మంథని, 2026 నవంబర్-25:
--------------------------------------------
*మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరచాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*వైద్యులు, సిబ్బంది విధులకు సమయపాలనతో హాజరుకావాలి*
*విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి*
*మంథని ప్రభుత్వ ఆసుపత్రి, టీ.జీ.డబ్ల్యూ.ఆ��్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు.
బుధవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని ప్రభుత్వ ఆసుపత్రి, టీ.జీ.డబ్ల్యూ.ఆర్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఓపీ విభాగం పనితీరు, వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం టీ.జీ.డబ్ల్యూ.ఆర్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యాబోధన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* మంథని ప్రభుత్వ ఆ��ుపత్రిలో ఓపీ సేవలు మరింత మెరుగుపడాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉన్న వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
ఓపీ విభాగంలో రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రిలో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఆసుపత్రిలోని వార్డులు, వైద్య పరీక్షల గ��ులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రోగులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు.
**విద్యార్థులకు నాణ్యమైన ���ిద్య, మెరుగైన వసతులు కల్పించాలి**
అనంతరం టీ.జీ.డబ్ల్యూ.ఆర్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి తరగతి గదులు, విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యాబోధన, భోజనం, వసతి సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమయపాలన పాటి���్తూ విధులకు ��ాజరుకావాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, భోజన నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలని, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశిం��ారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాల, కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థల్లో ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026,నవంబర్ 25:
--------------------------------------------
*క్రిస్మస్ సత్కారాలకు ప్రతిభావంతులైన క్రైస్తవ వ్యక్తులు, సంస్థల నుండి నామినేషన్ల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
---------------------------------------------
క్రిస్మస్ పండుగ 2026 సందర్భంగా నిర్వహించనున్న క్రిస్మస్ సంబరాల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవ, ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనున్నట్లు *జి��్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సామాజిక, వైద్య, విద్య, సాహిత్యం, కళా, క్రీడా రంగాల్లో 10 సంవత్సరాలకు పైబడి ఉత్తమ సేవలు, ప్రతిభ కనబరిచిన వ్యక్తుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నట్లు, వైద్య, విద్య, సామాజిక రంగాల్లో 25 సంవత్సరాలకు పైబడి ఉత్తమ సేవ అందించిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు, నామినేషన్ ఫారాలను హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి వ్యక్తిగతంగా గాని, https://t.co/9WoETffPHF వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని, పూర్తి చేసిన నామినేషన్ ఫారాలను నవంబర్ 30, సాయంత్రం 5 గంటలలోపు పెద్దపల్లిలోని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ���లో సమర్పించాలని, ఈ అవకాశాన్ని అర్హులైన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 040-23391067 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
*మంథని* నవంబర్ 25:
------------------------------------------
*పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
*గత ప���రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు*
*రాష్ట్ర వ్యాప్తంగా 4.7 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు*
*కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో 2,464 మంది కొత్త పింఛను లబ్ధిదారుల ఎంపిక*
*ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు*
*యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని నిర్మాణ పనులు పూర���తి చేయాలి*
*ఆర్ఆర్ గార్డెన్స్‌లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
-------------------------------------------
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదని *రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ద���ద్దిళ్ల శ్రీధర్ బాబు* అన్నారు.
బుధవారం మంథని లోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో* కలిసి మంత్రి నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు 200 కళ్యాణలక్ష్మి, 117 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా *మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా సుమారు రూ.8 లక్షల కోట్ల ఆర్థిక భారం ఉందని తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే, మరోవైపు ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు సుమారు 4.7 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. పేదలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ��� నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటివర��ు ఆర్టీసీకి సుమారు రూ.13 వేల కోట్లు చెల్లించిందని వివరించారు.
ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, 25 లక్షల మంది రైతులకు సుమారు రూ.21 వేల కోట్ల మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచడంతో పాటు, సన్నధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు.
ర��ష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకానికి సంబంధించి అధికారులు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ప్రతి కుటుంబం తమ నామినీ వివరాలను అధికారులకు తప్పనిసరిగా అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 ల��్షల బీమా ప్రయోజనం అందేలా ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను సక్రమంగా అందించి అధికారులకు సహకరించాలని ప్రజలను కోరారు.
అనంతరం *మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తో కలిసి అడవి సోమన్ పల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్త��్యాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి, అంటే జూన్ 2027 నుంచి తరగతులు ప్రారంభించేలా అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంలో ఎలాంటి జాప్యాన్ని, సాకులను సహించబోమని మంత్రి అధికారులకు తేల్చిచెప్పారు.
