commentor & Legal advisor
Loophole" – Highlights of Case History..
వాదిస్తే వట్టలు పగిలిపోవాలి💥🔥
న్యాయం ఆలస్యమైతే పర్లేదు కానీ
లాయర్ ఫీజు ఆలస్యమైతేనే కష్టం
హాలీవుడ్..
బాలీవుడ్..
టాలీవుడ్..
ఏయే నటులు అందుబాటులో ఉంటారో.. వాళ్లతో ఎల్‌నినో మీద అవేర్నెస్ వీడియోలు చేయిస్తాం
నీళ్లతో పాటు విద్యుత్‌ను పొదుపుగా ఎలా వాడాలో.. నటులతో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తాం
- సీఎం రేవంత్ రెడ్డి
@revanthreddy_67 ముందు గా మైక్ సక్కగా పెట్టి మాట్లాడు..
తరువాత ఇగ ముచ్చట
నేను ఏమి పీకలేక పోతున్న
నా చేతిలో ఏమీలేదు.
రైతులకు నీళ్ళు ఇయ్యలేను
కరెంట్ ఇయ్యాలేను .
అని రెండు చేతులు ఎత్తినవ్
ముందు గా మైక్ సక్కగా పెట్టి మాట్లాడు..
తరువాత ఇగ ముచ్చట
నేను ఏమి పీకలేక పోతున్న
నా చేతిలో ఏమీలేదు.
రైతులకు నీళ్ళు ఇయ్యలేను
కరెంట్ ఇయ్యాలేను .
అని రెండు చేతులు ఎత్తినవ్
రైతు ఎప్పుడు రాజులాగే వ్యవహరించిండు.
ఎంత పేద రైతైనా సరే.. మనసు మాత్రం రాజులనే ఉంటుంది. వారే మన దేశాన్ని కరువు నుండి, ఆకలి నుండి కాపాడేవాళ్ళు.
: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పంచపాండవ చెరువుల వరకు డైరెక్ట్‌గా కాలువ వేసి, అక్కడి నుంచి పంప్సెట్లు పెట్టి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని వందలాది ఎకరాలకు నీళ్లు తరలిస్తున్నారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లేని ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ఒక్క చంద్రశేఖర్ రావు గారి ఫామ్ హౌస్‌కు ఎందుకు ఉండాలి?
@revanth_anumula
ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
తుది దశకు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు
ఈనెల 20వ తేదీ దసరా రోజు సాఫ్ట్ లాంచ్ ఓపి సేవలు ప్రారంభం
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగ జిల్లా పాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పనులను సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు, ఎంపీలు వేం. నరేందర్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కే.ఎల్. నాగరాజు గారు, KUDA చైర్ పర్సన్ గుండు సుధారాణి గారితో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు , జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది.
🏥ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఆసుపత్రి ప్రాంగణమంతా కలియతిరుగుతూ నిర్మాణ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించి, వైద్య విభాగాలు, రోగులకు అందించనున్న సదుపాయాలు, చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు అంశాలను సంబంధిత అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
🏥గత ప్రభుత్వం నిర్మించి తలపెట్టి అసంపూర్తిగా వదిలేసిన ఈ ఆసుపత్రిని ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించడం జరిగింది. నిరంతర పర్యవేక్షణ వలన పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. నిర్మాణ పనులు తుది దశకు చేరుకుని చిన్న చిన్న పనులు మినహా సేవలకు సిద్దంగా ఉన్నఈ ఆసుపత్రిని ఈ అక్టోబర్ 20 తేది అంటే దసరా రోజున సాఫ్ట్ లాంచ్ ద్వారా ఓపి సేవలను ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
🏥దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. మళ్లీ ఒకసారి ఈనెల 17వ తేదీన పనులను పరిశీలిస్తాం.
🏥గత ప్రభుత్వం కేవలం కాగితాల మీదనే ఆర్డర్ల ఇచ్చి వైద్యాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఎలాంటి బేషజాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ పోతుంది.
🏥ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సుమారు 5000 వరకు వచ్చే ఉండే అవకాశం ఉంది. వరంగల్ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలకు రాబోయే రోజుల్లో ఈ ఎంజీఎం ఆసుపత్రి ద్వారా అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని విశ్వాసిస్తున్నాను. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.
