A voice that echoed for the voiceless. His powerful voice, fearless spirit & songs for justice continue to inspire us even today. His memories and legacy will always remain in our hearts..
Heartfelt tributes to #Gaddar garu 🙏
సొంత తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి ఏం తెలుసు పరాయి తల్లి పడే ఇబ్బంది.
పిఠాపురం నాది అనే వంగ గీతకు ఈమె కనిపించలేదా
వృద్ధాప్యంలో అందరికీ కావాల్సింది డబ్బు కాదు… “మేమున్నాం” అనే భరోసా.
పిఠాపురంలోని 85 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, ఆమెకు సామాజిక పెన్షన్ మంజూరయ్యే వరకు అండగా నిలవాలని సూచించారు.
ఆ సూచనతో ముందుకు వచ్చిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారు, సామాజిక పెన్షన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా ₹2,000 వ్యక్తిగతంగా అందించేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం.
మంచం, ఫ్యాన్, లైట్లు, పండ్లు, వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందించి ఆ అవ్వకు భరోసా కల్పించారు.
పదవి గొప్పది కాదు… మనసు గొప్పది.
ఇలాంటి మానవత్వమే సమాజానికి నిజమైన స్ఫూర్తి
A classic example of Leadership vs Dictatorship!
How a true leader like @PawanKalyan can put the same public funds to meaningful use that were once spent on mere snacks during dictatorship..
#PawanKalyanAneNenu#EndofYCP
"నీట్ సమస్యల గురించి విన్నవించడానికి అసలైన నీట్ విద్యార్థులమైన మేము వెళ్ళి.. బొద్దింకల నేతలు అభిజీత్ దీప్కే మరియు సౌరవ్ దాస్‌లను కలవడానికి అనుమతించమని అభ్యర్థించినప్పుడు.. వారు మమ్మల్ని తరిమి తరిమి కొట్టారు..
వారు మెహబూబా ముఫ్తీ మరియు డింపుల్ యాదవ్‌లతో మాట్లాడటంలో నిమగ్నమై ఉన్నారు. మెహబూబా ముఫ్తీ మరియు డింపుల్ యాదవ్ నీట్ విద్యార్థులా? అది వారి సమస్యా లేక మాదా?
అది నీట్ విద్యార్థుల కోసం జరిగిన నిరసన కాదు.. కేవలం రాజకీయ లబ్ది పొందడానికి.. హిందూయిజాన్ని గేలి చేయడానికి, హిందూ దైవాలను దుర్భాషలాడడానికి, షెర్జిల్ ఇమామ్ & ఉమర్ ఖలీద్ వంటి గ్రవాదులను కీర్తించడానికి, ఆజాదీ నినాదాలు చేయడానికి, ప్రభుత్వాన్ని & ప్రధాని మోదీజీని పచ్చిబూతులు తిట్టడానికి.. జరిగిన నిరసన. లేకపోతే.. మంత్రి రాజీనామా చేస్తే, ఫైవ్ స్టార్ హోటళ్ కెళ్ళి విందు వినోదాలు ఎందుకు చేసుకుంటారు.. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాంటీ పేపర్ లీకేజ్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేదు..
అసలైన నీట్ విద్యార్థి హర్ష్ దూబే..
#JantarMantar
కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
•రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
•రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
•పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
•బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు
•తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
•వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
•8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
•పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
•పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలుపుకొంటూ.. పల్లె నుంచి పట్టణం వరకు రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటి పొడుగు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. స్థానిక శాసన సభ్యుని హోదాలో- ప్రజలు అడిగిన ప్రతి రోడ్డునీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు. పలు రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తే.. మరికొన్ని రోడ్లు అన్నదాత సౌలభ్యం కోసం, ఇంకొన్ని రోడ్లు మత్స్యకారులకి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉంటూ మత్స్యకారులు వేటాడిన సరుకు రవాణా చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి, అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మించారు.
•13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంటు రోడ్లు
అలల కోతకు సముద్ర గర్భంలో కలసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించారు. ఇళ్లు అయితే కట్టించి ఇచ్చారుగానీ, మౌలిక వసతుల కల్పన మరిచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ. 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నేడు కాలనీ మొత్తం కొత్త రోడ్లతో వెలుగులీనుతోంది. ఈ కాలనీకి సమీపంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేట. 330 మంది నివసించే ఈ కాలనీకి రూ. 93 లక్షలు వెచ్చించి 1.6 కి.మీ. సిమెంటు రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.