మంథని 2026 నవంబర్ 25:
-------------------------------------------
*మంథనిని సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దుతాం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
*దివంగత నేత శ్రీపాదరావు ప్రారంభించిన సంగీత, నృత్య విద్యా కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేస్తాం*
*సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో పునరుద్ధరించిన సంగీత పాఠశాల భవనం ప్రారంభం*
*విద్యతో పాటు సంగీతం, నృత్యం, కళల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలి*
*హైదరాబాద్ రవీంద్రభారతిలో మంథని చిన్నారుల కళా ప్రదర్శనలు గర్వకారణం*
*సంగీత పాఠశాల విద్యార్థులు అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*మంథనిలో పునరుద్ధరించిన సంగీత ప���ఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
---------------------------+---------------
మంథని ప్రాంతాన్ని విద్యా, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు నిలయంగా, సరస్వతీ నిలయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని *రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* అన్నారు.
ఈ సందర్భంగా *మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ* తన ���ండ్రి, దివంగత నేత స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారు ప్రారంభించిన సంగీత, నృత్య విద్యా కార్యక్రమాలు నేడు మరింత అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన హయాంలో ప్రారంభమైన సంగీత పాఠశాల గత ప్రభుత్వ పాలనలో సరైన నిర్వహణ, సంరక్షణ లేక నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
సంగీత పాఠశాలకు సొంత భవనం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని తెలిపారు. వినియోగంలో లేని మహిళా భవనాన్ని సంగీత పాఠశాలకు కేటాయించడంతో పాటు పునరుద్ధరణ పనుల కోసం సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.15 లక్షలు కేటాయించిన��్లు చెప్పారు. ప్రస్తుతం అవసరమైన అన్ని మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తయి సంగీత పాఠశాల సొంత భవనంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
చిన్నతనం నుంచే పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయడంలో సంగీతం, నృత్యం ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విద్యతో పాటు కళలు కూడా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. మంథని ప్రాంతానికి చెందిన చిన్నారులు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తమ కళా ప్రదర్శనలతో ప్రతిభను చాటుకోవడం ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని తెలిపారు.
మంథని ప్రాంతాన్ని విద్యా రంగంలో మరింత అభివృద్ధి చేసి సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దాలన్నది తమ ఆకాంక్ష అని మంత్రి అన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించి సమాజంలో అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నూతన పాఠశాలలు, ఇంజినీ��ింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో పాటు సంగీత పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
సంగీత పాఠశాలలో అందుబాటులోకి వచ్చిన సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ పాఠశాల నుంచి భవిష్యత్తులో గొప్ప సంగీత విద్వాంసులు, నృత్య కళాకారులు తయారుకావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కేవలం విద్యా విషయాల్లోనే క���కుండా ��ంగీతం, నృత్యం, ఇతర సాంస్కృతిక, సహ పాఠ్య కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
మంథని ప్రాంతం కళలు, సాహిత్యం, సంస్కృతికి నిలయంగా, సరస్వతీ నిలయంగా ప్రసిద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. సంగీతం, నృత్య రంగాల్లో పిల్లలు మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించాలని తెలిపారు. సరస్వతి, నటరాజుల ఆశీస్సులు చిన్నారులందరి��ై ఉండాలని, వారు కళారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* మంథనిలో సంగీత పాఠశాలకు సొంత భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వినియోగంలో లేని మహిళా భవనాన్ని సంగీత పాఠశాలకు కేటాయించినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో భవనానికి అవసరమైన అన్ని పునరుద్ధరణ, మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సంగీత పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులతో భవనం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, విద్యార్థులు భవనంలో ఉన్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని సంగీతం, నృత్యం తదితర కళారంగాల్లో రాణించాలని సూచించారు. పాఠశాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అవసరమైన చర్యల��� తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సంగీత పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు, పాల్గొన్నారు.
