తెరిచి ఉన్న తలుపులకు తాళం పగలగొట్టినట్టు.. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీ నాయకులు దీక్ష చేయడం అర్థరహితం.
ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి @revanth_anumula గారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా నాలుగు సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు. ఆరోజు ఈ బీజేపీ నాయకులు ఎందుకు ధర్నాలు చేయలేదు?
పక్క రాష్ట్రంలో ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కదా.. మరి అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి.
: శ్రీ ఈరవత్రి అనిల్ గారు,
మినరల్ డెవలమెంట్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు.
కుల గణనలో ఖచ్చితత్వమే కీలకం - సామాజిక న్యాయానికి ఇదే పునాది
ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గార్ల సంయుక్త లేఖ
➡️ భారతదేశంలో సామాజిక న్యాయానికి సంబంధించిన విధానాలు సరైన గణాంకాల ఆధారంగానే రూపొందాలి. అందుకే కుల గణనలో ప్రతి కులం యొక్క ఖచ్చితమైన సంఖ్య, సామాజిక–ఆర్థిక పరిస్థితి స్పష్టంగా నమోదు కావాలి.
➡️ ప్రస్తుతం ప్రతిపాదించిన Open-ended ప్రశ్నావళి విధానం వల్ల ఒకే కులానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న పేర్లు, ఉపకులాల పేర్లు వేర్వేరుగా నమోదయ్యే ప్రమాదం ఉంది.
➡️ ఫలితంగా ఒకే కులం వేలాది పేర్లుగా విడిపోయి, అసలు జనాభా సంఖ్యే తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంది.
అందుకే స్పష్టమైన ప్రత్యామ్నాయం:
➡️ కులాల కోసం ముందుగానే ప్రామాణిక డ్రాప్‌డౌన్ జాబితా రూపొందించాలి.
➡️ ఇప్పటికే ఉన్న ప్రభుత్వ సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జాబితాలు, భారత మానవశాస్త్ర సర్వే ఆధారంగా ఈ జాబితాను రూపొందించవచ్చు.
➡️ తెలంగాణ కుల సర్వే–2024, బీహార్ కుల సర్వే–2022లో ఇదే విధానాన్ని ఉపయోగించారు.
➡️ ఆ రెండు సర్వేల కులాల జాబితాలను కూడా లేఖకు జత చేశారు.
👉🏻 మరో కీలక అంశం-OBC జనాభా
➡️ ప్రస్తుత కుల గణనలో “వెనుకబడిన వర్గం” అనే అంశం కూడా లేకపోవడంతో, దేశంలో OBCల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
👉🏻 సరైన సంఖ్యలు లేకపోతే:
➡️ విద్య | ఉద్యోగాలు | సంక్షేమ పథకాలు | రిజర్వేషన్లు | సామాజిక న్యాయం వంటి కీలక నిర్ణయాలు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, ఇతర అణగారిన వర్గాలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.
👉🏻 మా డిమాండ్
➡️ ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేయాలి.
➡️ రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో విస్తృతంగా చర్చించి కొత్త, శాస్త్రీయమైన ప్రశ్నావళిని రూపొందించాలి.
👉🏻 ప్రతి కులం - ఒకే గుర్తింపుతో
👉🏻 ప్రతి వర్గం - ఖచ్చితమైన సంఖ్యతో
👉🏻 ప్రతి నిర్ణయం - సరైన గణాంకాలతో
➡️ కుల గణన అంటే కేవలం లెక్కలు కాదు…
సామాజిక న్యాయానికి భవిష్యత్ పునాది
A heartfelt thank you to all my Social Media team members. Without your support, hard work and dedication, this responsibility would not have been possible.
We all worked tirelessly together before the elections, and now we have an even bigger responsibility and a greater mission ahead of us.
I sincerely thank Revanth Anna @revanth_anumula and Mahesh Anna @Bmaheshgoud6666 for trusting me and giving me this responsibility as Social Media Chairman.
