Film Critics Association Congratulates #MegaStarChiranjeevi@KChiruTweets Garu For Being The Indian Film Personality Of The Year 2022 , This Award Is Presented For His Immense & Dedicated Services To Film Industry
"పెద్ది" చరణ్ ని ప్రశంసించిన
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్!!
"పెద్ది" చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, తనదైన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్"తో... ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించింది. ప్రీమియర్స్'తో పాటు తొలి నాలుగు రోజుల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించి... ఐదో రోజైన సోమవారం కూడా అసాధారణమైన కలెక్షన్లతో దూసుకుపోతూ "పెద్ది" సాధిస్తున్న సంచలన విజయం పట్ల తెలుగు ఫిలిం క్రిటిక్స్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్షన్స్ పరంగా ఫ్లయింగ్ కలర్స్ తో "మండే టెస్ట్" పాసవ్వడమే కాకుండా... పెర్ఫార్మన్స్ పరంగా "తండ్రికి తగ్గ తనయుడిగా" జేజేలందుదుకుంటున్న రామ్ చరణ్ పై వారు ప్రశంసల వర్షం కురిపించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, జనార్దన్ రెడ్డి, నాగేంద్ర కుమార్, కుమారస్వామి, కేశవ, అప్పాజీతోపాటు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు!! @AlwaysRamCharan #RamCharan @FCAOffice #Peddi #PeddiMovie @PeddiMovieOffl@santoshamsuresh
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్.
-------------------------------------------------------------------------------
టాలీవుడ్లో ఈ జనరేషన్లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం.
కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
లాఠీ సినిమాతో కెరియర్ ప్రారంభించి మొత్తానికి 30 ఏళ్ల పైబడిన కెరీర్లో మొత్తంగా 14 చిత్రాలు తెరకెక్కించాడు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్లో ఇన్ని జానర్స్‌లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్‌కు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది.
నేడు గుణశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు .. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్ ప్రసిడెంట్ జనార్థన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, చందు రమేష్, జిల్లా సురేష్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుణశేఖర్ 58 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ లోని సీనియర్ సభ్యులు తోటకూర రఘు, బాలిరెడ్డి, మోహన్ గోటేటి. ఉమా మహేశ్వరరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, మోహన్ గోటేటి తది తర సీనియర్ జర్నలిస్టుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
@Gunasekhar1 #HBDGunaSekhar @FCAOffice@santoshamsuresh
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
భరత్ భూషణ్ ను సత్కరించిన ఫిలిం అసోసియేషన్
ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) చైర్మన్ భరత్ భూషణ్ గారిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు..
ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.
ఈ సందర్భంగా APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్ గారిని FCA కార్యవర్గం బొకే తో, మరియు శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ "ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీ లో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము' అని తెలిపారు.
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సానుకూలంగా ఉన్నారని భరత్ భూషణ్ తెలిపారు.
భరత్ భూషణ్ గారి సత్కార కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్,
ఎఫ్ సి ఏ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, ప్రదాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఎండి అబ్దుల్, జాయింట్ సెక్రెటరీ శ్యామ్ కుమార్.. ఇతర కార్యవర్గ సభ్యులు
ఎం గిరిధర్, ఆర్ డి ఎస్ ప్రకాష్, కేశవ చారి, నవీన్ కుమార్, అప్పాజీ, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
@FCAOffice@santoshamsuresh
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు
మానవతా వాది కళా పోషకులు చదలవాడ శ్రీనివాసరావు గారిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ అఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావు గారిని కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావు గార్కి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేసెందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద భేదం లేకుండా అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు గారు ఈ సందర్భంగా తెలియచేసారు
ఈ కార్యక్రమంలోఫిల్మ్ క్రిటిక్స్ పాలక మండలి సభ్యులు బాల రెడ్ది, యం గిరిధర్, చదలవాడ భరద్వాజ, అప్పాజీ, శ్రీమతి పర్వీన్, బాబీ నవీన్ తదితరులు శ్రీనివాస్ రావు గార్కి అభినందనలు తెలియ చేసారు
@FCAOffice@santoshamsuresh
*Prominent producer and director Chadalavada Srinivasa Rao has once again come forward in support of film workers by promising to construct a permanent building for the Film Federation*
Earlier, Srinivasa Rao had helped save Chitrapuri Colony from a bank auction by extending loans worth crores of rupees, thereby protecting the dream homes of hundreds of cinema workers’ families. Now, he has announced another major initiative by assuring the construction of a dedicated building for the Film Federation. Federation members expressed happiness over his promise and praised his generosity and service-minded nature.