పెద్దపల్లి,2026, నవంబర్ 18:
--------------------------------------------
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*
*నవంబర్ 19 నుంచి పథకం అమలు... ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక క్యాంపులు*
*రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా పథకంలో నమోదు చేసుకునే అవకాశం*
*డేటా అందుబాటులో లేదనే కారణంతో ఏ ఒక్క అర్హుడినీ క్యాంపు నుంచి వెనక్కి పంపించరాదు*
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్యాంపుల నిర్వహణపై ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
----------------------------------------
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అ���లుకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ��ందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపుల నిర్వహణ పై ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) ద్వారా ���ాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కుటుంబంలో సంపాదించే సభ్యునికి జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
నవంబర్ 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు, క్షేత్రస్���ాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకం మార్గదర్శకాలు, అర్హతలు, నమోదు విధానం, అవసరమైన పత్రాలు, క్యాంపుల నిర్వహణపై సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో డిపిఓ శ్రీ మాల, ఈ.డి.యం. కవిత,ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్-18:
-------------------------------------------
*విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను పెద్దపల్లి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*నవంబర్ 20న TOMCOM ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో విదేశీ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ మేళా*
*జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, అమెరికా, జపాన్, దుబాయ్ సహా 12 దేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు*
*నర్సింగ్, వైద్య సే���లు, నిర్మాణ రంగం, డ్రైవింగ్, వెల్డింగ్, కేర్ వర్కర్స్ విభాగాల్లో ఉద్యోగాలు*
*అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో హాజరుకావాలి*
--------------------------------------
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు TOMCOM (Telangana Overseas Manpower Company) ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధి కార్యాలయం పెద్దపల్లి వారి సమన్వయంతో నవంబర్ 20న విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ ��ేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలోని IDOC భవనంలో గది నంబర్ 233లో ఈ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, మారిషస్, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్, మలేషియా, అమెరికా, ఫిజీ, జపాన్ తదితర 12 దేశాల్లో వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల��ు అర్హులైన అభ్యర్థుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
*విదేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, అర్హతలు*
జర్మనీలో రిజిస్టర్డ్ నర్సుల ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని కలెక్టర్ తెలిపారు. ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉద్యోగాలకు డీపీటీ, బీపీటీ లేదా ఎంపీటీ అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, మారిషస్ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం లేదా డిప్లొమా ఇన్ నర్సింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఖతార్‌లో హోమ్ కేర్ నర్సులు, నర్సింగ్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హతలు అవసరమని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్స్ ఉద్యోగాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం, డీఎంపీహెచ్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్ లే��ా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. అలాగే బైక్, ట్యాక్సీ డ్రైవర్ల ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
దుబాయ్‌లో స్టీల్ ఫిక్సర్, ఆర్సీసీ వర్కర్, టైల్ మేసన్, షట్టరింగ్ కార్పెంటర్, స్కాఫోల్డింగ్, బ్లాక్ ప్లాస్టర్ మేసన్, కన్స్ట్రక్షన్ హెల్పర్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన నైపుణ్���ం కలిగిన అభ్యర్థులు ��రఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అమెరికాలో రిజిస్టర్డ్ నర్స్ (RN) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హతతో పాటు యాక్టివ్ ఇండియన్ ఆర్ఎన్ లైసెన్స్, ఎన్‌సీఎల్‌ఈఎక్స్ పరీక్షలో ఉత్తీర్ణత లేదా నమోదు, ఐఈఎల్టీఎస్ 6.5 లేదా ఓఈటీ గ్రేడ్ బీ అర్హతలు కలిగి ఉండాలని వివరించారు.
యూఏఈ (దుబాయ్)లో అసిస్టెంట్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హత కలిగిన వారు అర్హులని కలెక���టర్ తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఎంఓహెచ్, డీహెచ్ఏ లేదా హెచ్ఏ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు డేటాఫ్లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అలాగే స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, స్టీల్ ఎరెక్టర్, స్ట్రక్చరల్ స్టీల్ పెయింటర్, ఎంఐజీ వెల్డర్, ఇండస్ట్రియల్ పెయింట్ కోటర్ పెయింటర్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా అర్హతలు అవసరమని తెలిపారు.
జపాన్‌లో కేర్ వర్కర్స్ ఉద్యోగాల��ు ఇంటర్మీడియట్, నర్సింగ్ డిప్లొమా, ఏఎన్ఎం లేదా జీఎన్ఎం అర్హత కలిగిన వారు, డ్రైవర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
యూఏఈలో జనరల్ హెల్పర్, షట్టరింగ్ కార్పెంటర్, స్టీల్ ఫిక్సర్, మేసన్ ఉద్యోగాలకు నిర్దిష్ట విద్యార్హత అవసరం లేదని (NA) పేర్కొన్నట్లు తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనే ఆసక్తి ఉండి, ఆయా ఉద్యోగాలకు నిర్దేశించిన అర్హతలు కలిగిన పెద్దపల్లి జిల్లా యువతీ యువకులు ఈ రిజిస్ట్రేషన్ మేళాలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఇతర సంబంధిత పత్రాలతో నవంబర్ 20న నిర్వహించే రిజిస్ట్రేషన్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలు, అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 080 3552 4946, 8985336947, 8121262441 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
పెద్దపల్లి, 2026 నవంబర్ 18:-
----------------------------------------
*హెచ్ఐవీ నియంత్రణలో జాతీయ స్థాయిలో తెలంగాణకు రెండో స్థానం – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*95-95-95 లక్ష్యాలను సాధించి సురక్షిత్ హోదా పొందిన 20 జిల్లాల్లో పెద్దపల్లి*
*జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ సమిష్టి కృషికి జాతీయ గుర్తింపు*
-------------------------------------------
హెచ్ఐవీ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో విశేష పురోగతి సాధించి దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమన�� *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా వెల్లడించిన తాజా జాతీయ స్కోర్‌కార్డు��ో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు.