ప్రజల నమ్మకం మరింత బలపడే విధంగా అందుకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ వైద్యానికి ప్రజా పెద్దపీట వేస్తుంది.
#WarangalMultiSuperSpecialityHospital #WarangalHospital #HealthcareForAll #CorporateLevelHealthcare
@TelanganaCMO@revanth_anumula@INCTelangana
రైతులు, ఉపాధి హామీ కూలీలను అన్ని విధాలా ఆదుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఎల్ నినో ప్రభావం ఉన్నా, పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా నిరంతరం పనులు కల్పించేలా సీతక్క గారి ఆధ్వర్యంలో పక్కా కార్యాచరణ సిద్ధం చేశాం.
ఉంటే ఊరుకుంటారా...??
ఎందుకు బతుకున్నవో ఏమో..
నీ వాళ్ళ కాదు ఇంకో రెండు సంవత్సరాలు మా కర్మ అనుకొని భరించాలి నిన్ను లేదా సిగ్గు శరం ఎమైన ఉంటే రాజీనామా చేసి మల్లి ఎలక్షన్ కి పోదాం...
సాధారణంగా అక్టోబర్ నెలలో రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈసారి 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రోజుకు 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నా మా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ దీటుగా వరంగల్ నగరం కూడా మెడికల్ హబ్ కావాలి అని అన్ని సౌలతులు అందుబాటులో ఉండాలి అని సంకల్పం తో మొదలు పెట్టీ పూర్తి చేసిన గణత ముమ్మాటికి
కేసీఆర్ 💥💥 గారికి దక్కుతుంది..
వరంగల్ ప్రజలకు శీనన్న గుడ్ న్యూస్!
దసరా సందర్భంగా ఈ నెల 20న ఎంజీఎం హాస్పిటల్ ప్రారంభం!
పదేళ్ల పాటు మొండి గోడలకే పరిమితమైన ఎంజీఎం హాస్పిటల్‌ను, మూడేళ్లలో యుద్ధప్రాతిపదికన నిర్మాణాన్ని పూర్తి చేసిన కాంగ్రెస్!
నిరంతరం నిర్మాణ పనులను సమీక్షిస్తూ, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న వరంగల్ ఇన్చార్జి మంత్రి శీనన్న!
పైన ఉన్న మంత్రులు హే ఎవడికి ఎంత కావాలో నొక్కుతున్నారు..
ఇగ వీళ్ళు నొక్కడం లో తప్పు లేదు..
ఆయన మీకు జీతాలు బానే దెంగబెడుతున్నారు గా ప్రభుత్వం డిస్కం లు,, ఇంకా ఎందుకు రా ఇ చిల్లర బుద్ధి
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
✅వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు.
✅రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
✅ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
✅నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.
✅"ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు" అని ముఖ్యమంత్రి గారు తీవ్రంగా హెచ్చరించారు.
✅అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తానని మండిపడ్డారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు.
➡️ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు
✅ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పుడు సాధారణ సమస్యగా కనిపిస్తున్న పరిస్థితులు ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
✅"ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అప్రమత్తం కాకపోతే సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
✅ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేమని, మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాల్సిందేనన్నారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
➡️తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు రావద్దు
✅వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
✅గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు.
✅ఎల్‌నినో ప్రభావంతో పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
➡️ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు
✅ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు.
✅సంబంధిత మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి నివేదించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
➡️గ్రామసభలు, కళాజాతలతో ప్రజల్లో అవగాహన
✅ఎల్‌నినో ఒక విపత్తని, దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
✅కళాజాతల ద్వారా ప్రజలకు ఎల్‌నినో ప్రభావాన్ని వివరించాలని, నీరు, విద్యుత్ పొదుపుతో పాటు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.
✅గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు ఈ విపత్తు తీవ్రతను వివరించాలని ఆదేశించారు. మళ్లీ వర్షాలు వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
✅ఈ సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితో పాటు విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా, భూగర్భ జలాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#ElNino #FarmersWelfare #PowerSupply #WaterConservation #Agriculture #PublicWelfare #ClimateAction