అమరావతి - హైదరాబాద్ : రెండు నగరాలు - ద్వంద్వ ప్రమాణాలు!
హైదరాబాద్ మహానగర ప్రాంతం(HMDA) తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో విస్తరించి ఉంది.
* హైదరాబాద్ జిల్లా (కోర్ సిటీ): 13 మండలాలతో కూడిన ప్రధాన నగరాన్ని ఇది కలిగి ఉంటుంది.
* మెడ్చల్-మల్కాజ్గిరి జిల్లా: ఉత్తర పట్టణ ప్రాంతాలను కవర్ చేస్తుంది(బాలానగర్ నుంచి పేట్ బషీరాబాద్ దాకా).
* సంగారెడ్డి జిల్లా: వాయువ్య విస్తరణలను కలిగి ఉంటుంది(బి హెచ్ ఇ ఎల్, పటాన్చెరు నుంచి కంది దాకా).
* రంగారెడ్డి జిల్లా: పశ్చిమ, దక్షిణ శివారు ప్రాంతాలను కలిగి ఉంది. రంగారెడ్డి జిల్లా, కీలకమైన పశ్చిమ ఐటీ కారిడార్లు మరియు త��ర్పు నివాస శివారు ప్రాంతాలతో సహా, దాదాపు అన్ని వైపులా హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టి ఉంది. సేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, హయత్నగర్ , సరూర్నగర్, మణికొండ వంటి సైబరాబాద్ ప్రాంతాలు దీనిలోని ప్రధాన భాగాలు.
ఈ జిల్లాలన్నీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారి��ీ (HMDA) అధికార పరిధిలో ఉన్నాయి. (హైదరాబాద్ నగరం గురించి తెలిసిన వాళ్ళు ఈ లింక్ ని ఓపెన్ చేసి చూస్తే దాని విస్తృత్తి ఎంత అనూహ్యంగా వుందో తెలుస్తుంది:
https://t.co/4a6ijRMoWZ )
ఇదే తర్కాన్ని అమరావతికి వర్తింపజేసినప్పుడు విజయవాడ కేంద్రంగా వున్న ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్టణం కేంద్రంగా వున్న కృష్ణా జిల్లా, గుంటూరు కేంద్రంగావున్న గుంటూరు జిల్లా, నరసరావుపేట కేంద్రంగా వున్న పల్నాడు జిల్లాలకు చెంద���న వివిధ ప్రాంతాలు అమరావతి మెట్రోపోలీటన్ ఏరియా(AMA) కిందకు వస్తాయి కదా.
ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాలకు అనుసంధానమై ఉన్నాయి. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ పేరుతో 30వేల ఎకరాలలో నిర్మిస్తున్న నగరం వలెనే అమరావతి ఉంటుంది.
ఒకేఒక్క తేడా ఏమంటే అమరావతి కి రాజధానిగా ప్రత్యేకత ఉండటం. ఈ అమరావతి మెట్రోపోలిటన్ ఏరియా జనాభా ��ప్పటికే దాదాపు 50లక్షలు. ఇది దేశంలోని మహానగరాలలో 11వ లేక 12వ స్థానంలో ఉంటుంది.
ఇదిలా వుండగా అభివృద్ధి కేంద్రీకరణ జరగటం ఏమిటి?, అమరావతిలో నివసించటానికి ప్రజలు ఎక్కడినుంచి వస్తారు? వంటి ప్రశ్నలను, ఆంధ్రుల తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తూ, హైదరాబాద్ లో వుండి సంధించే మేధావులను చూస్తుంటే ఔరా అనిపించక మానదు!
Narasimha Rao గారి వాల్ నుంచి