డిసెంబర్ 2023లో జాతీయ స్థాయిలో 32వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం, గత ఆర్థిక సంవత్సరంలో 13వ స్థానానికి చేరుకుని, ప్రస్తుతం రెండో స్థానాన్ని సాధించడం రాష్ట్రంలో హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో సాధించిన పురోగతికి నిదర్శనమని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 20 జిల్లాలు హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించి నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను సాధించి సురక్షిత్ (Surakshit) హోదాను పొందాయని తెలిపారు. ఈ గుర్తింపు పొందిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా కూడా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.
హెచ్ఐవీ బాధితులను గుర్తించడం, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడం, నిరంతర చికిత్సను కొనసాగించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో సమర్థవంతంగా పనిచేయడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించడం సాధ్యమైందని తెలిపారు.
సురక్��ిత్ హోదా సాధించిన 20 జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించనుందని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా కూడా ఉండటం జిల్లా ప్రజలకు, యంత్రాంగానికి గర్వకారణమని తెలిపారు.
ఈ విజయాన్ని సాధించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, కార్యక్రమ భాగస్వాములు సమన్వయంతో కృషి చేశ���రని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
హెచ్ఐవీపై అవగాహన, సకాలంలో పరీక్షలు, నిరంతర చికిత్స ద్వారా ��రోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర,సంబంధిత అధికారులు,తదితరులు, పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 18:-
---------------------------------------
*సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని ఆపద సమయంలో ప్రాణాలు కాపాడాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*నవంబర్ 21న సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మెగా సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమం*
**వెయ్యి మందికి పైగా విద్యార్థుల��ో ప్రాణరక్షణ నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం***
--------------------------------------------
గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) విద్యార్థుల�� వాసు, సాహితి, అశ్విత్, హర్షవర్ధన్, సందీప్ తమ అధ్యాపకులు అరుణ, రాజు లతో కలిసి జిల్లా కలెక్టర్నుకలిసి, నవంబర్ 21న ఉదయం 10 గంటలకు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మెగా సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, వైద్య కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై విద్యార్థులకు అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రాణరక్షణ నైపుణ్యాలను నేర్పించడం, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
సీపీఆర్ వంటి ప్రాణరక్షణ నైపుణ్యాలపై విద్���ార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన సమయంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు, అత్యవసర సమయాల్లో ధైర్యంగా స్పందించే నైపుణ్యాన్ని అందిస్తాయని తెలిపారు.
జిల్లాలోని వివిధ విద్యాస��స్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న ప్రాణరక్షణ నైపుణ్యాలను కు��ుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా తెలియజేయాలని సూచించారు.
సీపీఆర్‌పై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించే సామర్థ్యం కలిగిన సమాజాన్ని నిర్మించవచ్చని, ప్రాణాలను కాపాడే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులు వాసు, సాహితి, అశ్విత్, హర్షవర్ధన్, సందీప్, అధ్యాపకులు అరుణ , రాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 18:
-------------------------------------------
*స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రా���ాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*టాస్క్ సెంటర్ ద్వారా శిక్షణ అందించి యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు*
*ఫాక్స్‌కాన్ సంస్థ ద్వారా ఇప్పటికే 300 మంది జిల్లా యువతకు ఉపాధి*
**మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి**
----------------------------------------
జిల్లాలోని స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి, జిల్లాలోనే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కంపెనీల ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సూచించారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై సంబంధిత కంపెనీల ప్రతినిధులతో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* టాస్క్ (TASK) సెంటర్ ద్వారా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు యువతకు అవసరమైన శిక్షణ అందించి, పెద్దపల్లి జిల్లాకు చెందిన దాదాపు 300 మంది యువతీ యువకులకు ఇప్పటికే ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. ఇదే తరహాలో ఇతర కంపెనీలు కూడా జిల్లాలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావాలని సూచించారు.