Leaders of the Film Employees Federation met Srinivasa Rao to congratulate him on being appointed as a Board Director in the AP Film Development Corporation. During the meeting, federation representatives informed him that they did not have a permanent office building. They also requested him to take initiatives to unite cinema workers from both Telugu states under one platform and create better employment opportunities for them.
Responding positively, Srinivasa Rao advised the federation to acquire land from the government and promised that he would personally build a state-of-the-art building with all facilities, unmatched by any other film federation in the country. He further instructed them not to seek donations from anyone for the project. He also stated that the building would be constructed in the name of legendary actor N. T. Rama Rao.
On this occasion, Srinivasa Rao suggested several measures for the welfare and revival of the film industry:
1. All films should follow a percentage-sharing system.
2. Heroes should allocate at least 50–60 days of dates to every producer.
3. Hero remuneration should be partly paid during production and the remaining amount after the film’s release through mutual understanding between producers and actors.
4. Traditional financial systems that support financiers should be revived, as the survival of financiers is crucial for the survival of cinema.
5. Directors and producers should jointly discuss ways to reduce production costs.
6. Production costs should be controlled to help sustain senior and standard producers.
7. The Federation should cooperate fully with producers and avoid creating difficulties for them.
8. If producers prosper, more films will be made, ensuring steady employment for film workers and happiness for their families.
9. Unnecessary expenses during shoots should be minimized, including reducing excessive caravan usage, to lessen the burden on producers.
He stated that implementing these measures could help revive the struggling film industry.
Federation President Vallabhaneni Anil said that all Telugu film workers would remain indebted to Srinivasa Rao for his continued support and contributions to cinema workers.
Federation General Secretary Rajendra Prasad remarked that the Telugu film industry is fortunate to have a kind-hearted person like Srinivasa Rao.
The event was attended by several prominent personalities, including Producers Council Secretary Prasanna Kumar, director K. Ajay Kumar, Directors Association President V. N. Aditya, director Ram Prasad, and many union representatives from various departments of the film industry.
@FCAOffice@santoshamsuresh
*కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని హామీ*
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణం ఇచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా కాపాడారు చదలవాడ శ్రీనివాసరావు. వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఫిలిం ఫెడరేషన్ కు సొంత భవనం నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల ఫెడరేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చదలవాడ దాతృత్వం, గొప్ప సేవా గుణాన్ని ప్రశంసించారు.
ఏపి ఫిలిం డెవలప్ కార్పొరేషన్ లో బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు తమకు శాశ్వత భవనం లేదనే విషయాన్ని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికులను ఒకే తాటి మీదికి తీసుకుని వచ్చి వారికి ఉపాధి కలిగే విధానాన్ని విధానాన్నిప్రవేశ పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ నాయకుల విజ్ఞప్తికి స్పందించిన చదలవాడ శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి స్థలం సేకరించుకోమని, ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో దేశంలో మరే సినీ ఫెడరేషన్ కు లేనంత మంచి భవనం నిర్మించి ఇస్తానని, ఈ భవనం కోసం ఎవరినీ రూపాయి విరాళం అడగవద్దని సూచించారు. మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ భవనం నిర్మించి ఇస్తానని చదలవాడ అన్నారు.
ఈ సందర్బంగా చదలవాడ శ్రీనివాసరావు సినిమా పరిశ్రమ బాగుండాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని సూచించారు
1. అన్ని సినిమాలు పర్సెంటేజ్ విధానంలో ఆడాలి
2. ప్రతి నిర్మాతకు హీరో డేట్లు తప్పని సరిగా యాభై నుండి అరవై రోజులు ఇవ్వాలి
3 హీరోకు పారితోషికం సినిమా నిర్మాణ సమయంలో కొంత ఇచ్చి సినిమా విడుదలైన తరువాత
మిగిలిన డబ్బులు చెల్లించే విధానాన్ని నిర్మాతల మండలి, నిర్మాతల సెక్టార్ పరస్పర అవగాహన కలిగి పాటించాలి.
