ఏదో జరిగిపోతుంది అని ఆలోచించి బాధపడి ఆ దేవుడు నా గురించి రాసిన ఆ నాలుగు ఆనంద క్షణాలను కోల్పోవడం నాకు ఇష్టం లేదు,
ఇది నేను నా కథ, నా కథలో నువ్వు నా నవ్వుగా ఉండాలి అని నా కోరిక.!
నా మనసు నీ మనసుతో ఊసులాడుతుంటే
నా మదిలో ఏదో అలజడి రేగుతుంది.!
నా మదిలో భావాలు అలల్లా ఎగిసిపడుతుంటే
నీ తలపులే పూలజల్లులై నా ఎదను తడిమేస్తుంటే.!
అంతులేని ఆనందం నా సొంతమైంది,
ఆ ఆనందం హరివిల్లులా నా మనసున విరిసింది.!
#సహనం అనే పదానికి గొప్ప నిర్వచనం #గొంగళి_పురుగు,
నువ్వు నీ పని చేసుకుంటూ సహనంతో ఉంటే చాలు గొంగళి పురుగులా ఉన్న నువ్వు ఎదో ఒకరోజు #సీతాకోకచిలుకలా మారిపోతావు,
(ఏ మనుషులు అయితే నిన్ను పట్టుకోవడానికి అసహ్యించుకున్నారో వాళ్లే నీకోసం పరుగులు తీస్తారు)
పార్టనర్ ఈజీగా దొరికేస్తే వాళ్ళ Value తెలియదు
Marital life లో ఎక్కువ గొడవలు జరగటానికి అది కూడా ఒక కారణం, కలవటానికి పడిన కష్టం గుర్తుంటే ఎన్ని గొడవలు జరిగినా ఆ గొడవలు చిన్నవిగానే కనిపిస్తాయ్.!
సృష్టికి మూలం అమ్మ , అమ్మే మొదటి దైవం, అమ్మే మొదటి గురువు, అమ్మే మొదటి నేస్తం, అమ్మ లేనిదే ఏదీ లేదు నాకు నడక నేర్పిన తొలి గురువు
" అమ్మ " అమ్మకు ఇదే నా పాదాభివందనం
#HappyTeachersDay