వైఎస్‌కే, బారా బారి, హెడ్ హెల్డ్ ప్రతినిధులు జిల్లాలోని యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో నియమించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
స్థానిక యువతకు జిల్లాలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం కంపెనీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు.
మహిళలకు కూడా ఉపా���ి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఇంటి నుంచే పని చేసుకునేందుకు అనువుగా ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలు, కార్యాచరణ, కార్యక్రమాలను రూపొందించాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. తద్వారా మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఆర్థికంగా స్వావలంబన సాధించే అవకాశాలు కల్పించాలని తెలిపారు.
జిల్లాలోని యువతకు నైపుణ్య శిక్షణ, స్థానిక ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా సంబంధిత కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాజశేఖర్,టాస్క్ రీజినల్ సెంటర్ ఇన్చార్జి కౌసల్య, ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధి కౌశిక్, వైఎస్‌కే కంపెనీ ��్రతినిధులు, బారా బారి, హెడ్ హెల్డ్ కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 16:-
--------------------------------------------
*బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*బాలల భద్రత, సంక్షేమం, హక్కులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి*
*బాల్య వివాహాలు, బాల కార్మిక వ్య���స్థ, బాలలపై హింస, వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*
*చిల్డ్రన్స్ డే వీక్‌లో భాగంగా సిగ్నేచర్ క్యాంపెయిన్, ఫోటో ఫన్ బూత్ ప్రారంభం*
----------------------------------------
బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, సంక్షేమం పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
సోమవారం చిల్డ్రన్స్ డే వీక్ వేడుకల్లో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రజావాణి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్,
ఫోటో ఫన్ బూత్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా * జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష * సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొని బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన సందేశంపై సంతకం చేశారు. అనంతరం ఫోటో ఫన్ బూత్‌ను ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలల హక్కులు, బాలల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్��� నివారణ, బాలలపై హింస, వేధింపుల నిరోధం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాలల రక్షణలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు.
బాలల భద్రత, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, బాలల హక్కులకు భంగం కలగకుండా వారి రక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
చిల్డ్రన్స్ డే వీక్ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల సంక్షేమం, రక్షణ, హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది, తదితరులు , పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్,16:
---------------------------------------------
*అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
**ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్*
--------------------------------------------
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధిక���రులను ఆదేశించారు.
సోమవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు*తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రామగుండం మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తాము గత 40 సంవత్సరాల క్రితం వీర్లపల్లి గ్రామం వద్ద వర్షం నీరు వెళ్ళుటకు రెండు పైపులతో నిర్మాణం చేశామని, పైపుల స్థానంలో బ్రిడ్జి నిర్మాణం చేసి సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం2 జనరల్ మేనేజర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన మూట. రాధ తాను వికలాంగురాలునని తన భర్త ఎలుగు. కుమార్ తనను, తమ పిల్లల బాగోగులు చూసుకోవడం లేదని దరఖాస్తు చేసుకోగా తాసిల్దార్ సుల్తానాబాద్ కి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
శ్రీరాంపూర్ మండల��� వెన్నంపల్లి గ్రామానికి చెందిన సామ. తిరుపతి తాను దివ్యాంగుడినని చేయూత పథకం కింద కొత్త పెన్షన్ మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకోగా గ్రామీణ అభివృద్ధి అధికారి కి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన దుబ్బాకుల. శారద తాను నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగురాలునని తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 16:
-----------------------------------------
*8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా విజయవంతం చేయాలి – రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి*
*ఖేలో ఇండియా కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలి.. ప్రజలు, విద్యార్థులు, యువ��ను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాలి*
*ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలి.. ఏర్పాట్లలో చిన్నపాటి లోటుపాట్లకు కూడా తావివ్వకూడదు*
*ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవాలు.. పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్ల ఏర్పాటు*
*డిసెంబర్ 11 నుంచి 22 వరకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ*
*ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి*
-----------------------------------------
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చేలా అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ, ప్రజలు, విద్యార్థులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చే��ి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని *రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి* జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ) ఎ.వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సోని బాలా��ేవి తదితరులతో కలిసి 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
*మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ,* ఖేలో ఇండియా కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రత�� ఒక్కరికీ ఈ కార్యక్రమం గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి, ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి కూడా హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షించాలని, చిన్నపాటి లోటుపాట్లకు కూడా అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు.
