Rahul Gandhi: India Should Not Fear Jokers and Clowns Who Know Nothing of Our History or Philosophy
రాహుల్ గాంధీ: మన చరిత్ర, తత్వశాస్త్రం తెలియని జోకర్లు, క్లౌన్లను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయపడటం అర్థం చేసుకోవచ్చని, కానీ నేడు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
దేశం పిరికితనంతో వ్యవహరించకుండా ధైర్యంగా నిలబడాలని స్పష్టం చేశారు.
LoP Shri Rahul Gandhi said that while fear may be understandable when fighting the British Empire, there is no reason to be afraid of forces that know nothing about India’s history or philosophy.
He stressed that India must stand with courage.
#RahulGandhi #India
Telangana CM Revanth Reddy Holds Key Talks with Maharashtra CM Devendra Fadnavis on Tummidihatti Project
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భేటీ.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కీలక చర్చలు.
ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు.
Telangana CM Revanth Reddy Meets Maharashtra CM Devendra Fadnavis in Mumbai
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం.
#RevanthReddy#Telangana
బేగం ఎయిర్ పోర్టు నుంచి ముంబై బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు,నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు.
రేపు ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
#RevanthReddy #Telangana
రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాత్రి ముంబైలో బస చేయనున్న సీఎం.
రేపు ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ సమావేశంలో పాల్గొనున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు.
#RevanthReddy #Telangana
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశం
మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులపై చర్చ
రైల్వే బ్రిడ్జిలకు నిధుల మంజూరుకు సీఎం అంగీకారం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి సమీక్షించారు.
ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని నేతలు వివరించారు.
నేతల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.
ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
గాంధీ భవన్లో...
టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం
👉 టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్
* అడ్వకేట్ ప్రొఫెషన్ గౌరవం, కటినంతో కూడుకున్నది
* నేను అడ్వకేట్ కావలసింది మిస్ అయ్యింది
* అడ్వకేట్ వృత్తి నుంచి వచ్చినవారు రాజకీయాల్లో చాలా మంది రాణించారు
* రాజ్యాంగ బద్ద సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
* దేశంలో కొన్ని జడ్జిమెంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం
* ఎలక్షన్ కమిషన్ ను జేబు సంస్థగా వాడుకుంటున్నారు
* సీబీఐ, ఈడి ఇష్టానుసారం వాడుతున్నారు
* స్టైఫండ్స్ పెంచుకుందాం
* దేశంలో ఎక్కడ లేని విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం
* నవంబరు లో సీఎం రేవంత్ రెడ్డి తో అడ్వకేట్ సమస్యలపై చర్చించుకుందాం
* దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం
* 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం
* గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామా రామ్మోహన్, సర్వోత్తమ్ ని గెలిపించండి
• @RamMohanINC
• @sarvothamreddy
TPCC Legal Cell Executive Committee Meeting Held at Gandhi Bhavan
గాంధీ భవన్లో...
టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రాంమోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. సమావేశంలో లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
• @sachin_inc
• @MYaskhi
• @RamMohanINC
జై హింద్! జై తెలంగాణ
తల్లి సోనియమ్మకు స్వాగతం
A heartfelt welcome to Smt. @SoniaGandhi ji on X!
Your enduring commitment to India’s unity, democracy, and inclusive progress continues to inspire millions.
Jai Hind! Jai Telangana!
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you.
“Elect Them Today, They Will Serve for 35 Years”: Revanth Reddy Introduces Congress Graduates' MLC Candidates
ఈరోజు గెలిపిస్తే.. 35 ఏళ్లు సేవ చేస్తారు
🔹మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ : సామ రామ్మోహన్ రెడ్డి
🔹నల్గొండ - వరంగల్ - ఖమ్మం : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించింది.
వీరిద్దరూ విద్యాధికులు, యువకులు.. ఈరోజు వీరిని గెలిపిస్తే మరో 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు నిరంతరం సేవలందిస్తారు.
👉రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబం (దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి గారు) పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసింది.
👉 సామ రామ్మోహన్ రెడ్డి ప్రాక్టీసింగ్ లాయర్‌గా బాగా సంపాదించుకునే అవకాశం ఉన్నా, వాటన్నింటినీ పక్కనపెట్టి 24x7 కాంగ్రెస్ పార్టీకే అంకితమయ్యారు.
#RevanthReddy #Telangana
• @RamMohanINC
• @sarvothamreddy
Congress Meeting at Praja Bhavan to Discuss El Niño and MLC Elections
ప్రజా భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం..
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు
ఎల్ ని నో,ఎంఎల్సీ ఎలక్షన్ పైన దిశా నిర్దేశం.
#RevanthReddy #Telangana
ప్రతి పదేళ్లకు ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతూ వస్తున్నారు.
1950 తర్వాత ఎన్నోసార్లు సర్ ప్రక్రియ చేపట్టారు. ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు నమోదు చేయించడానికి ఉపయోగించారు.
ప్రధాని మోదీ కులం, మతం, ఈడీ, సీబీఐ ఇలా అనేక విధాలుగా బెదిరిస్తూ గెలుస్తూ వచ్చారు.
ఇప్పుడు మోదీపై విపరీతమైన వ్యతిరేకత ఉంది.
నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది.
జెన్ జీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారు.
వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన తప్పుడు ప్రచారంతో జెన్ జీ వీధుల్లోకి వచ్చింది.
ఎస్ఐఆర్ ద్వారా ఈసారి గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.
దేశంలో మోదీ రెండు రకాల పౌరులను తయారు చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ఆగర్భ శ్రీమంతులు, ఓటు హక్కు లేని నిరుపేదలు.
ప్రధాని మోదీ దేశాన్ని రాజరికం వైపు తీసుకెళ్తున్నారు.