I assure you that I will work with complete dedication and commitment to strengthen the Telangana Congress Social Media team.
We worked together before the elections, and now let’s begin the next chapter with the same spirit, unity and determination.
Together, we will make Telangana Congress Social Media stronger than ever.
Hyderabad’s one-way traffic arrangement near KBR Park may have raised a few eyebrows initially, but the results are speaking for themselves.
Kudos to the Traffic Commissioner, Hyderabad Traffic Police, GHMC and everyone involved in making this happen. Good traffic management is not always about big changes, it’s about smart decisions that make everyday commuting easier.
And this positive public review is proof that when something works, people notice. #kbrpark @CYBTRAFFIC 👏🏻
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై యూ ట్యూబర్ రంజిత్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం తరపున సహాయం చేయమని అడిగితే.. నువ్వు సచ్చిపోతే మీ ఇంటికి ఎవరు దిక్కు అన్న శ్రీనివాస్ గౌడ్
I was pleased to lead the official #TelanganaRising delegation to Senate House, University of London, for a roundtable with the University of London, including the London School of Economics and Political Science (LSE) and SOAS.
We discussed the University of London’s plans to establish a campus in #Hyderabad, bringing world-class education and a wide range of programmes to Telangana’s youth.
With IT & Industries Minister D. Sridhar Babu garu, K. Ramakrishna Rao, Jayesh Ranjan and the University of London team, we explored how this partnership can strengthen education, research and global opportunities for our students.
#Education #Telangana
- 22A నిషేధిత జాబితా నుంచి మినహాయింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 98% మినహాయింపుకు అర్హమైనవే
- దేవాదాయ, భూదాన్ భూముల జాబితాలో ఉన్న అప్లికేషన్లను తిరస్కరించాం
- చట్టబద్ధమైన భూహక్కులు ఉన్నవారి దరఖాస్తులను గరిష్టంగా 24 నుంచి 36 గంటల్లో ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరిస్తున్నాం
- అధికారులు యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నారు.
- టోల్ ఫ్రీ నంబర్‌కి 980 కాల్స్ వచ్చాయి. ఆయా కాల్స్ వివరాలను వెరిఫికేషన్ కోసం సంబంధిత జిల్లా అధికారులకు పంపించాం.
- దరఖాస్తు చేసుకున్నవారెవరూ ఆందోళన చెందనక్కర్లేదు. గతంలో రెగ్యులరైజేషన్ కోసం ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ సైట్లో అప్లోడ్ చేశాం. కాబట్టి రిజిస్ట్రేషన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
- శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు.
రియల్ ఎస్టేట్, ఇండ్ల విక్రయాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్
దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ మధ్య ఇండ్ల విక్రయాలు 6% తగ్గగా, హైదరాబాద్‌లో మాత్రం 15% వృద్ధి నమోదు కావడం గర్వకారణం. ఇటీవల హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి @revanth_anumula గారి పరిపాలన, ప్రభుత్వ విధానాల పట్ల పెట్టుబడిదారులకు, ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనం.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై ప్రతిపక్ష @BRSparty పార్టీ పెయిడ్ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను పెట్టుబడిదారులు, ప్రజలు నమ్మడం లేదని, హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలపై విడుదలైన తాజా గణాంకాలతో మరోసారి రుజువైంది.
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు ప్రజల నుంచి లభిస్తున్న అద్భుతమైన మద్దతు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ‘ట్రంప్ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ మహానగరం అన్ని వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేసే హౌసింగ్ హబ్‌గా, దేశంలోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన నగరంగా వేగంగా ఎదుగుతోంది.
My deepest gratitude for the strong support from our leader and Congress party national president, Shri Mallikarjun Kharge ji @kharge on the issue of Centre denying me permission to travel to the USA.
I am very thankful to my party, all the leaders and people across the country who supported in this issue in national interest.