ఖేలో ఇండియా కార్యక్రమంపై ప్రతిరోజూ ప్రత్యేక కథనాలు, వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ��దేశించారు. ప్రతి క్రీడా వేదికను, సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని తెలిపారు.
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ,* రాబోయే నెల రోజుల కాలం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమని, ఒకవైపు భారీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహణకు సన్నద్ధమవుతుండగా, మరోవైపు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, పోటీలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఖేలో ఇండియా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేశామని, మరో 15 రోజుల్లో అదనంగా రూ.5 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల అవసరాలు, అంచనాల ఆధారంగా అదనపు నిధులు క��డా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.
*ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ మాట్లాడుతూ,* భారతదేశపు ప్రతిష్టాత్మక జాతీయ యువ క్రీడా సంబరమైన 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026కు తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు ఈ క్రీడ�� సంబరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ సంస్థల జట్ల ��ుంచి 6,000 మందికి పైగా యువ క్రీడాకారులు, 1,800 మంది సహాయక సిబ్బంది పాల్గొననున్నారని వివరించారు.
రామగుండం, 2026 నవంబర్ 16:
---------------------------------------------
*భూ రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలి – జిల్లా కలె���్టర్ కోయ శ్రీహర్ష*
*మల్కాపూర్ గ్రామంలో ఈ వారాంతంలోగా రీ-సర్వే పూర్తి చేయాలి*
*అల్లూరు గ్రామానికి కో-రిలేషన్ స్టేట్మెంట్ సిద్ధం చేయాలి.. మల్యాలపల్లి గ్రామంలో త్వరగా రీ-సర్వే ప్రారంభించాలి*
*నవంబర్ నెలాఖరులోగా జంగావ్ గ్రామంలో రీ-సర్వే పూర్తి చేయాలి*
*రామగుండం మండలం మల్కాపూర్ గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్*
---------------------------------------------
భ�� రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం మండలం మల్కాపూర్ గ్రామంలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సం���ర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* మల్కాపూర్ గ్రామంలో చేపడుతున్న భూముల రీ-సర్వే పనులను ఈ వారాంతంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సరిపోల్చుకుంటూ ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు.
అల్లూరు గ్రామానికి సంబంధించిన కో-రిలేషన్ స్టేట్మెంట్ను త్వరితగతిన సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మల్యాలపల్లి గ్రామంలో రీ-సర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
నవంబర్ నెలాఖరులోగా జంగావ్ గ్రామంలో కూడా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని రీ-సర్వే బృందాన్ని ఆదేశించారు. ప్రతి గ్రామానికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రీ-సర్వే సమయంలో భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. భూ యజమానులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో భూముల హద్దులను పరిశీలించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి, ఏవైనా వ్యత్యాసాలు లేదా అభ్య��తరాలు ఉంటే నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
సర్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని, రీ-సర్వే పనుల్లో నాణ్యత, ఖచ్చితత్వం పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో డిప్యూటీ తహసిల్దార్ రాజేశ్వర్,సంబంధిత అధికారులు, రీ-సర్వే సిబ్బంది,తదితరులు, పాల్గొన్నారు.
రామగుండం, 2026 నవంబర్ 16:-
------------------------------------------
*ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*అవసరమైన వైద్య పరికరాలను ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంచాలి*
*నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి*
*ఆసుపత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలి*
-------------------------------------------
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని, ఏ ఒక్క పరీక్షను కూడా బయటకు పంపించకుండా ��సుపత్రిలోనే నిర్వహించేలా అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు.
సోమవారం రామగుండంలోని సింగరే��ి వైద్య కళాశాలలో నిర్వహించిన వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ* తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన పరికరాల వివరాలు, అంచనా వ్యయంత�� కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అనంతరం ప్రభుత్వ జనరల��� ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి క్రిటికల్ కేర్ బ్లాక్ వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు సింగ్, సీఎస్ఆర్ డాక్టర్ కృపాభాయ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కిరణ్, టీజీఎంఐడీసీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి,2026, నవంబర్ 13:
-------------------------------------------
*రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు*
*వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి*
*ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందాలి*
*ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి*
*యంగ్ ఇండియా పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి*
*సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలి*
*వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్య, భూసేకరణ, VBGRAMG, వీధి కుక్కల నియంత్రణపై ��లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్*
-------------------------------------------
రాబోయే రబీ 2026-27 సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు సూచించారు.
ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని పరిస్థితుల నేపథ్యంలో వరి సాగును నివారించి ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, VBGRAMG పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ పలు అంశాలను సమీక్షించారు.
