అమరావతి ఛాంపియన్షిప్–2026 ద్వారా యువ క్రీడాకారుల ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందించాలి
పుట్టపర్తి, జూలై 06: నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు 29) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'అమరావతి ఛాంపియన్షిప్–2026'
#sports#amaravathi#SriSathyasaiDistrict
సోమందేపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ.
కేంద్రంలో అందుతున్న సేవలు, రికార్డులు, మరియు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను పరిశీలించాము.
అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్న పాలు, గుడ్లు, సంపూర్ణ పోషణ కిట్ల నాణ్యతను పరిశీలించాము,
సోమందేపల్లి మండలం నల్లగోండ్రారాయనపల్లి గ్రామంలో బూత్ స్థాయి అధికారులు (BLOs) నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ
ఈ తనిఖీ సందర్భంగా కంప్యూటర్లలో డేటా ఎంట్రీ, దరఖాస్తుల స్కానింగ్, క్షేత్రస్థాయి పరిశీలన,
ఓటర్ల జాబితా గణన షెడ్యూల్ (SIR 2026)
ఇంటింటికీ గణన అధికారుల సందర్శనలు: జూన్ 15 – జూలై 14
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: జూలై 21
క్లెయిమ్లు & అభ్యంతరాల సమర్పణ: జూలై 21 – ఆగస్టు 20
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: సెప్టెంబర్ 22
ఓటర్ల జాబితా గణన షెడ్యూల్ (SIR 2026)
ఇంటింటికీ గణన అధికారుల సందర్శనలు: జూన్ 15 – జూలై 14
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: జూలై 21
క్లెయిమ్లు & అభ్యంతరాల సమర్పణ: జూలై 21 – ఆగస్టు 20
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: సెప్టెంబర్ 22
Voter Roll Enumeration Schedule (SIR 2026)
జూన్ 5 నుంచి 14 వరకు సన్నద్ధత, సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 15 నుంచి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOs) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వివరాలు సేకరిస్తారు.
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాం . ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా కొనసాగింది.
#swarnaandharaswachaandhara
ఒడిసి (zphs)స్కూల్ ని సందర్శించాం అదేవిధంగా భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో మమేకమై కలిసి భోజనం చేసి అందరూ సమానం అనే భావన కలిగించాం.
భోజనం నాణ్యతగా ఉందని పిల్లలకి విశ్వాసాన్ని కలిగించాం.
@naralokesh#apschools#zphs#SriSathyasaiDistrict#education_system
ధర్మవరంలో విజయవంతంగా నిర్వహించిన ‘ఒక నెల – ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో ప్రజల భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాం. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాం.
#OneMonthOneConstituency#LandReforms
బసంపల్లి గ్రామ రైతులతో కలిసి Pelletized PMDS విధానంపై డెమో నిర్వహించాం. ఆముదం, సజ్జలు, కందులు, అలసందలు సహా 25 రకాల విత్తనాలతో ముందస్తు వర్షాకాల విత్తన పద్ధతిని వివరించి, స్థిరమైన దిగుబడులపై రైతులకు భరోసా కల్పించాం. 🌱
#PMDS#Agriculture
నసనకోట మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పుస్తకాల పంపిణీ మరియు మొక్కల నాటడం జరిగింది
తరువాత పాఠశాలను చూసి బాలికలను విద్య గురించి మరియు వారి వసతుల గురించి తెలుసుకోవడం జరిగింది.
అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు సహాయం చేసేందుకు తలుపులు తెరిచి ఉంటుందని వారికి తెలియచెప్పాం
ధర్మవరం పట్టణంలోని వేరుశనగ విత్తనాల ప్రెస్సింగ్ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది.
దీని ద్వారా ప్రజలు రాబోయే సీజన్ కి నాణ్యమైన విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా
పొందగలరు
#srisathyasaidistrict#districtcollector#dharamavaram
ఒక నెల ఒక నియోజకవర్గం కార్యక్రమంలో భాగంగా
ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ నందు నాలుగు సార్లు సందర్శన కార్యక్రమం జరుగును ప్రజల నుంచి రెవెన్యూ మరియు ఇతర సమస్యలపై అర్జీలు స్వీకరించబడును ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను తీర్చుకోగలరు
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ సేవలు, మౌలిక వసతులు, చిన్నారుల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ గారు సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.