19 yaşındaki gencecik biz kızı 72 yaşında bir adamla evlendirmek için ailesinin yaptığı baskıya bakın. Bence şu an onu en çok üzen şey ailesinin bu zulmüyle karşı karşıya kalması.
Please kind of help them because life is a very small in a earth so behind look at the video is a very child girl I ho everyone we can do that because she is in your life and and live both of see you don't have human culture so please doing that that is only request it's Mr DH
చట్టాల అమలులో జాగ్రత్తలు అవసరం...
జన్ విశ్వాస్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ గురుమూర్తి కీలక సూచనలు
జన్ విశ్వాస్ సవరణ బిల్లుపై బుధవారం పార్లమెంటులో జరిగిన చర్చలో వైయస్ఆర్ సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొని కీలక సూచనలు చేశారు. వివిధ చట్టాలలో ఉల్లంఘనలను చేర్చి వ్యవస్థను బలోపేతం చేయడం మంచి చర్యేనని పేర్కొంటూనే, చిన్న, పెద్ద ఉల్లంఘనల మధ్య స్పష్టమైన తేడా లేకపోతే అమలులో అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు శిక్షల స్థానంలో ఎక్కువగా నగదు జరిమానాల విధానం తీసుకురావడం వల్ల కొన్ని సందర్భాల్లో నిరోధక ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన కీలక ఉల్లంఘనల్లో కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. నియంత్రణ వ్యవస్థలు బలోపేతం కావడం, నేరాల నమోదులో పారదర్శకత పెరగడం సానుకూలమేనని చెప్పినా, అవి సమర్థవంతంగా పనిచేయాలంటే బలమైన డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు అవసరమని అన్నారు. విచారణ, తీర్పు, అమలు అధికారాలు ఒకే వ్యవస్థలో కేంద్రీకృతమైతే న్యాయసూత్రాలపై ప్రభావం పడే అవకాశం ఉందని గురుమూర్తి హెచ్చరించారు. సముద్ర, పోర్టు, షిప్పింగ్ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. అయితే తీవ్రమైన మోసాలకు సంబంధించి క్రిమినల్ శిక్షలు లేకపోతే బాధ్యత తగ్గే ప్రమాదం ఉందని సూచించారు. మెర్కెంటైల్ మెరైన్ విభాగానికి సమగ్ర డిజిటల్ ఈ-పోర్టల్ ఏర్పాటు చేసి అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మార్చాలని కోరారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 మరియు ఫార్మసీ చట్టం, 1948 సవరణలపై మాట్లాడుతూ, జైలు శిక్షల స్థానంలో జరిమానాలు విధించడం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అన్నారు. నకిలీ మందుల నియంత్రణలో కఠిన చర్యలు అవసరమని, కార్మిక చట్టాల్లో కూడా కేవలం జరిమానాలు సరిపోవని, కార్మికుల హక్కులను రక్షించేందుకు బలమైన అమలు వ్యవస్థలు అవసరమని సూచించారు. వివిధ రంగాల్లో సమన్వయం, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, రియల్ టైమ్ అమలు వ్యవస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గురుమూర్తి పేర్కొన్నారు. తమ పార్టీ తరపున బిల్లుకు మద్దతు తెలుపుతూ, సమర్థవంతమైన అమలు, పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థలతో ఈ సంస్కరణలు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.