పెద్దపల్లి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీరాములు* సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఈ వీడియ��� కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
రబీ 2026-27 సీజన్లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు సూచించారు. రైతులను ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలని, సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ, ఖరీఫ్ పంటల ఉత్పాదకత పెంపు, రైతు ఐడీ న��ోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 13:
-------------------------------------------
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలి – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క*
*నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీమా పథకం అమలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ*
*గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు.. నవంబర్ 18న టాంటాం ద్వారా విస్తృత ప్రచారం*
*18–59 సంవత్స���ాల వయస్సు గల కుటుంబ సంపాదన సభ్యుల వివరాల సేకరణకు ప్రాధాన్యత*
*నామినీ వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్ల నమోదులో కచ్చితత్వం పాటించాలి*
*దరఖాస్తుల డిజిటలైజేషన్, బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలి*
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్య మంత్రి*
-------------------------------------------
��ెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర���థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. *పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ* తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ,* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే వినూత్���మైనదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మా��్లాడుతూ,* కుటుంబానికి సంబంధించిన జీవిత బీమా కవరేజీ కోసం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సంపాదన సభ్యుల వివరాలను కచ్చితంగా సేకరించాలని సూచించారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు ,పాల్గొన్నారు.
పెద్దపల్లి,2026, నవంబర్-12:
-------------------------------------------
*విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
*రంగంపల్లి మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్*
--------------------------------------------
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.
గురువారం పెద్దపల్లి పట్టణ పరిధిలోని రంగంపల్లిలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సాయంత్రం జిల్��ా *కలెక్టర్ కోయ శ్రీ హర్ష**ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల, కళాశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, డైనింగ్ హాల్ , వసతి గృహ పరిసరాలను పరిశీలించి,విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
*ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి విద్యాభ్యాసం, వసతి, భోజన నాణ్యత ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ రుచికరమైన, పరి���ుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్వాహ��ులకు ఆదేశించారు.
విద్యార్థులకు ఏవైనా మౌలిక వసతులు ఇతర అవసరాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ మణి దీప్తి,ఉపాధ్యాయులు, తదితరులు , పాల్గొన్నారు.
పెద్దపల్లి, 2026 నవంబర్ 12:
------------------------------------------
*యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*ఎస్సారెస్పీ నుంచి యాసంగి సాగుకు నీటి విడుదల సాధ్యం కాదు*
*ఒక ఎకరం వరి సాగు చేసే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయవచ్చు*
*యాసంగి పంట సాగుపై ��్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
--------------------------------------------
జిల్లాలో లోటు వర్షపాతం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తక్కువ నీటిమట్టం కారణంగా యాసంగి పంటకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని, రైతులందరూ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సూచించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ��ధికారులతో యాసంగి పంట సాగుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ* గత వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాకపోవడంతో నీటిమట్టం తక్కువగా ఉందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకు మా���్రమే సరిపోతుందని పేర్కొన్నారు.
యాసంగి పంట సాగుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
తక్కువ వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేస్తే నీటి కొరతతో పాటు విద్యుత్ సమస్యల�� ఎదురై పంట చివరి దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఒక ఎకరం వరి పంట సాగుకు అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న ��ంట సాగు చేయవచ్చని తెలిపారు. రైతులందరూ వరికి బదులుగా మొక్కజొన్నతో పాటు ఇతర ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు వేదికలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న పంటల అవకాశాలను రైతులకు వివరించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిని వివరించి సరైన పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వరి సాగు చేస్తే భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు విద్యుత్ సరఫరా సమస్యల కారణంగా పంట చేతికి వచ్చే దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ముందస్తుగా అప్రమత్తమై వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
���ిల్లాలో యాసంగి సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణంగా రూపొందించాలని, రైతులందరూ వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల సాగును చేపట్టేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి,2026, నవంబర్ 12:
