తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని అన్నారు. గత అనుభవాలు, లౌక్ డౌన్ విధించినా ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గకపోవడాన్ని సీఎం ఉదహరించారు.