I have concluded all my meetings and scheduled events in London and I am grateful for the overwhelming support that I have received in past three days.
In a few hours, I will be taking a flight back home to Hyderabad instead of proceeding to Boston as per original schedule, after the MEA (Central Govt) denied permission for my USA tour for “political reasons”.
I will speak about all the related issues once I return to Hyderabad.
I congratulate Ms Bhavani Bompelly, a teacher at the MPPS Girls Gandhari, for being selected for the National Teachers Award.
She will have the great honour of receiving the award from Her Excellency, President of India, Smt Droupadi Murmu ji.
Bhavani garu is one of 48 teachers selected for the award from entire India, and only one from #Telangana. She was part of a team of teachers from our state who toured Finland recently on a study tour.
Her impact on children and the school, where she has over a decade more than tripled girl children enrolment, and pushed hard for improvement in facilities and infrastructure, makes her a role model for entire society.
Teachers are the truest and most significant nation builders. Please join me in congratulating her for her achievements.
Visiting Dr. B.R. Ambedkar’s house at 10 King Henry’s Road, London, where Babasaheb lived in 1921–22, was a deeply moving and inspiring experience.
The Ambedkar Museum preserves his enduring ideals of constitutionalism, equality, a casteless society and social justice. Ms Santosh Dass MBE, Chair of the Anti-Caste Discrimination Alliance (ACDA), shared valuable insights into Babasaheb’s life in the #UK
As I wrote in the visitor’s diary: “Visiting Dr Ambedkar House is like a pilgrimage. The inspiration is for a lifetime. I feel renewed dedication for social justice.”
It was truly one of life’s great moments to connect with the personal history of one of the greatest Indians ever born.
#BRAmbedkar
Visited today one of the World’s oldest universities, the #OxfordUniversity which is 900-years old.
The Blavatnik School of Government in Oxford is one of the youngest institutions within the Oxford umbrella.
Incidentally former prime minister late Smt Indira Gandhi ji was a student at Oxford.
Hon’ble CM Revanth Reddy garu’s visit to Oxford is not just a visit it is an investment in Telangana’s future.
Connecting Telangana with the world’s leading institutions, ideas and opportunities to create a stronger ecosystem for education, innovation and growth.
He is not just governing for today, he is preparing Telangana for tomorrow.
#TelanganaRising #RevanthReddy
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారూ… మీరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, ఒక సూటి ప్రశ్న:
ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అంటే అసలు ఏవి?
రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన షెడ్యూల్‌ను చూస్తే..
🔹 Harvard University క్యాంపస్ సందర్శన
🔹 MIT క్యాంపస్ సందర్శన
🔹 Northeastern University ప్రతినిధులతో సమావేశం
🔹 Virginia Tech University బృందంతో సమావేశం
🔹 విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, ఒప్పందాలపై చర్చలు
🔹 చివరగా Indian Overseas Congress (USA) meet & greet
ఇందులో ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమం ఏది?
యూనివర్సిటీలను సందర్శించడం ముఖ్యమంత్రి చేయకూడని పని అవుతుందా?
తెలంగాణ విద్యార్థులకు, యువతకు, రాష్ట్రానికి ఉపయోగపడే విద్యా భాగస్వామ్యాల కోసం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో చర్చించడం ముఖ్యమంత్రి చేయకూడని పని అవుతుందా?
అలా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి
“ఈ కార్యక్రమం అభ్యంతరకరం… ఈ కారణంతో ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించాం” అని.
అది చెప్పకుండా “ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు ఉన్నాయి” అని మాత్రమే చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఇక ఓవర్సీస్ సమావేశం గురించి మాట్లాడుతున్నారు.
ఏ రాజకీయ నాయకుడైనా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తన పార్టీ/ఓవర్సీస్ విభాగం ప్రతినిధులను కలవడం కొత్త విషయమా?
విదేశాల్లో మీ పార్టీ ప్లీనరీలు, సమావేశాలు నిర్వహించినప్పుడు అవి ఏ ఖర్చుతో జరిగాయి?