•తుపాను వచ్చి రోడ్డును తుడిచిపెడితే..
యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడిన ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది.
అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ, రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం, ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డు ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకునే వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది.
•గుంతలు పోయి.. అభివృద్ధి అక్కున చేరి..
సార్వత్రిక ఎన్నికలకి ముందు, తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన వినతుల్లో అత్యధికంగా రోడ్ల కోసమే వచ్చాయి.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా "జల్ జీవన్ " పనులు మరింత వేగవంతం
"జల్ జీవన్ " మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు.
#AmarajeeviJaladhara
శభాష్ జార్ఖండ్! మీ ఉద్యమం యావత్ భారతం చూసింది!
ఇది నిరసన కాదు... ఒక తరం నిశ్శబ్ద గర్జన!
విదేశీ నిధులు లేవు.
'ఆజాదీ' నినాదాలు లేవు.
హిందువులను, దేశాన్ని అవమానించే మాటలు లేవు.
జాతి వ్యతిరేక నినాదాలు అసలే లేవు.
ఉన్నది ఒక్కటే డిమాండ్:..న్యాయమైన పరీక్షలు, పారదర్శకత.
JPSC, JSSC CGL పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్ విద్యార్థులు చేతిలో మొబైల్ వెలుగులు, కాగడాలతో వీధుల్లోకి వచ్చారు.
వాళ్లు రోడ్లను బ్లాక్ చేయలేదు. దేశాన్ని తిట్టలేదు.
వాళ్లు తమ హక్కు కోసం, తమ భవిష్యత్తు కోసం గొంతెత్తారు.
ఇదే నిజమైన ప్రజాస్వామ్యం.
ఇదే ఆరోగ్యకరమైన నిరసన.
ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నించే విధానం ముఖ్యం.
జార్ఖండ్ విద్యార్థులు దేశానికి ఒక ఉదాహరణ చూపారు..
అరాచక బొద్దింకల బృడానికి ఒక పాఠం చెప్పారు.
#JharkhandProtests
బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని బోరుగడ్డ కి స్క్రిప్ట్ ఇచ్చారు.
బోరుగడ్డ ఆఫీస్ మీద దాడి జరిగితే..
సింపతి కోసం ఏకంగా Sakshi tv లో
"వైసీపీ నేత బూరుగడ్డ అనిల్ ఇంటి మీద దాడి" అని మరో స్క్రిప్ట్ చదివించారు.
ఎప్పుడైతే బోరుగడ్డ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందో..
"వాడితో మా పార్టీకి సంబంధం లేదు " అని వెంకట్ రెడ్డి లాంటి వాళ్లకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు
( ఈ విషయం స్వయంగా బోరుగడ్డ ఫోన్ కాల్ లో వెంకట్ రెడ్డే చెప్పాడు )
మీ నాయకుడు స్ట్రిప్ట్ లేనిదే బయటికి రాడు..
మీరేమో స్క్రిప్టులు ఇచ్చి తిట్టిస్తారు
స్క్రిప్టులను నమ్ముకుని రాజకీయం చేసే మీ తెలివిని మింగ! రాజకీయం అంటే సినిమా అనుకున్నారట్రా స్క్రిప్టుల మీద నడవడానికి.
ఇదంతా చూస్తే ఈసారి 11 కూడా కష్టమే. 🤗
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి
• తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత
• లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు
• రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో
• కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
• నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా
• ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
*పనుల పురోగతి వివరాలు*
ఈ సమీక్షలో పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించగా, 182 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో రూ.1,400 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రెండు పథకాల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో గత ఏడాది డిసెంబర్లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టాం. రెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల నిర్మాణంలో కీలకమైన ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో పని చేయాలి.
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో నిరంతర పర్యవేక్షణ
కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యి నత్తనడకన నడుస్తున్న పనులపై దృష్టి సారించాలి. ముఖ్యంగా పైపు లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్ లో ఉంటే ఆ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్ అండ్ బి, జాతీయ రహదారి అథారిటీ, పంచాయతీరాజ్ శాఖలు, అవసరం ఉన్న చోట అటవీశాఖలతో సమన్వయం చేసుకుంటూ, పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలి. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతా. నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామ”న్నారు.