సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప��రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ��ా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.