4. మన పూర్వ పద్దతిలో ఫైనాన్షియర్ బ్రతికే విధి విధానాలు పాటించాలి. ఫైనాన్షియర్ బ్రతికితే సినిమా కూడా బ్రతుకుతుంది.
5. డైరెక్టర్స్ నిర్మాత, దర్శకుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గే
విధివిధానాలు పాటించాలి.
6. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గించుకుంటూ సీనియర్ స్టాండర్డ్ నిర్మాతలను నిలబెట్టుకోవాలి.
7. ఫెడరేషన్ నిర్మాతకు ఏ ఇబ్బంది కలగకుండా తగినంత సహకారాన్ని అందించాలి.
8. నిర్మాత బాగుంటేనే ఎక్కువ సినిమాలు తీయగలుగుతారు. తద్వారా సినిమా కార్మికులకు చేతినిండా పని దొరికి వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయి.
9.షూటింగ్ సమయంలో డబ్బలు వృథా చేయకుండా లో కార్వాన్ విధానాన్ని సాధ్యమైనంతగా తగ్గించి నిర్మాతకు భారం తగ్గించాలి.
ఈ విధివిధానాలు పాటిస్తే అంపశయ్య మీద ఉన్న తెగులు సినిమా పరిశ్రమకు ఊపిరి ఆడే అవకాశం ఉంటుందని చదలవాడ శ్రీనివాసరావు సూచించారు
ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ సినిమా కార్మికులకోసం ఎంతో గొప్ప సహాయ సహకారాలు ఇస్తున్న చదలవాడ శ్రీనివాసరావు గారికి తెలుగు కార్మికులంతా రుణపడి ఉంటారని అన్నారు.
ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చదలవాడ శ్రీనివాసరావు లాంటి మనసున్న గొప్ప వ్యక్తి తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, మాతృదేవోభవ దర్శకుడు కె. అజయ్ కుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు రామ్ ప్రసాద్, సముద్రలతో పాటు డిఓపి యూనియన్ నుండి భీముడు, ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ డి. వెంకటకృష్ణ , పి.ప్రసాద్ బాబు, లైట్ మ్యాన్ యూనియన్, కె. శ్రీనివాస్, ఈశ్వర రెడ్డి , జూనియర్ ఆర్టిస్టు యూనియన్ స్వామి గౌడ్ ,రవీందర్, రవి, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ లలిత, రైటర్స్ అసోసియేషన్ ఉమర్జీ కుమరన్ చిత్రపురి కాలనీ యూనియన్ జనరల్ సెక్రటరి ..పి.యస్.యన్. దొర, అలహరి, రమేష్ మరికొందరు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.
@santoshamsuresh@FCAOffice
తెలుగు సినీ యవనికపై 'దర్శకరత్న'గా వెలుగొందిన శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా, ఆయన స్మృత్యర్థం ఇదిగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అక్షరాంజలి:!!
దర్శకరత్న - దాసరి నారాయణరావు గారికి కలం కన్నీటి నివాళి!!
పాలకొల్లు మేధస్సు.. పద్మవ్యూహాలను ఛేదించిన సాహసం!!
ఎడారి ఎండమావి వంటి సినీ స్వప్నా లను నిజం చేసి సేదతీర్చిన ఓయాసీస్సు!!
వెండితెరపై సామాన్యుడి సంతకం..
మీరే తెలుగువారి ఆత్మగౌరవం!
'తాత-మనవడు'తో మొదలైన మీ ప్రస్థానంఅంచెలంచెలుగా ఎదిగి విశ్వ విఖ్యాత సినీ
'మేధావి'గా ప్రపంచ ఖ్యాతి
150 చిత్రాల మేటి కెప్టెన్..
గిన్నిస్ బుక్ గర్వించిన దర్శకరత్నవు మీరు
బొబ్బిలి పులి గర్జనలో సమాజపు ఆవేదన
ప్రేమాభిషేకపు విరహంలో గుండెలోతు వేదన
ప్రతి దృశ్యంలోనూ ఒక సామాజిక చైతన్యం
ప్రతి మాటలోనూ ఒక అద్భుత సమ్మోహనం!
మీరు లేని లోటు తీర్చలేనిది..
మీరు వేసిన బాట చెరిగిపోనిది..
