My Pride ✊
#TRSMembership2019#BRSMembership2026
On records my journey begins 2019.
Whereas off record my journey begins 2017.
10 years and go onnn
Jai KCR
Jai KTR
Jai Telangana
Sandeep Kumar
Happy to inaugurate @ozritdotcom’s new facility in Gachibowli today.
Interacted with Ozrit’s young team and held discussions with Founder & CEO Bharath Gupta and Co-Founder & COO Vivekanand Reddy.
It filled my heart to hear that the company was inspired by Telangana’s technology-driven growth over the last decade.
Live: హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు https://t.co/XW1h2LbCkE
♦️ మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం
♦️ తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో రేవంత్ రెడ్డి
♦️ 71సార్లు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ రేవంత్ రెడ్డిని దేకడం లేదు
♦️ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి
♦️ ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు
♦️ మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
♦️ హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే
♦️ 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్
♦️ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు
♦️ కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు
♦️ కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది
♦️ 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనం
♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులు: ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టీ పారిపోతున్నది
♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర
- రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏻
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేక పోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అన్నారు.
తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు.
ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఢిల్లీకి పోతే 'చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా' చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజ స్వరూపం బయటపడిందని, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ గారు పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు.
మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే 'మినీ ఇండియా' లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే
నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు.
మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించింది అన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు అన్నారు.
కేవలం ప్రజల ప్రయోజనాలు సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆర్ గారేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతున్నది
మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్, ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆరోపించారు.
రూ. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారన్నారు.
Wanted to share an inspirational story
Glad to meet Gaddam Shivaganesh, the son of a former welder from Parsigutta, who is making waves with his startup
His ambitious goal is to build a bank in Hyderabad that serves as a one-stop financial solution for students and their parents
It is delightful to see @THubHyd playing a key role in turning his vision into reality by providing a platform for innovation
Shivaganesh's idea has earned a $100,000 grant from Emergent Ventures and a place on the Forbes 30 Under 30 Asia 2026 list in the Finance & Venture Capital category
He has also transformed himself into a comic character and is developing a free animated film to make financial literacy simple and engaging for students
Shivaganesh's startup has now raised ₹10 crore to apply for an RBI payments licence and build the foundation for a student-focused financial institution
Wishing you great success, Shivaganesh!
కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజం
ఆరోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడు
రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడు - కేటీఆర్
కిషన్ రెడ్డి తీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కుంభకోణం చేస్తుంది విచారణ జరిపించండి అని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పాను
కుంభకోణం జరిగిందట విచారణ చేసుకో అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు
దొంగనే దొంగ మీద విచారణ చేసుకుంటాడా?
– హరీష్ రావు
కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను
కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు…
ముందు మహిళలకు నెలకు ఇస్తామన్న
₹2,500 బాకీతో సహా ఇవ్వు రేవంత్
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రాజకీయాలపై ఆసక్తితో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన జెన్ జీ యువతులు
రాజకీయాల్లో ఉండే పార్టీ నేతలు, కార్యకర్తలు, సమస్యలతో వచ్చే ప్రజలే కాకుండా ఈరోజు నలుగురు జెన్ జీ యువతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసారు. సాధారణంగా నేతలు, కార్యకర్తలు సందడి చేసే పార్టీ కార్యాలయానికి, ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు యువ విద్యార్థినులు నేరుగా వచ్చారు. తమ భవిష్యత్తు గురించి, తమకున్న రాజకీయ ఆసక్తుల గురించి నేరుగా తెలుసుకోవాలనే సంకల్పంతో వారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
తాము రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. తాము మీతో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌కు తెలిపారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్‌గా తాము పాలసీ అంశాలతో, సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
కెరీర్ మాత్రమే లక్ష్యంగా ఉద్యోగాల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డలు నేరుగా తనను వచ్చి కలవడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ యువతకు కేటీఆర్ గట్టి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన ఈ నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ నలుగురు విద్యార్థినులలో లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి మరియు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు.
రాజకీయ పరిస్థితిని, పాలనాపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని వారు కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. జెన్ జీ యువతలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల వారికున్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
చివరగా, తమ భవిష్యత్తు లక్ష్యాలను, రాజకీయాలపై తమకున్న దృక్పథాన్ని పంచుకున్న ఈ యువతులు, పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ విద్యార్థినుల ఆలోచనలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని కేటీఆర్ అన్నారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌తో కాసేపు మాట్లాడిన ఈ యువతులు, త్వరలో తమ బృందంతో కలిసి వస్తామని తెలిపారు. కేటీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడడం, తమ ఆలోచనలకు కేటీఆర్ గారి ప్రోత్సాహం ఎంతో స్పూర్తిని నింపిందని అన్నారు.
Was pleasantly surprised by these amazingly confident young girls who walked into my office earlier today
1) Sarayu, who will be pursuing her undergrad in Politics, Economics and Philosophy at Kings College, London
2) Laasya, who will be attending NALSAR university of Law in Hyderabad
3) Revathi, who will be attending Law School at Symbiosis Law School in Hyderabad
4) Ashni, who is pursuing her B. Comm from St. Francis College Hyderabad
They wanted to work with me and our team at Telangana Bhavan to acquaint themselves with political situation in the city and state
Welcomed these potential young leaders and promised to support them through the process
Also thanked them for making my day 😊
తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం
ఏ పార్టీకి లేదు!
అధికారం దూరమైనా...
ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఉన్న ప్రేమ,
మమకారం అలాగే ఉన్నాయి.
వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, SIR మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS
బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు బతుకుతెరువు కల్పించాం. కానీ రేవంత్ రెడ్డికి ఆ కాన్సెప్టే అర్థం కాలేదు.
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టొద్దని అసెంబ్లీలోనే వేడుకున్నా వినలేదు.
ఇవాళ కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, పిల్లల బ్రేక్‌ఫాస్ట్, రైతుబంధు.. ఇలా అన్నీ బంద్ చేశారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తన మంత్రి పదవి కాపుడుకోడానికి ‘కోతల వెంకట్ రెడ్డి’ ఆర్భాటాలు
ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్నాడు.
HAM రోడ్స్ పేరుతో పెద్ద స్కాం కు శంకుస్థాపన చేస్తున్నాడు
హ్యాంరోడ్లు అన్ని వట్టివే, కమిషన్ల కోసమే హంగామా సృష్టిస్తున్నారు
కోతల వెంకట్ రెడ్డి ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నాడు
కేసీఆర్ నల్గొండకు వచ్చిన ప్రతిసారి నిధులిచ్చి అభివృద్ధి చేశాడు, మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం, రూ.1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారు
అయితే ఇద్దరు మంత్రులు స్కామ్ లు, మిల్లర్ల వద్ద మూడుపులు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నారు.
పోయేలా ఉన్న మంత్రి పదవిని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి రేవంత్‌ను కాకా పెట్టేందుకు సభ పెడుతున్నాడు,తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని,అందుకే హడావుడి చేస్తూ షో పుటప్ చేస్తున్నాడు