On World Environment Day 2025, TGSRTC Hospital was awarded a Certificate of Appreciation for its commitment to bio-medical waste management and efforts to combat plastic pollution.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#TGSRTC#Telangana#Hyderabad #TakingTelanganaForward #TGSRTCHospital
విధి నిర్వహణలో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌లను ప్రయాణికులకు అందజేిసి.. మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ నెల 25న సూర్యాపేట-హైదరాబాద్ మార్గంలో వెళ్తోన్న బస్సులో ఒక ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను మరిచిపోయారు. బస్సు సూర్యాపేట బస్ స్టేషన్‌కు చేరుకోగానే ఆ బ్యా���్ను కండక్టర్ కె.అంజయ్య, డ్రైవర్ యాకుబ్ పాషా గుర్తించారు. అందులో రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే వారు బ్యాగ్‌ను సూర్యాపేట డిపోలో అప్పగించారు. ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఆ బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందజేశారు.
ఇంకొక ఘటనలో.. హైదరాబాద్ ఎయిర్ ప���ర్ట్ పుష్పక్ బస్సులో ఒక ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయారు. ఈ నెల 15న బస్సు ఎయిర్పోర్ట్ నుంచి లింగపల్లికి వస్తుండగా అల్విన్ క్రాస్ రోడ్ వద్ద ఆ బ్యాగ్‌ను డ్రైవర్ ముబిన్ గుర్తించారు. దానిని మియాపూర్-2 డిపో అధికారులకు హ్యాండోవర్ చేశారు.
మరోక ఎయిర్ పోర్ట్ బస్సులో శిల్పారామం వద్ద ఒక ప్రయాణికుడు బ్యాగ్‌ను మరిచిప��యారు. అందులో రూ.3.50 లక్షల నగదు, 2 బంగారు గాజులు, ఒక ల్యాప్ టాప్.. మొత్తం 5 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. దానిని డ్రైవర్ రమేశ్ గుర్తించి.. అధికారుల సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు. ఈ నెల 25న జరిగిందీ ఘటన.
మానవత్వం చాటుకున్న సూర్యాపేట, మియాపూర్-2 డిపోలకు చెందిన సిబ్బంది కె.అంజయ్య, డ్రైవర్లు యాకుబ్ పాషా, ముబీన్, రమేశ్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అభినందించారు. వ��రందరినీ హైదరాబాద్ బస్ భవన్‌కు పిలుపించుకుని ఉన్నతాధికారులతో కలిసి ఆయన సన్మానించారు.
మూడు వేర్వేరు ఘటనల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ. 19 లక్షల విలువైన బ్యాగ్ లను ప్రయాణికులకు అందజేయడం ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి నిదర్శమన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే.. సేవాభావం కలిగి ఉండటం గొప్పవిషయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, వెంకన్న, సీటీఎం (కమర్సియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, తదితరులు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC
Amid Indo-Pak tensions, the role of journalists becomes more critical than ever. In such volatile times, every report, every headline, and every image shared holds the power to either inform responsibly or inflame emotions recklessly. Journalists on the ground are not merely covering an event—they are navigating a battlefield of facts, fear, and propaganda. Their work demands immense courage, discernment, and a deep sense of duty.
What they report today will shape how the world sees this moment tomorrow. Inaccurate reporting can escalate tensions; responsible journalism can pave the way for understanding and peace. This is not just about breaking news—it’s about preserving truth in an age of misinformation. It’s about being the voice of reason when noise threatens to drown out facts.
To all the journalists risking their safety to bring clarity amid chaos: your integrity is a shield against falsehood. Your commitment to truth is service not just to your profession, but to humanity itself.
#TruthMatters #IndoPakTensions #ResponsibleJournalism
*ఆర్టీసీ ఆసుపత్రిలో డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులు*
*మూడు విభాగాల్లో 7 సీట్ల మంజూరు*
#Hyderabad తార్నాకలోని #TGSRTC ఆసుపత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్బి) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించింది. మూడు విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) మంజూరు చేసింది.
డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి కోరుతూ ఎన్బీఈఎంఎస్కు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రిలో పీజీ మెడికల్ కోర్సులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన ఎన్బీఈఎంఎస్.. జనరల్ మెడిసిన్ 3 సీట్లను, జనరల్ సర్జరీ 2 సీట్లను, ఆర్థోపెడిక్ సర్జరీ 2 సీట్లను మంజూరు చేసింది.
3 సంవత్సరాల పీజీ కోర్సులకు నీట్ ఆధారంగా, 2 సంవత్సవాల డిప్లొమా కోర్సులకు డీఎన్బీ-పీడీసీఈటీ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
తార్నాక ఆసుపత్రిలో డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించడం���ై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ డీఎన్బీ పీజీ కోర్సులకు అనుమతి లభించడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు మరింతగా బలోపేతమవుతాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కోర్సుల వల్ల నాణ్యమైన వైద్యులు ఆసుపత్రిలో ప్రాక్టిస్ చేస్తారని, ఇది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలను అందించి సంపూర్ణ ఆరోగ్య ఆర్టీసీగా మార్చేందుకు ��ాజమాన్యం కృతనిశ్చయంతో ఉందని వివరించారు.
డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ ఓఎస్డీ డాక్టర్ సైది రెడ్డి, డాక్టర్లు సుస్మిత, ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్ లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వ��రిని ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, తదితరులు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC
🚨 Double Delight at the Box Office!
🔥 New release: *#Subham* — a story that touches the soul
💥 Re-release: *#JVAS* — the cult classic is back!
🚌 Ride safe. Ride smart. Ride with TGSRTC to the theatres near you.