ఓటు లేని వారికి విలువ ఉండదు. వారిని ఎవరూ పలకరించరు.
ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు.
మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉన్నాయి. రెండోసారి ప్రధాని అయినప్పుడు 91 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2024లో మూడోసారి ప్రధాని అయినప్పుడు 97 కోట్ల ఓట్లు ఉన్నాయి.
2029 ఎన్నికలకు ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు. ఓట్ల సంఖ్య 84 కోట్లకు పడిపోయింది.
2026 నాటికి దేశ జనాభా 140 కోట్లకు పెరిగింది.
దేశ జనాభా పెరిగితే ఓట్ల సంఖ్య కూడా పెరగాలి కదా!
మోదీ నాలుగోసారి ప్రధాని కావడానికి 20 కోట్ల ఓట్లను తగ్గించాలని చూస్తున్నారు.
ఏం చేశారని బీజేపీ నాయకులు తెలంగాణకు వస్తారు? తెలంగాణకు ఏం ఇచ్చారు?
ఎస్ఐఆర్ ప్రక్రియతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.
1927లో బ్రిటిష్ వాళ్లు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో సభ్యులందరూ బ్రిటిష్ వాళ్లే.
పంజాబ్‌లో లాలా లజపతి రాయ్ నేతృత్వంలో ‘సైమన్ గో బ్యాక్’ నినాదంతో ఉద్యమం చేశారు.
సైమన్ కమిషన్‌తో భారతదేశాన్ని ఏలాలని బ్రిటిష్ వాళ్లు చూశారు.
‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం దేశ స్వాతంత్ర్యానికి దారితీసింది.
రాహుల్ గాంధీ నేతృత్వంలో వందేళ్ల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది.
జ్ఞానేశ్ కమిషన్ ద్వారా మోదీ దేశాన్ని ఏలాలని చూస్తున్నారు.
‘జ్ఞానేశ్ గో బ్యాక్’ అనే నినాదంతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారు.
నవంబర్ 1న రాంలీలా మైదానంలో జరగబోయే ఉద్యమంలో మనందరం భాగస్వాములు కావాలి.
తెలంగాణ నుంచి 10 వేల నుంచి 15 వేల మంది ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం కోరింది.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే 15 వేల మంది ఉన్నారు.
నవంబర్ 1న రాంలీలా మైదానంలో తెలంగాణ తడాఖా చూపించాలి.
ఇటీవల సిరిసిల్లలో ఎలా తడాఖా చూపించామో, రాంలీలా మైదానంలో కూడా మనం చూపించాలి.
ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేసేలా రాంలీలా గర్జన ఉండాలి.
పేదల ఓటు హక్కును కాజేయడానికి మోదీ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం.
‘జ్ఞానేశ్ గో బ్యాక్’ ఉద్యమం 2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఉపయోగపడుతుంది.
#RevanthReddy #Telangana
I Thought 'Tonic' Was Cough Syrup! 😂
సంతోష్ రావు 'టానిక్' గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి!
టానిక్ అంటే దగ్గు మందు అనుకున్నా.. చూస్తే విదేశీ విస్కీ దందా!
సంతోష్ రావు కోసం దేశంలో ఎక్కడా లేని స్పెషల్ లైసెన్స్ ఇచ్చిన్రు!
#RevanthReddy#Telangana
ఆంధ్రా కాలేజీలు, హాస్పిటల్స్‌కు...
పాల సప్లై హరీష్ రావుదే...
చివరకు పాలు కూడా వదల్లేదయ్యా!
Loot of Natural Resources to Harish Rao Supplying Milk to Andhra Colleges & Hospitals.
#RevanthReddy#HarishRao#Telangana
Congress Meeting at Praja Bhavan to Discuss El Niño and MLC Elections
ప్రజా భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం..
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు
ఎల్ ని నో,ఎంఎల్సీ ఎలక్షన్ పైన దిశా నిర్దేశం.
#RevanthReddy #Telangana
Cabinet Sub-Committee Meeting on Drought and El Niño Preparedness Chaired by Deputy CM Bhatti Vikramarka Mallu
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారి అధ్యక్షతన రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశం.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చ.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ధనసరి సీతక్క గారు , తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Congress Seeks CPI Support in Graduate MLC Elections
పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇరు పార్టీల నేతల సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
• @RamMohanINC
• @sarvothamreddy
CM Revanth Reddy Reviews Irrigation Projects, Focuses on Thummidihatti, Dindi and Achampet
ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సమావేశం.
బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్య సభ సభ్యులు ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలక చర్చలు
తుమ్మిడిహెట్టిపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం ఆదేశాలు.
ఈనెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని ఇటీవలే మహారాష్ట్ర సీఎం సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంది.. మహారాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ముంపునకు గురవుతుందో వివరించిన అధికారులు.
అటవీ, గిరిజన వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా బ్యారేజీ ఎత్తు ఉండాలని సూచించిన సీఎం.
అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు వీలుగా అవసరమైన అన్ని నివేదికలు సిద్దంగా ఉంచాలని, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల వివరాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించిన సీఎం.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
అందుకు వీలుగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు అదనంగా తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు. దీంతో పాలమూరు నీటికి ఎలాంటి ఢోకా ఉండదని సీఎం సూచన.
అందుకు అవసరమైన పంప్ హౌజులు, పంపులు, సిస్టమ్ వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
#RevanthReddy #Telangana
Congress Seeks CPI Support in Graduate MLC Elections
పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇరు పార్టీల నేతల సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
• @RamMohanINC
• @sarvothamreddy
దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (SRPCC) సమన్వయ కమిటీ సమావేశానికి ముందు గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Receives the Guard of Honour at the SRPCC before Meeting of Senior Police Officers from Southern States
#RevanthReddy#Telangana