అక్షరాల అమరజ్యోతివి.. కళామతల్లి కంటిపాపవి.
.జయహో దర్శకరత్న.. నీ కీర్తి అజరామరం!
విషాద వినమ్ర హృదయాలతో 🌹🌹🌹
అధ్యక్ష / కార్యదర్శులు
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ @FCAOffice@santoshamsuresh #DirectorsDay #DasariNarayanaRao Garu
*I’ll Play Any Character if the Content is Good!! – Dr. Rajasekhar*
The Film Critics Association recently honored "Angry Hero" Dr. Rajasekhar. Following the significant recognition of his role in his comeback movie Biker, the association’s Honorary President Prabhu, President J.V. Battula Prasad Rao, Secretary Suresh Kondeti, and others presented him with a bouquet. Subsequently, Critics Treasurer Bharadwaja read out and presented a citation of honor to the actor.
*Senior Journalist Prabhu (Honorary President):*
Rajasekhar’s acting needs no special introduction. His performances in films like Ankusham and Agraham were legendary. He has a great bond with the media. In his second innings, his spirit and enthusiasm should double. Receiving an honor from film critics is prestigious; even legendary Akkineni Nageswara Rao once said he valued a critics' honor very highly.
*Jeevitha Rajasekhar:*
We are all like one family. The media has always treated us well. Recently, I was confused by some social media news, but our bond with journalism remains strong. Regarding Biker, many thought Rajasekhar was 'asking' for roles, but the truth is he receives many offers; he just waits for characters that inspire him.
*Senior Journalist Mohan Goteti:*
Despite many hits, Rajasekhar remains humble and without ego. Whether it's an action role or a lover boy role like in Allari Priyudu, he delivers wonderfully. He is a man without guile, and Jeevitha manages everything for him beautifully.
*Senior Journalist Giridhar:*
I worked as his PRO for Allari Priyudu. He is a plain-hearted person. He even served as an honorary editor for my magazine 'Maa Family Doctor' and provided many books to help out.
*Suresh Kondeti (General Secretary, Film Critics Association)*
Firstly, a big thanks to Jeevitha garu. I am grateful to everyone who collaborated to make this event such a grand success.
*Q&A Session with Dr. Rajasekhar*
*How does it feel to make a comeback with Biker?*
The movie was released on April 3rd and the response to my character has been amazing. To me, this honor from the Critics Association is bigger than any other award. Just like after my accident before Ankusham, Biker has become a hit after my recent recovery. It feels great when audiences say they want to see me more on screen.
*What kind of roles will you choose in the future?*
I am doing a film with director Pawan Sadineni and another with I.V. Sasi’s son. I haven't fixed titles yet. I am open to playing a villain too. Being a hero is hard because you have to maintain glamour and expressions; a villain role is easier and depends purely on the subject. I’ll work with big or small heroes if the character is good.
*Would you play a father role to other heroes?*
I played Sharwanand’s father in Biker. If the character is good, I will play it for anyone, though fans usually expect action from me.
*Will you do a sequel to Allari Priyudu?*
If you are ready to watch it, I will definitely do it!
*Would you play a villain in a Chiranjeevi movie?*
Definitely! I have no issues with that. I am open to it.
*What is your current political stance?*
Politics is a big task and very expensive. Doing movies and politics together is difficult, so I’ve decided against it for now. I used to take Jeevitha along because she speaks very well.
*Thoughts on Actor Vijay’s political entry?*
It’s good. The response he’s getting is great—it reminds me of the response MGR used to get.
*Will your daughters have arranged marriages?*
Shivani and Shivathmika are currently focused on acting. They say they don't want to get married just yet.
@FCAOffice@santoshamsuresh@ActorRajasekhar #Biker #RajaSekhar
డా. రాజశేఖర్ ను అభినందించిన
"ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్"
త్వరలో "డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్" (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" ప్రముఖ కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ను ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసింది. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన "బైకర్" చిత్రం ఘన విజయం సాధిస్తుండడం పట్ల శుభాకాంక్షలు తెలిపింది.
సీనియర్ జర్నలిస్టులను పేరు పేరున పలకరించిన రాజశేఖర్..., తన కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచిన "వందేమాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, మగాడు" నాటి రోజులను ఎంతో ఇష్టంగా నెమరువేసుకున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న ఇంకా పేరు పెట్టని రెండు చిత్రాల విశేషాలను కూడా ఆయన ఆత్మీయంగా పంచుకున్నారు!!