మీ పార్టీ నాయకులు విదేశీ పర్యటనల్లో ఓవర్సీస్ విభాగాలతో సమావేశాలు నిర్వహించలేదా… అప్పుడు ఎన్ని సంచులు మోశారు? అప్పుడు ప్రజా ధనం గుర్తుకు రాలేదా?
అప్పుడు “జూమ్ కాల్‌తో మాట్లాడుకోవచ్చు కదా?” అనే జ్ఞానం ఎందుకు రాలేదు?
మరి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించినప్పుడు కూడా ఇదే సలహా ఎందుకు ఇవ్వలేదు?
ప్రపంచం మొత్తం జూమ్ లో కూర్చుని ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు విదేశాలు తిరిగారు?
అప్పుడు విదేశీ పర్యటనలు అభివృద్ధి కోసం.
ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తే మాత్రం ప్రజా ధనం వృథా?
ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
మరో ముఖ్యమైన ప్రశ్న
ముఖ్యమంత్రి చేయకూడని పనులు ఏవైనా ఉన్నాయని కేంద్రం భావిస్తే…
అధికారుల బృందానికి అదే పర్యటన కొనసాగించడానికి అనుమతి ఎందుకు ఇచ్చారు?
అదే యూనివర్సిటీలతో సమావేశాలు జరగబోతున్నాయి.
అదే విద్యా భాగస్వామ్యాలపై చర్చలు జరగబోతున్నాయి.
అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారుల బృందం వెళ్లబోతోంది.
అయితే…
అధికారులు వెళ్లొచ్చు. ముఖ్యమంత్రి మాత్రం వెళ్లకూడదా?
అలా అయితే అసలు అభ్యంతరం కార్యక్రమానికా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడానికా?
ఇది తెలంగాణ ప్రజలకు కేంద్రం స్పష్టంగా చెప్పాల్సిన ప్రశ్న.
ఇంకో విషయం.
మీరు “గూఢచార సంస్థలు ఏమైనా పసిగట్టాయా?”, “షెల్ కంపెనీల సమావేశాలా?”, “దేశ భద్రతకు ముప్పా?” అంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆధారం ఏంటి?
ప్రశ్నార్థక చిహ్నాలు పెట్టి తీవ్రమైన ఆరోపణలకు సంకేతాలు ఇవ్వడం సులభమే.
కానీ మాజీ IPS అధికారిగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు, వాస్తవాలు, బాధ్యత కూడా ఉండాలి.
లేకపోతే అది పరిజ్ఞానం లోపమో…
లేదా రాజకీయ రంగు మరీ ఎక్కువైందో…
ప్రజలే నిర్ణయిస్తారు.
చివరగా
ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు నిరాకరించారో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి.
ఏ కార్యక్రమం “ముఖ్యమంత్రి హోదాలో చేయకూడనిది”?
ఎందుకు చేయకూడదు?
అధికారుల బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చారు?
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు సాధించడానికి ముఖ్యమంత్రి వెళ్లడాన్ని రాజకీయ కుట్రల ముసుగులో చూడటం కాదు…
తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించడం మా బాధ్యత.
ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత పర్యటన కాదు.
ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అధికారిక పర్యటన.
రాజకీయాలు పక్కన పెట్టి సమాధానాలు చెప్పండి.
తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు.
@RSPraveenSwaero
మీ భూమి
22-Aలో ఉందా?
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
మీ భూమి నిజంగా ప్రైవేట్ భూమి అయితే…
1. అధికారులు పరిశీలిస్తారు
2. రికార్డులు తనిఖీ చేస్తారు
3. భూమి వివరాలు సరైనవని నిర్ధారిస్తారు
4. అవసరమైతే రికార్డును సరిచేస్తారు
“తప్పు రికార్డు ఉంటే…
తప్పును సరిచేయడమే ప్రభుత్వ బాధ్యత.”