𝐀 𝐫𝐞𝐞𝐥 𝐦𝐚𝐲 𝐥𝐚𝐬𝐭 𝟑𝟎 𝐬𝐞𝐜𝐨𝐧𝐝𝐬… 𝐛𝐮𝐭 𝐚𝐧 𝐚𝐜𝐜𝐢𝐝𝐞𝐧𝐭 𝐜𝐚𝐧 𝐝𝐞𝐬𝐭𝐫𝐨𝐲 𝐚𝐧 𝐞𝐧𝐭𝐢𝐫𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞.
✳️For likes, shares, and followers youngsters performing risky stunts just to go viral on social media.
✳️Remember: Trending today can become tragedy tomorrow.
✳️Your family needs you alive, not famous for a dangerous reel.
Life is real. Reels are not.
C𝐨𝐮𝐫𝐚𝐠𝐞𝐨𝐮𝐬 𝐚𝐜𝐭𝐢𝐨𝐧 𝐛𝐲 𝐓𝐚𝐩𝐩𝐚𝐜𝐡𝐚𝐛𝐮𝐭𝐫𝐚 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐬𝐚𝐯𝐞𝐝 𝐚 𝐥𝐢𝐟𝐞 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐧𝐢𝐜𝐤 𝐨𝐟 𝐭𝐢𝐦𝐞.
In a remarkable act of courage and presence of mind, PC B. Suresh of Tappachabutra Police Station saved the life of a TGPDCL contract worker who suffered a severe electric shock while carrying out repair works near Kummarwadi Hanuman Temple, Karwan. Responding instantly during his BC-I patrolling duty, the constable rushed to the spot and found the worker unconscious and not breathing.
Without wasting a moment, PC B. Suresh administered CPR on-site and successfully revived the victim’s pulse and breathing before shifting him to the hospital for further treatment. Doctors stated that the timely CPR given during the golden hour played a crucial role in saving the worker’s life, highlighting the Hyderabad City Police’s commitment towards public safety and humanitarian service.
✳️Fraudsters are increasingly using fake online astrology, tantra & spiritual services to trap innocent people.
✳️Don’t share personal details, photos or money with unknown online “gurus”
Stay Alert, Stay Safe!
బక్రీద్ పండుగ.. గొర్రెల, మేకల అమ్మకందారులూ తస్మాత్ జాగ్రత్త!!
బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారుల రద్దీతో సందడిగా మారాయి. అయితే, ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరిట అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు.
ముఖ్యంగా ఫేక్ ఫోన్ పే వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను సృష్టించి, నగదు చెల్లించినట్లుగా స్క్రీన్‌పై చూపిస్తూ వ్యాపారులను నమ్మిస్తున్నారు. సంతల్లో ఉండే విపరీతమైన హడావుడిని ఆసరాగా చేసుకుని, తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజంగానే నగదు జమ అయ్యిందో లేదో సరిచూసుకోని వ్యాపారులకు ఈ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి, ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ. 68 వేలు చెల్లించినట్లు నకిలీ యాప్ ద్వారా స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా రాజేంద్రనగర్‌లోనూ నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి, ఇదే తరహాలో నకిలీ పేమెంట్ యాప్‌తో మోసగించారు. బాధితులు ఆలస్యంగా తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఆన్లైన్ ద్వారా నగదు పంపినప్పుడు, కేవలం కొనుగోలుదారుడి ఫోన్లో కనిపించే స్క్రీన్ షాట్‌ను లేదా పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్‌ను చూసి నమ్మవద్దు. మీ స్వంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక ఎస్ఎమ్ఎస్ చూసుకోండి లేదా నేరుగా మీ బ్యాంకింగ్ యాప్ తెరిచి బ్యాలెన్స్ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించండి. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు నగదు రూపంలో తీసుకోవడమే ఉత్తమం
ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100 కు కాల్ చేయండి లేదా మా పోలీసు అధికారులకు సమాచారం అందించండి.
Fraudsters Use Digital Wedding Cards as a New Tool to Hack Phones; Avoid Opening APK Files or Suspicious WhatsApp Links from Unknown Numbers.
#DigitalWeddingCards
➡️ భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం
➡️హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి 'ఏఐ కాప్‌రైటర్'
➡️దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు
➡️యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
✳️పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
✳️హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైటర్ యాప్ ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. దాని పనితీరును పరిశీలించారు.
✳️నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చు.
✳️హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది.
ప్రధాన అంశాలు:
✳️ బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే, అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించబడుతుంది.
✳️వేగం-కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
✳️ పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు.
✳️మల్టీ-పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది.
✳️పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు.
✳️"హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రాని వలసవచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎందరో ఉంటారు. భాష తెలియకపోవడం వల్ల ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం లేదా సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుంది. మాట్లాడిన ప్రతి 5 సెకన్లకు సమాచారం అప్డేట్ అవుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది." అని ఆయన అన్నారు.
✳️న్యాయం పొందడానికి భాష ఎప్పటికీ అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఏఐ కాప్‌రైటర్ ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని పేర్కొన్నారు.
✳️ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, ఐపీఎస్ గారు, అదనపు సీపీ(లా అండ్ ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ గారు, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) శ్రీ సీహెచ్ రూపేష్, ఐపీఎస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేశ్, బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
నగర పోలీసింగ్‌లో కృత్రిమ మేధ జోరు:
✳️ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది.
✳️ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే 'సి-మిత్ర' లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఏఐను వాడుతోంది. గతంలో ఉన్న మ్యాన్యువల్ పద్ధతుల స్థానంలో ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల, ఎటువంటి పక్షపాతం లేకుండా సిబ్బందికి పోస్టింగ్‌లు కేటాయించబడుతున్నాయి. ఇది వ్యవస్థలో పూర్తి పారదర్శకతను పెంచుతోంది.
✳️సోషల్ మీడియాలో సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలను గుర్తించేందుకు 'సాక్-ఐ' అనే ఏఐ ఆధారిత యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆన్లైన్ కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, మహిళల, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే పోస్టులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫిర్యాదుల నమోదు ప్రక్రియను కూడా ఏఐతో అనుసంధానించింది. అందుకు ఏఐ కాప్‌రైటర్ యాప్ ను రూపొందించింది. దీనివల్ల ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మరింత వేగంగా, క్రమబద్ధంగా నమోదవుతాయి.
As part of Police Commemoration Week (October 21–31, 2025), the South West Zone Police, in association with Deccan Blasters, is organizing a Mega Job Mela on 30.10.2025 from 08:00 AM to 01:00 PM at Roop Garden Function Hall, Pillar No. 63, Rethibowli Ring Road, Mehdipatnam, Hyd.
Flag March commenced under the Leadership of Sri B. Kishan Kumar, ACP, Asif Nagar and SHOs of Asif Nagar Division in the limits of Mehdipatnam PS, South West Zone on Event of Ganesh Festival-2025.
MNR School primary class students visited police staion and celebrated Rakhi Festival and interacted with SHO Sri S. Mallesh & DI Sri G. Bala Krishna including all officers and conveyed independence day wishes to #HyderabadCityPolice#dcpsouthwest#cvanandips#DCPSouthWest
We aimed at sensitizing the local community about the dangers of drug abuse and the importance of a drug-free society. This programme helped strengthen the bond between police and community, and inspired the youth to commit to a drug-free lifestyle.
Drug Awareness Programme was conducted by N. Preethi Reddy, SI of Police and staff of Mehdipatnam Police Station at Eidgah Ground, First Lancer, Hyderabad.