగారం మండలంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ స్నేహా శబరిష్ లతో కలిసి ప్రారంబించారు.
బడిబాట కార్యక్రమం నిర్వహణ, తీసుకోవలసిన చర్యలపై గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో పిల్లల అడ్మిషన్ శాతం పెంచాలని సూచించారు.
ప్రజాపాల - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గూడూరు మండలం అప్పలరాజుపల్లి, పొనుగోడు గ్రామసభలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, గ్రామాలలో తీసుకోవలసిన అంశాలపై చర్చించారు.ఇందిరమ్మ ఇండ్లు, జనగణనసర్వే పరిశీలించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జనగణన-2027 ఇండ్ల గణనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమావేశం నిర్వహించారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి త్వరగా ఆన్లైన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుండి పాఠశాల,టెక్నికల్ విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో విద్యా శాఖ బలోపేతం తీసుకుంటున్న అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులు