అధికారిక వివరణ
జూన్ 4, 2026 గురువారం మధ్యాహ్నం అమీర్‌పేట్, మైత్రీవనం సమీపంలోని "కెఎస్సార్ ఫ్యాషన్స్" (హెల్మెట్ బజార్) షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనం మెట్రో పిల్లర్ నంబర్ A1043 కి ఆతీ సమీపంలో ఉండటంతో, మంటల తీవ్రత వల్ల పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వార్తా ఛానళ్లలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.
అయితే, అమీర్‌పేట్‌లోని మెట్రో పిల్లర్ నంబర్ A1043 కి గానీ, ఇతర మెట్రో వ్యవస్థకు గానీ ఎటువంటి నిర్మాణపరమైన నష్టం వాటిల్లలేదని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా స్పష్టం చేశారు.
ఈ అగ్నిప్రమాదం వల్ల మెట్రో రైల్ మౌలిక సదుపాయా��కు ఎలాంటి నష్టం జరగలేదని, ఆస్తులన్నీ యథావిధిగా, సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు. మంటల సెగలకు పిల్లర్‌పై ఉన్న వినైల్ అడ్వర్టైజ్మెంట్ షీట్లు (Ad Boards) మాత్రమే కాలిపోయాయి తప్ప, లోపలి ప్రధాన కాంక్రీట్ పిల్లర్‌కు గానీ, ఇతర నిర్మాణ, నిర్వహణ భాగాలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. దట్టమైన పొగ కారణంగా ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ.. మెట్రో రైలు సేవలకు ఎక్కడా అంతరాయం కలగలేదు, రైళ్ల రాకపోకలు సాధారణంగానే కొనసాగాయి. అయినప్పటికీ, ఒక ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మెట్రో ఆస్తులపై అధికారులు లోతైన పరిశీలన చేపట్టారు.
మెట్రో మౌలిక సదుపాయాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస���తున్నాయని HMRL నిర్ధారించింది.
పౌరులు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలు మరియు ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరుతున్నాము.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━
Hyderabad Metro Rail Limited (HMRL) has clarified that the fire accident that occurred near Mythrivanam, Ameerpet, did not cause any damage to the Metro Rail system.
📄 Statement by Sarfaraz Ahmad
Managing Director, Hyderabad Metro Rail Limited (HMRL)
➤ There is no apparent damage to the Metro Rail infrastructure.
➤ The Metro Rail asset remains fully functional.
➤ An in-depth assessment of the affected assets has been undertaken as a precautionary measure.
➤ Metro Rail services were not disrupted at any stage and train operations continued normally.
➤ While dense smoke from the fire caused some inconvenience, there was no impact on Metro operations.
➤ The only visible effect of the fire was on the vinyl sheets of advertisement boards mounted on Metro pillars.
➤ No structural or operational components of the Metro Rail system were affected.
......................
HMRL has confirmed that the Metro infrastructure remains safe and fully operational.
Citizens are advised to rely only on official updates and verified information.
━━━━━━━━━━━━━
Hyderabad Metro Rail Limited (HMRL)
━━━━━━━━━━━━━
అధికారిక వివరణ
రైతులకు విద్యుత్ సరఫరా గురించి TGRPDCL సిఎండి (CMD) ముషారఫ్ అలీ ఫారూఖీ వ్యాఖ్యలకి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్, పూర్తి సమాచారం లేకుండా సోషల్ మీడియాలో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారమవుతోంది.
ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం రెండు విషయాల మీద వివరణ ఇస్తుంది :
1) సిఎండి చేసిన వ్యాఖ్యల సందర్భం గురించి
2) రైతులకు చేసే ఉచిత విధ���యుత్ సరఫరా గురించి
ముషారఫ్ అలీ ఫారూఖీ, IAS (CMD, TGRPDCL) ఇచ్చిన వివరణ:
➤ "రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు, వారు విద్యుత్ దొంగతనం చేస్తున్నారని అనడం అసాధ్యం, అది పూర్తిగా అబద్ధం."
➤ "రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారని నేను ఎక్కడా అనలేదు."
➤ "వ్యవసాయ కనెక్షన్ల పేరుతో విద్యుత్ వేరే అవసరాలకు మళ్లిస్తున్న అంశం గురించి మాత్రమే నేను మాట్లాడాను. రైతులు దొంగతనం చేస్తున్నారని కాదు."
➤ ఇక్కడ ప్ర���లు గమనించాల్సింది ఏమిటంటే, వీడియోలో కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నారు.
📌 రైతులకు ఉచిత విద్యుత్ పై స్పష్టత:
➤ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఉచిత విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగిస్తోంది.
➤ రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేస్తారంటూ జరుగుతున్న వార్తలు కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ముషారఫ్ అలీ ఫారూఖీ తేల్చి చె���్పారు.
➤ వ్యవసాయ రంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదు.
➤ ప్రభుత్వంపై తప్పుడు అభిప్రాయం కలిగించడానికి, సిఎండి వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని అ��ికారికంగా స్పష్టం చేశారు.
హెచ్చరిక:
సామాజిక మాధ్యమాలలో అసందర్భంగా వచ్చే వీడియో క్లిప్పులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. ప్రభుత్వ మాధ్యమాల ద్వారా వచ్చే పూర్తి సమాచారాన్ని మాత్రమే నమ్మాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము.
తెలంగాణ ప్రభుత్వం
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━
A video clip of remarks made by Musharraf Ali Faruqui, IAS, Chairman and Managing Director, TGRPDCL, is being circulated on social media without the full context.
The Government wishes to clarify two issues arising from the circulation of the edited clip:
➤ The context of the CMD's remarks regarding diversion of power.
➤ The Government's policy on free electricity for farmers.
📄 Clarification by Musharraf Ali Faruqui, IAS
Chairman and Managing Director, TGRPDCL
➤ "It is impossible and false to claim that farmers are stealing electricity when power is being supplied free of cost."
➤ "I did not say that farmers are stealing electricity."
➤ "My remarks referred to diversion of power in the name of agricultural connections and not to farmers engaging in theft."
➤ The circulated video presents only a portion of his remarks and misrepresents the context of his statement.
📌 Clarification on Free Power for Farmers
➤ The Government of Telangana continues to provide free electricity to eligible agricultural consumers.
➤ Musharraf Ali Faruqui, IAS, has categorically stated that suggestions regarding withdrawal of free power for farmers are false propaganda.
➤ No proposal is under consideration to discontinue free electricity being provided to the agricultural sector.
➤ The CMD, TGRPDCL, has clarified that his remarks have been deliberately misrepresented to create a false impression regarding the Government's policy on free power for farmers.
Citizens are advised to rely on complete speeches and official communications rather than edited video clips circulated on social media.
━━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━
నకిలీ జీవోల పై తెలంగాణ ప్రభుత్వ చర్యలు
గండిపేట లోని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ జరిగింది అంటూ స���మాజిక మాధ్యమాలలో కొన్ని ప్రభుత్వ జీవోలా ప్రచారమవుతున్నాయి. ఇవి నకిలీ జీవోలు అని ప్రభుత్వం నిర్ధారణ చేసింది.
ఈ నకిలీ జీవో, రంగారెడ్డి జిల్లా లోని గండిపేట మండలం, గండిపేట గ్రామంలోని, సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అంటూ రాసి ఉంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.
అధికారిక వివరాలు :
➤ ఈ నకిలీ జీవోలను సృష్టించి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవా��ని గండిపేట తహశీల్దార్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
➤ అధికారిక రికార్డులను పరిశీలించగా, వాట్సాప్‌లో లేదా ఇతర మాధ్యమాలలో షేర్ అవుతున్న ఆ జీవోలు ప్రభుత్వ రికార్డులలో లేవని నిర్ధారణ అయింది.
➤ ప్రైవేటు వ్యక్తుల కోసం సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించినట్లు ఆ నకిలీ జీవో లో తప్పుగా పేర్కొని ఉంది.
➤ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 18 భూమి ‘సర్క���రీ కంచె’ ‘పొరంబోకు కంచె’ గా నమోదై ఉంది. అంటే ఇది ప్రభుత్వ ఆస్తి ని అర్ధం.
➤ ఆ నకిలీ జీవోలో వాడిన ఫైల్ నంబర్లు, తహశీల్దార్ రాసిన ఉత్తరాలు, జిల్లా కలెక్టర్ నివేదికలు అని పేర్కొని ఉన్నవి ఏవీ కూడా ప్రభుత్వ రికార్డుల్లో లేవు.