రాజశేఖర్ దంపతులను కలిసినవారిలో "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, సీనియర్ సభ్యులు ఎ. బాల్ రెడ్డి, మోహన్ గోటేటి, కార్యవర్గ సభ్యులు మామిడిపల్లి గిరిధర్, ధీరజ అప్పాజీ, జిల్లా సురేష్ ఉన్నారు!!
@FCAOffice@santoshamsuresh@ActorRajasekhar #RajaSekar #Biker
"Film Critics Association"
Wishes ‘Icon Star’
Allu Arjun All the Best!!
On the occasion of Icon Star Allu Arjun’s birthday, members of the Film Critics Association met him and conveyed their best wishes. They also appreciated the first look of “Raka” during the meeting.
Among those who met the birthday star were Honorary President Prabhu, President Battula Prasad, General Secretary Suresh Kondeti, Treasurer Bharadwaj, Vice President Janardhan, along with Joint Secretary Shyam Rautla, executive members Dheeraj Appaji, Kumar, and others. On this occasion, the Icon Star mentioned that he would soon meet everyone at leisure!!
@alluarjun #AlluArjun #HBDAlluArjun #RAAKA @santoshamsuresh@FCAOffice
'ఐకాన్ స్టార్'కు
ఆల్ ది బెస్ట్ చెప్పిన
"ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్"
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" సభ్యులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్ డే బోయ్ ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందర్నీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ పేర్కొన్నారు!!
@alluarjun #AlluArjun #HBDAlluArjun @FCAOffice@santoshamsuresh #RAAKA #IconStarAlluArjun
*నటి హేమకు క్లీన్ చీట్*
▪️ డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను
▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో “మీట్ ది ప్రెస్”
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్లో సోమవారంనాడు జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నటి హేమ మాట్లాడుతూ.... డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా మానసికంగా కలచివేశాయని చెప్పారు. “ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. “నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం” అని ఆమె పేర్కొన్నారు. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు మాట్లాడుతూ... మీడియా విషయంలో నటి హేమ ఆవేదనతో ఉన్నారు. తన మనసులోని మాటను పంచుకునేందుకు ఈరోజు ఫిలిం చేసిన మీట్ ది ప్రెస్ కు ఆహ్వానించాము. ఆమె అభిప్రాయాలను మీడియా ముఖంగా పంచుకునే వేదిక ఇది. హేమ చెబుతున్నట్టు, ఆమెనే కాదు, మేము జర్నలిస్టులం కూడా వివక్ష ఎదుర్కొన్నాం." అని ఆయన అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమతో మీడియా ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాల వల్ల కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. హేమ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంది. కాబట్టి ఈ విషయాన్ని గతంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఎవరైతే ఆమెపై బురద చల్లారో. తిరిగి ఆమెకు కోర్టులో ఊరట లభించినప్పుడు మీడియావారు ఎవ్వరూ కూడా ఆమెపై సానుకూలంగా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను చెప్పుకునేందుకు వచ్చారు." అని అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ... నటి హేమ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అనేక పదవులు నిర్వహించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగితే వారికి ఎప్పుడూ కూడా ఆమె తన సపోర్టును ఇచ్చారు. ఎంతో ధైర్యంతో ప్రతీ విషయంలోనూ ముందుకు దూసుకుపోతారు. కొన్ని సందర్భాల్లో ఆమె ధైర్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. అంతటి ధైర్యం గల హేమగారు కూడా కొన్ని సందర్భాల్లో కుమిలిపోవలసి వచ్చింది. కొన్ని తప్పుడు వార్తల వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చి సంతోషంగా ఉన్నారు. అని అన్నారు. ఆ విషయాన్ని మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వేదికగా తన ఆనందాన్ని.. ఆవేదనను పంచుకోవడానికి వచ్చారని అన్నారు.
ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలువురు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా హేమ తనపై వచ్చిన వివాదాలపై వివరణ ఇవ్వడంతో పాటు, తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. #Hema @santoshamsuresh@FCAOffice
I Wanted to Die at That Moment: Actress Hema
I was deeply depressed mentally due to the drugs case!!
Meet the Press organized by the Film Critics Association @FCAOffice featuring prominent actress #Hema.