--------------------------------------------
*ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*ఓరల్ రీడింగ్ ఫ్లూఎన్సీ కోసం నిర్వహిస్తున్న ‘రెమెడియేషన్’ తరగతులపై సంతృప్తి*
*తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, టి.ఎల్.ఎం.లను సమర్థవంతంగా వినియోగించాలి*
*నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు శిక్షణ ఇవ్వాలి*
*ప్రధానోపాధ్యాయులు తరగతులను నిరంతరం పర్యవేక్షించాలి*
*అకడమిక��� ప్యానెల్ బృందాలతో ఉన్నత పాఠశాలల ప్రగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్*
--------------------------------------------
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో ప్రత్యేక కృషి చేయాలని జిల్లా *కలెక్టర్ కోయ శ్రీహర్ష**ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అకడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందాలతో ఉన్నత పాఠశాలల విద్యా ప్రగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* విద్యార్థుల్లో ఓరల్ రీడింగ్ ఫ్లూఎన్సీ (మౌఖిక పఠన నైపుణ్యం) అభివృద్ధి కోసం పాఠశాలల్లో అమలు చేస్తున్న 'రెమెడియేషన్' కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక సంఖ్యా జ్ఞాన స్థాయిలలో మెరుగుదల సాధించేలా బోధన సాగాలని సూచించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు టి.ఎల్.ఎం. (బోధనా అభ్యసన సామగ్రి), డిజిటల్ బోర్డులు మరియు ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కలెక్టర్ సమీక్షిం��ారు. తరగతి గదులను ప్రింట్-రిచ్‌గా, ఆకర్షణీయమైన అభ్యాస మూలలతో (లెర్నింగ్ కార్నర్స్) తీర్చిదిద్దాలని, తద్వారా విద్యార్థులు చురుకుగా పాల్గొంటూ అభ్యాసంపై ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
అకడమిక్ ప్యానెల్ తనిఖీల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, క్రమశిక్షణ గణనీయంగా మెరుగుపడ్డాయని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థి కేంద్రీకృత అభ్యాసన విధానాలను అనుసరిస్తూ, ఆశించ���న అభ్యాస ఫలితాలు (లెర్నింగ్ ఔట్ కమ్స్) సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా చదువులో వెనుకబడిన, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులను గుర్తించి, వారి కోసం అదనపు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రెమెడియేషన్ కార్యక్రమంలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ��ుందుకు సాగాలని తెలిపారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తరగతులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, బోధనా విధానాలపై ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పాఠశాలల ప్రగతిని కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి అభినందించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి జి. శారద, ఏ.ఎం.ఓ. డా. పి. ఎం. షేక్ తో పాటు అకడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం లీడర్స్ సి.హెచ్. ఆగయ్య, ఆర్. సుదర్శనం, సబ్జెక్టు నిపుణులు, ప్యానెల్ సభ్యులు ఏ. జ్యోతి, కె. మంజుల, జి. జగదీశ్వర్, పి. హరిప్రసాద్, జె. శ్రీనివాస్, ఎస్. క్రిష్ణ మోహన్, ఎం. రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి,2026, నవంబర్ 12:
---------------------------------------
*ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్లాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*రాబోయే "100-రోజుల పఠన లేఖన కార్యక్రమం" విజయవంతం చేయాలి*
*PARAKH-2027 FLN, LIP మిడ్లైన్ అసెస్మెంట్లకు పకడ్బందీగా సన్నద్ధం కావాలి*
*AXL-AI, ఖాన్ అకాడమీ వంటి విద్యా కార్యక్రమాలను విద్యార్థులకు చేరువ చేయాలి*
*ఉన్నత ప్��ాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*
----------------------------------------
జిల్లాలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక వ్యూహాత్మక మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాలని *జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష*
అధికారులను ఆదేశించారు
.
గురువారం పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్ర��ానోపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* పాఠశాలల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రెమిడియేషన్ ప్రోగ్రామ్ (Remediation Program) అమలు తీరును సమీక్షించారు. రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా "100-రోజుల పఠన లేఖనకార్యక్రమం"100-Days Reading & Writing Campaign)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
విద్యార్థ��లలో ప్రాథమిక పఠన, లేఖన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.
రాబోయే PARAKH-2027 సన్నద్ధతపై మాట్లాడుతూ, జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే, FLN (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మరియు LIP మిడ్లైన్ అసెస్మెంట్ (Midline Assessment) పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సన్నద్ధం చేయాలని సూచించారు.
పాఠశాలల్లో విద్యార్థుల రోజువారీ హాజరును ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
విద్యారంగంలో సాంకేతికతను జోడించే భాగంగా AXL-AI ఖాన్ అకాడమీ (Khan Academy) వంటి ఆధునిక విద్యా కార్యక్రమాలను విద్యార్థులకు చేరువ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత అభ్యాసనం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణా నైపుణ్యాలు మెరుగవుతాయని తెలిపారు.
పాక్షిక , పూర్తి స్థాయిలో అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రధానోపాధ్యాయులు తరగతి గది బోధనను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పి.ఎం. షేక్, జిల్లా రిసోర్స్ పర్సన్స్, జిల్లాలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.