తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారు నిర్వహించిన శ్రీ వివేకానంద స్వామి జయంతి ఉత్సవాల కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఉపాధ్యాయులు,కస్తూరిబా ఉపాధ్యాయులు వారి వారి సమస్యలపై మెమొరాండం ఇవ్వడం జరిగింది.
మోదీ హయాంలో రూపుదిద్దుకున్న స్వచ్ఛ భారత్ మహాయజ్ఞం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిని రగిలించింది. పరిశుభ్రమైన భారత దేశాన్ని నిర్మించడంలో ప్రజలను ముందుకు తీసుకెళ్లారు.
ఈ రోజు ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ తరుణ్ చుగ్ గారితో కలిసి యాదద్రి లక్ష్మి నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది
నిన్న ఖమ్మంలో అశేష జనవాహిని మధ్య సాగిన స్వాగత ర్యాలీలో తరుణ్ చుగ్,సంజయ్ గార్లతో పాల్గొన్నాను..వేలాదిగా ప్రజలు బీజేపీకి మద్దతుగా తరలివచ్చారు..ఖమ్మంలో బీజేపీ వైపుగా ప్రజల మార్పుకి ఇది నాంది..ఖమ్మం జిల్లా నాయకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి విజయవంతం చేశారు..అందరికి అభినందనలు..
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా. ఖమ్మం లో ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ సమావేశం నిర్వహించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకొని పని చేయాలని కోరడం జరిగింది
పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం జిల్లా లో బూత్ ల సమ్మేళనం లో పాల్గొని రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరడం జరిగింది
ఈ రోజు ఖమ్మంలో డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు..
అనేక విషయాలపై చర్చించాము. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మద్దతునిచ్చి నన్ను గెలిపించాలని వారిని కోరాను.