➤ ఆ ప్రభుత్వ భూమికి వర్తించని నిబంధనలను కూడా ఆ నకిలీ జీవోలో సృష్టించి, అక్కడ పొందుపరిచారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
➤ ఈ నకిలీ పత్రాలను సృష్టించి ప్రచారం చేసిన వ్యక్తులపై పోలీస్ కంప్లైంట్ నమోదు చేయటం జరిగింది.
➤ నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.
➤ ఈ విషయాన్ని ���ైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తో పాటు ఇతర సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న ఈ జీవోలు పూర్తిగా అవాస్తవం అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
హెచ్చరిక
ప్రజలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న పాత్రలను నమ్మి మోసపోవద్దని, అధికారిక వివరాల కోసం, ప్రభుత్వ వెబ్సైట్లు లేదా ప్రభుత్వ మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ��మాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం
📢 Action Taken by Government
━━━━━━━━━━━━━━━
Posts circulating on social media regarding the alleged regularisation of Government land in Survey No. 18 of Gandipet Village, Gandipet Mandal, Ranga Reddy District are false.
Government authorities have confirmed that the G.Os being circulated are fake and fabricated.
📄 Position on record
➤ The Tahsildar, Gandipet Mandal, has formally lodged a complaint with the Narsingi Police Station seeking criminal action against those responsible for creating and circulating the fabricated G.Os.
➤ Verification of official records revealed that the G.Os being circulated through WhatsApp are fake and do not exist in Government records.
➤ The fabricated documents falsely claim regularisation of Government land in Survey No. 18 in favour of private individuals.
➤ Revenue records show that the land in Survey No. 18 is classified as Government land ("Sarkari Kancha" / "Poramboke Kancha") and is vested with the Government.
➤ The fake G.Os refer to file numbers, Tahsildar letters and District Collector reports that do not exist in official records.
➤ The fabricated documents also incorrectly invoke provisions that are not applicable to the said Government land.
📌 Government Action Taken
➤ A police complaint has been filed against the persons involved in creating and circulating the fake G.Os.
➤ Authorities have requested registration of a criminal case and appropriate legal action against those responsible.
➤ The matter has also been brought to the notice of the Cyberabad Police Commissionerate and other concerned revenue authorities.
The Government has clarified that the circulated G.Os are fake and fabricated.
Citizens are advised not to believe or share unverified documents and to rely only on official Government records and communications.
━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━
అధికారిక వివరణ
హైదరాబాద్ పరిధిలో పోలీసుల నియామకాలు జరుగుతున్నాయంటూ, సామాజిక మాధ్యమాలలో, ఒక ప్రకటన ప్రచారంలో ఉంది. ప్రజలు, ఇది నకిలీది అని గమనించాలి, ఇందులో ఎటువంటి వాస్తవము లేదు.
ఈ విషయం గురించి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా, స్పష్టత ఇస్తూ, ఈ ప్రకటన నకిలీది అని వివరించారు. పైగా, ఇటువంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయటాన్ని తీవ్రంగా కండించారు.
https://t.co/8urSwZ6Ist
అధికారిక వివరాలు :
➤ హైదరాబాద్ పోలీసుల కోసం అటువంటి నియామక ప్రకటన ఏదీ జారీ చేయలేదు
➤ నియామక నోటిఫికేషన్లు, కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే విడుదల చేయటం జరుగుతుంది
దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
➤ ప్రజలు, ఇటువంటి నకిలీ ప్రకటనలను నమ్మి డబ్బు చెల్లింపులు చెయ్యకూడదని, తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదని, అసలు తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని గుర్తుంచుకోవాలి.
➤ ఇటువంటి నియామకాలకు సంబందించిన సమాచారం ఎక్కడైనా కనిపించినా, మరలా వాటిని అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసిందా లేదా అనే విషయం సరి చూసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
➤ అనధికారంగా విడుదల అయి��� సమాచారాన్ని నమ్మవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు
➤ అనధికారిక వెబ్సైట్లు, లింక్‌లు ద్వారా చెల్లింపులు జరపరాదు
➤ అనుమానాస్పద ప్రకటనలు మీ దృష్టికి వస్తే, సంబంధిత అధికారులకు తెలియజేయండి
ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి.
హైదరాబాద్ పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━
A fraudulent advertisement claiming recruitment in Hyderabad Police is being circulated on social media.
V.C. Sajjanar, Commissioner of Police, Hyderabad, has strongly condemned the circulation of the fake recruitment notification through his official tweet and clarified that the information being circulated is false.
https://t.co/8urSwZ6Ist
📄 Position on record
➤ Hyderabad Police has not issued any such recruitment notification
➤ Official recruitment notifications are released only through authorised government channels
➤ Citizens are advised not to pay money, share personal details, or click on unknown links related to such fake advertisements
➤ Any recruitment-related information should be verified through official sources before applying
⚠️ Public Advisory
➤ Do not trust or forward unverified recruitment posts
➤ Be cautious of fraudulent websites, links, and payment requests
➤ Report suspicious content to the concerned authorities
Stay alert and do not fall prey to fake job scams.
━━━━━━━━━━━━━━━
Hyderabad Police
Government of Telangana
━━━━━━━━━━━━━━━
అధికారిక వివరణ
జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఇతర మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. ఈ వార్తలు ప్రజలను తీవ్రంగా తప్పుదారి పట్టిస్తున్నాయి.
అధికారిక రికార్డుల ప్రకారం వాస్తవాలు:
➤ జీహెచ్ఎంసీ గానీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గానీ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు.
➤ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ లిస్ట్ ఇంకా అస్సలు ఖరారు కాలేదు.
�� ప్రస్తుతం సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉన్న జాబితాలు, చార్టులు లేదా రిజర్వేషన్ వివరాలకు.. ప్రభుత్వ అధికారిక ప్రకటనలకు ఎలాంటి సంబంధం లేదు.
అధికారిక, నమ్మకమైన సమాచారం కోసం పౌరులు కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు సంబంధిత అధికారులు విడుదల చేసే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని కోరుతున్నాము.
-తెలంగాణ ప్రభుత్వం
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━━━━━━
The information being circulated regarding Ward seat reservations for GHMC/MMC/CMC elections is completely false and misleading to the public.
📄 Position on record
➤ Neither GHMC nor the Telangana State Election Commission has released any official notification regarding ward reservations
➤ No official reservation list for wards has been issued so far
➤ Any lists, charts, or reservation details currently being circulated on social media or other platforms are not based on any official communication
Citizens are advised to rely only on official notifications issued by the Telangana State Election Commission and concerned authorities for authentic information.
━━━━━━━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━━━━━━
అధికారిక వివరణ
వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్
వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, పహాడ్ల అశోక్ నగర్ గ్రామంలో, ప్రాచీన దేవాలయం కూల్చివేత జరిగిందంటూ మే 6 వ తేదీన వచ్చిన కొన్ని మీడియా కథనాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.
అధికారిక వివరాలు:
➤ ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోవడానికి, మే 6 వ తేదీన సంబంధిత అధికారులు అందరు కలిసి ఆ స్థలంలో పరిశీలన చేపట్టటం జరిగింది. ఇందులో భాగంగా:
* నర్సంపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్
* పురావస్తు శాఖ అధికారులు
* ఖానాపూర్ తహసీల్దార్
* TGEWIDC ప్రతినిధులు
* పనులు నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు, అందరు పాల్గొనటం జరిగింది.
పరిశీలనలో వెలువడిన వివరాలు :
➤ సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో దట్టమైన పొదలు, చెట్లు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు.
➤ ప్రతిపాదిత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనుల కోసం స్థలాన్ని శుభ్రం చేస్తుండగా, పాత శిథిలావస్థలో ఉన్న నిర్మాణ అవశేషాలు కనిపించాయి.
➤ ఆ నిర్మాణాన్ని కూల్చే చర్యలు గానీ, ధ్వంసం చేసే పనులు గానీ నిర్వహించే సంస్థ చేపట్టలేదు.
గమనించాల్సిన అధికారిక వివరాలు:
➤ రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఆ భూమి ప్రభుత్వానికి చెందింది, దేవాదాయ శాఖ భూమి కాదు.
➤ ఆ భూమిని, ఇప్పటికే, గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించారు.
➤ పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి, ఈ కట్టడం రక్షిత దేవాలయం కాదని పురావస్తు కట్టడంగా కూడా నమోదు కాలేదని తెలిపారు.
➤ ఆ నిర్మాణం చాలా కాలంగా శిథిలావస్థలోనే ఉందని, ప్రస్తుతం వినియోగంలో లేదని అధికారిక బృందం గుర్తించింది.
పునరుద్ధరణ చర్యలు:
➤ వరంగల్ జిల్లా కలెక్టర్‌తో పాటు నర్సంపేట ఎమ్మెల్యే కూడా ఆ స్థలాన్ని సందర్శించారు.
➤ చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించి అదే ప్రదేశంలో ఆ నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
➤ ఆ నిర్మాణానికి పురావస్తు శాఖ గుర్తింపు వచ్చేలా అవసరమైన చర్యలు కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
మీడియా సంస్థలు సమాచారాన్ని అధికారికంగా నిర్ధారించుకున్న తరువాతే ప్రచురించాలని, ప్రజలు కూడా అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసారు.
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━���━━━━━━━━━
Office of the District Collector, Warangal
Certain reports published on 06.05.2026 regarding the alleged demolition of an ancient temple at Pahadla Ashoknagar Village, Khanapur Mandal, Warangal district are FALSE and do not reflect the factual position.
📄 Position on record
➤ A joint inspection was conducted on 06.05.2026 by:
* Revenue Divisional Officer, Narsampet
* Archaeology Department officials
* Tahsildar, Khanapur
* Representatives of TGEWIDC
* Executing agency officials
➤ The subject land measuring Ac.30.00 guntas was found to be heavily covered with dense bushes and trees.
➤ During vegetation clearance and leveling works for the proposed Young India Integrated Residential School Complex, remnants of an old dilapidated structure were noticed.
➤ No demolition or dismantling activity was carried out by the executing agency.
📌 Verification of official records
➤ Revenue records confirm that the land is Government land and not Endowment land
➤ The land had already been allotted to the Tribal Welfare Department
➤ Archaeology Department officials confirmed that the structure is not notified or recorded as a protected monument or archaeological site
➤ The joint inspection team observed that the structure had remained in a dilapidated condition for a long period and was not in active use
📌 Restoration measures
➤ The District Collector, Warangal, along with the MLA of Narsampet Assembly Constituency, visited the site
➤ It has been assured that the structure/monument will be restored at the same location in consultation with historians, Stapathis, and the Archaeology Department
➤ Necessary efforts will also be initiated for notifying the structure with the Archaeology Department
Citizens and media organisations are advised to verify facts through official sources before circulating unverified claims.
అధికారిక వివరణ
నిమ్స్ (NIMS) ఆసుపత్రికి త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని, దీనివల్ల ఆసుపత్రి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని వస్తున్న వార్తలు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.
వీటిలో ఎటువంటి వాస్తవము లేదు.
ఈ విషయంలో స్పష్టత ఇస్తూ, జలమండలి లేదా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB), ప్రజలను భయబ్రాంతులకు గురికావద్దని, నిమ్స్ లో త్రాగునీటికి ఎటువంటి అంతరాయం కలగలేదని తెలియజేసిం���ి.
జలమండలి ద్వారా ఆసుపత్రికి జరిగే నీటి సరఫరా వివరాలు :
➤ బంజారాహిల్స్ GLSR నుండి ప్రత్యేకంగా ఏర్ప��టు చేసిన 300 mm ఫీడర్ లైన్ ద్వారా నీటిని ఆసుపత్రికి సరఫరా చేస్తున్నారు.
➤ ఆసుపత్రి ప్రాంగణంలో, రెండు 100 mm బల్క్ కనెక్షన్లు ద్వారా వేర్వేరు సంపులకు నీటి సరఫరా జరుగుతోంది.
➤ ఏడాది పొడవునా 24/7 ఎటువంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా జరుగుతోంది.
➤ నీటి సరఫరాను ప్రభావితం చేసేలా జలమండలి ఎటువంటి వాల్వ్ ఆపరేషన్లు చేపట్టలేదు.
➤ బంజారాహిల్స్ వద్ద రిజర్వాయర్‌లో నీటి మట్టాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఆసుపత్రిలో నీటి నిర్వహణ బాధ్యతలపై వివరణ:
➤ ఆసుపత్రి ప్రాంగణంలోని అంతర్గత నీటి వినియోగం, పంపిణీ, నిర్వహణ బాధ్యతలు నిమ్స్ అధికారుల పరిధిలోనే ఉంటాయి. వీటిలో జలమండలి జోక్యం ఉండదు.
నిమ్స్ ఆసుపత్రికి త్రాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని జలమండలి
ధృవీకరించింది.
ప్రజలు, ప్రభుత్వం అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని అధికారులు తెలియజేస్త��న్నారు.
తెలంగాణ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతకు నిదర్శనం
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు
నీళ్ల కొరత వల్ల రేపు ఆపరేషన్లు ఆపేయమని వైద్యులకు ఆదేశాలు జారీ చేసిన నిమ్స్ డైరెక్టర్
వార్డులు, రోగుల బాత్రూములు కూడా కడగకూడదని సిబ్బందికి ఆదేశాలు
అధికారిక వివరణ
తెలంగాణలో ధాన్యం కొన���గోలు పై వస్తున్న కొన్ని వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.
ఈ విషయం పై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇస్తూ, ��ాన్యం కొనుగోలు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.
అధికారిక వివరాలు:
➤ తెలంగాణ అంతటా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు (PPCs) పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.
➤ ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్లో ఇప్పటికే 14.80 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ధాన్యం కొనుగోలు పూర్తయింది.
➤ ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించడం జరిగింది.
➤ రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 2,001.96 కోట్ల చెల్లింపులు జరిగాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన:
➤ అకాల వర్షాల నుండి రైతుల ఉత్పత్తులను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలియజేసారు.
➤ ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కొనసాగుతుంది అని, ఈ
భరోసా ప్రతి గ్రామానికి చేరాలి అని కోరారు.
ప్రస్తుత చర్యలు:
➤ అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ ఆటంక�� లేకుండా జరుగుతోంది.
➤ రైతుల ఉత్పత్తులను కాపాడటానికి తీసుకున్న అదనపు చర్యలు :
తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం.
కొనుగోలు కేంద్రాల వద్ద టార్��ాలిన్ల ఏర్పాటు చేయడం.
16 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులో ఉంచడం.
18.5 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచడం.
ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే కొనుగోలు ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము అని పౌరసరఫరాల శాఖ హామీ ఇచ్చింది.
ప్రజలు, ప్రభుత్వం అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రం మొత్తం 9500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే కేవలం 6 వేలు మాత్రమే తెరిచారు
సంగారెడ్డి జిల్లాలో మాత్రం వరి కొనుగులు కేంద్రం ఒక్కటి కూడా పెట్టలేదు
వరి కొనుగులు చే��కపోవడానికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం
ఆ సంస్థకు బ్యాంకులో లోన్ కూడా ఇవ్వరు.. అందుకే ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి లేదు - కేటీఆర్
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━━━━━━
Reports circulating regarding disruption of drinking water supply to NIMS Hospital and alleged impact on hospital operations are incorrect.
The Hyderabad Metropolitan Water Supply & Sewerage Board (HMWSSB) has clarified that *drinking water supply to NIMS Hospital is functioning normally without any disruption*.
📄 Position on record
➤ Water is being supplied through a *dedicated 300 mm feeder line from Banjara Hills GLSR*
➤ Within the hospital premises, *two 100 mm bulk connections* are connected to separate sumps, ensuring continuous supply
➤ *24/7 uninterrupted water supply* is being maintained throughout the year
➤ No valve operations are being carried out by HMWSSB affecting supply
➤ Reservoir levels at Banjara Hills are *adequate*
---
📌 Clarification on internal management
➤ Internal water usage, distribution, and operational management within the hospital premises are handled by *NIMS authorities*
---
HMWSSB has confirmed that there is *no interruption in drinking water supply* to NIMS Hospital.
Citizens are advised to rely only on verified official information.
━━━━━━━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━━━━━━
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతకు నిదర్శనం
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు
నీళ్ల కొరత వల్ల రేపు ఆపరేషన్లు ఆపేయమని వైద్యులకు ఆదేశాలు జారీ చేసిన నిమ్స్ డైరెక్టర్
వార్డులు, రోగుల బాత్రూములు కూడా కడగకూడదని సిబ్బందికి ఆదేశాలు
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━━━━━━
Certain reports and public statements regarding paddy procurement centres and procurement operations in Telangana are inaccurate and do not reflect the actual situation on the ground.
Minister for Irrigation and Civil Supplies, N. Uttam Kumar Reddy, has clarified that procurement operations are actively underway across the state.
📄 Position on record
➤ All 8,575 Paddy Procurement Centres (PPCs) are currently operational across Telangana
➤ The State has already procured over 14.80 lakh metric tonnes (LMT) of paddy in the ongoing Rabi Marketing Season
➤ Paddy has been purchased from 1.84 lakh farmers so far
➤ Payments amounting to ₹2,001.96 crore have been directly credited to farmers’ accounts
📌 Statement — N. Uttam Kumar Reddy, Minister for Irrigation and Civil Supplies
➤ “The protection of farmers’ produce from unseasonal downpours is our top priority.”
➤ “The government will continue procurement as scheduled without any let-up, and this assurance must reach every village.”
📌 Ongoing Measures
➤ Procurement is being carried out continuously despite unseasonal rains and weather disruptions
➤ Additional measures have been initiated to protect farmers’ produce, including:
• Immediate shifting of wet paddy to mills
• Deployment of tarpaulins at procurement centres
• Creation of buffer storage capacity of 16 lakh MT
• Mobilisation of 18.5 crore gunny bags
---
The Government has reiterated that procurement operations are being conducted as scheduled without interruption, and necessary steps are being taken to safeguard farmers’ interests.
Citizens are advised to rely only on verified official information.
━━━━━━━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━━━━━━
రాష్ట్రం మొత్తం 9500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే కేవలం 6 వేలు మాత్రమే తెరిచారు
సంగారెడ్డి జిల్లాలో మాత్రం వరి కొనుగులు కేంద్రం ఒక్కటి కూడా పెట్టలేదు
వరి కొనుగులు చే��కపోవడానికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం
ఆ సంస్థకు బ్యాంకులో లోన్ కూడా ఇవ్వరు.. అందుకే ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి లేదు - కేటీఆర్
అధికారిక వివరణ
ఆరోగ్య శాఖలో మందుల కొనుగోలు, ఎక్స్పైరీ స్టాక్ అలాగే ఆర్థికపరమైన అవకతవకలు జరిగా��ంటూ ఏప్రిల్ 28, 2026 నాటి 'నమస్తే తెలంగాణ' పత్రికలో ప్రచురితమైన కథనం, దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు పూర్తిగా అవాస్తవం. అవి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా, నిబంధనల ప్రకారమే మందుల కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని 'తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ' (TGMSIDC) దీనికి సంబంధించిన స్పష్టమైన వివరణ ఇచ��చింది.
ఇందులోని వాస్తవాలు:
➤ మందులు, సర్జికల్ సామాగ్రి భారీగా వృథా అయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మొత్తం కొనుగోలుతో పోల్చి చూడకుండా, కేవలం కొన్ని అంకెలను మాత్రమే చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
➤ 2018-19 నుండి 2022-23 మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అవసరాల కోసం పెద్ద మొత్తంలో మందులు, సర్జికల్ వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం కొనుగోలు విలువతో పోలిస్తే, గడువు ముగిసిన (Expired) మందుల శాతం చాలా తక్కువ.
➤ 2021, 2022 సంవత్సరాల్లో తయారైన కొన్ని మందుల గడువు ఎక్కువగా ముగియడానికి కారణం ��ోవిడ్-19 మహమ్మారి. ఆ సమయంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, నిరంతర సరఫరా కోసం పెద్ద ఎత్తున మందులు సేకరించాల్సి వచ్చింది. కోవిడ్ తర్వాత మందుల వినియోగంలో మార్పులు రావడం వల్ల కొన్ని నిల్వలు అలాగే మిగిలిపోయాయి.
➤ దొంగ ఇండెంట్లు (Fake Indents) పెట్టారన్న ఆరోపణలు కేవలం కల్పితం. ప్రభుత్వ ఆసుపత్రులు, ANMలు, CHCలు, PHCల నుండి వచ్చిన వార్షిక డిమాండ్ మేరకు మాత్రమే మందుల కొనుగోలు అత్యంత పారదర్శకమైన పద్ధతిలో జరుగుతుంది.
➤ రిటుక్సిమాబ్ ఇంజెక్షన్ 500 mg, టికాగ్రెలోర్ 90 mg టాబ్లెట్లు మరియు ఇన్సులిన్ వంటి మందులను ఆయా ఆసుపత్రుల ప్రత్యేక అవసరాల మేరకే కొనుగోలు చేస్తారు.
నిఘా మరియు దాని రికవరీ విధానం:
➤ 'ఇ-ఔషధి' (e-Aushadhi): ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ప్రతి బ్యాచ్ ఎక్స్పైరీ తేదీని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.
➤ గడువు ముగిసేలోపే సరఫరాదారులకు తగిన నోటీసులు ఇచ్చి, ఆ మందుల స్థానంలో కొత్తవి తీసుకునేలా చర్యలు చేపడతాము. ఒకవేళ వారు స్పందించకపోతే, ఆ నష్టాన్ని వారి పెండింగ్ బిల్లుల నుండి రికవరీ చేస్తాము.
➤ గడువు ముగిసిన మందులను పర్యావరణ నిబంధనల ప్రకారం అధికారిక సంస్థల ద్వారా నిర్వీర్యం చేస్తారు. దీనికి అయ్యే ఖర్చును కూడా సదరు కంపెనీల నుండే వసూలు చేస్తారు తప్ప, ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదు.
తెలంగాణవ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి మరియు పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియను కొనసాగించడానికి TGMSIDC కట్టుబడి ��ంది. పౌరులు ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాము.
-తెలంగాణ ప్రభుత్వం
📢 OFFICIAL CLARIFICATION
━━━━━━━━━━━━━━━━━━━━
A news report published in Namasthe Telangana newspaper dated 28 April 2026, along with related social media posts regarding medicine procurement, expired stock, and alleged financial irregularities in the Health Department, presents a false and misleading picture of the actual facts.
The Telangana State Medical Services & Infrastructure Development Corporation (TGMSIDC) has issued a detailed rejoinder clarifying that procurement is carried out through established procedures based on approved institutional requirements across the state.
📄 Position on record
➤ The allegation of large-scale wastage of medicines, reagents, and surgical items is not factual. The figures being circulated have been presented without reference to the overall scale of procurement.
➤ Total procurement of drugs, reagents, and surgical items during the period from 2018-19 to 2022-23 was substantial and catered to the requirements of government healthcare institutions across Telangana. Expired stock constitutes only a marginal proportion when compared to total procurement value.
➤ A relatively higher incidence of expiry was observed in items manufactured during 2021 and 2022, corresponding to the COVID-19 pandemic period, when emergency procurements were undertaken to ensure uninterrupted supply. Variations in demand during and after the pandemic contributed to such expiries.
➤ The allegation of fake indents is baseless. As per annual demands, all indents are raised by concerned health institutions including government hospitals, ANMs, CHCs, PHCs and UPHCs, and procurement is carried out strictly in accordance with approved annual demands and procedures.
➤ Medicines such as Rituximab Injection 500 mg, Ticagrelor 90 mg tablets, and Insulins are procured only against specific institutional requirements and annual demand.
📌 Monitoring & Recovery Mechanism
➤ A robust monitoring mechanism is in place through the e-Aushadhi system, under which Central Medical Stores continuously track batch-wise expiry of all items.
➤ Suppliers are notified in advance regarding near-expiry stock and are required to replace such stock within stipulated timelines. In cases of non-compliance, the cost is recovered from pending supplier bills.
➤ Disposal of expired medicines is carried out through authorised agencies in accordance with environmental and regulatory norms. The reported disposal cost is met from recoveries effected from suppliers and does not create any additional financial burden on the Government.
---
TGMSIDC has reiterated its commitment to ensuring quality healthcare supply systems and transparent procurement processes across Telangana.
Citizens are advised to rely only on verified official information.
━━━━━━━━━━━━━━━━━━━━
Government of Telangana
━━━━━━━━━━━━━━━━━━━━