🎟️ Your movie journey starts at the bus stop.
#TGSRTCForCinemaLovers #subhammovie #JVASReRelease #comedyhorror #TeluguCinema #MovieTripWithTGSRTC
తానూ మరణిస్తూ.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టిన యువకుడు!!
పుట్టెడు శోకంలోనూ పెద్దమనసు చేసుకొని అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన బానోత్ రమణ కుటుంబ సభ్యులకు సెల్యూట్.🙏
@Jeevandants
#TGSRTC proudly observes #CourtesyDay on the 3rd Friday of every month.
To mark this occasion, we rolled out our very first branding initiative — a thoughtful giveaway to our valued customers.
We distributed TGSRTC keychains featuring a smart QR code, enabling passengers to stay connected with our apps and receive real-time updates through our social media platforms.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#Telangana #Hyderabad #TakingTelanganaForward
We value your feedback 💬
Booked your journey through https://t.co/FUZLbf0Ayd?
Let us know about your travel experience through the feedback form shared on WhatsApp.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC#Telangana#Hyderabad #TakingTelanganaForward
గమ్యం యాప్ తో చిటికెలో ఆర్టీసీ బస్సు సమాచారం!!
ఇప్పుడే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.. బస్సుల కదలికలను తెలుసుకొని మీ సమయాన్ని ఆదా చేసుకోండి.
@TGSRTCHQ @PROTGSRTC
#TGSRTC బస్సులో చదువులమ్మ ప్రయాణం!!
సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ బస్సుతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. బస్సుల్లో రాకపోకలు సాగించి విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నతస్థాయికి చేరుకున్నారు. బస్సుతో అనుబంధాన్ని పలు సందర్భాల్లో వారు పంచుకున్నారు.
సివిల్స్ ఆలిండియా 11వ ర్యాంక్ సాధించిన వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాని కూడా తన జీవన ప్రయాణంలో ఆర్టీసీ బస్సుతో తనకున్న బంధాన్ని తెలియజేశారు. సివిల్స్ ఫలితాల అనంతరం తండ్రి రాజ్ కుమార్ తో హైదరాబాద్ నుంచి వరంగల్ కి #TGSRTC బస్సులో ప్రయాణించి బస్సు ప్రాముఖ్యతను వివరించారు.
11వ ర్యాంక్ తో సివిల్స్ లో మెరిసిన సాయి శివానికి అభినందనలు తెలియజేస్తూ.. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఆకాంక్షిస్తున్నాను.
@TGSRTCHQ
@PROTGSRTC
Excitement is building for the T-Innovation Mahotsavam (TIM) 2025 finale on World Creativity & Innovation Day, April 21. This impactful collaboration between TGIC and the Panchayat Raj Department has successfully engaged all 33 districts of Telangana in meaningful discussions on practical innovation. Kudos to TGIC for their dedicated efforts in bringing this initiative to life. Such endeavours are crucial to driving progress and reflect Telangana’s strong commitment to fostering a vibrant innovation ecosystem.
@teamTGIC
*తార్నాక టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు*
*ఉద్యోగులకు అందు���ాటులోకి 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్*
*ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్*
తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాథ్ ల్యాబ్ తో పాటు 12 బెడ్లకు విస్తరించిన ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు.
ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ సహకారంతో తార్నాక ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ను సంస్జ ఏర్పాటు చేయగా.. క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్ కు అశోక్ లేలాండ్ సంస్థ సహకరించింది. అలాగే, ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు నిర్మాణ్ డాట్ ఓఆర్జీ అనే సంస్థ ద్వారా ఐఓసీఎల్ ఆర్థిక సాయం చేసింది.
ప్రారంభోత్సవంలో వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీకి ప్రధాన వనరులైన ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని యాజమాన్యం భావించి.. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్ఫిటల్‌గా తీరిదిద్దామని చెప్పారు. దేశంలో ఏ ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రుల��ు దీటుగా మెరుగైన వైద్య సేవలను ఉద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నే��థ్యంలోనే తార్నాక ఆస్పత్రిలో 2021లో ప్రతి రోజు సగటున 600 అవుట్ పేషంట్లు రాగా.. ప్రస్తుతం దాదాపు అది 2 వేలకు పెరిగిందని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని క్యాథ్ ల్యాబ్, క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్ తో పాటు ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు సహకరించిన ఐఓసీఎల్, ప్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్ సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా సజ్జనర్ అభినందించారు.
ఈ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి MRI, CT స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరఫి యూనిట్ అందుబాటులో ఉన్నాయన్నారు. తాజాగా క్యాథ్ ల్యాబ్ సేవలను ప్రారంభించడంతో ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉద్యోగులతో పాటు వారి జీవిత భాగస్వాములకు గ్రాండ్ హెల���త్ ఛాలెంజ్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. అందరి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 900 మందికి తార్నాక ఆసుపత్రిలో అత్యవసర చికిత్సను అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపారు.
సాంకేతికతను వినియోగించుకుని ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్ లోనూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ఎన్నో కార్యక్రమాలను యాజమాన్యం తీసుకువస్తుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరె��్టర్లు మునిశేఖర్, వెంకన్న, తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్ తో పాటు ఐఓసీఎల్ నుంచి సురజ్ కుమార్, భాస్కర్ రావు, కైలాస్ కాంత్, నిర్మాన్ ఆర్గనైజేషన్ నుంచి శాంతి కుమార్, అనురాధ, ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్, అశోక్ లేలాండ్ ప్రతినిధులు నీరేష్ తివారి, సూర్యనారాయణ, రమేశ్ శాస్త��రి, తదితరులు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC