దీపావళి శుభాకాంక్షలు..💐
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ.. అందరికీ "దీపావళి" పర్వదిన శుభాకాంక్షలు.
@UttamINC@uttampadmavathi
అథ్లెటిక్స్ విభాగం షాట్ పుట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానం సాధించిన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన నందిరెడ్డి అనీష్ రెడ్డి
వివిధ వార్త పత్రికల్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్
భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..
భారతదేశ తొలి మహిళా ప్రధాని, భారతరత్న, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ ధీశాలి నాయకురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.🙏
దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం.
సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన SGF అండర్-14 ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చింతలపాలెం మండలానికి చెందిన నందిరెడ్డి అనీష్ రెడ్డి ప్రతిభ చాటాడు. షాట్‌పుట్‌లో 10.05 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానాన్ని సాధించి, నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
మంత్రివర్యులు కెప్టెన్ #ఉత్తమ్ గారి చొరవతో..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలోని కొత్తగూడెం & శోభనాద్రిగూడెం గ్రామాల రహదారుల అభివృద్ధికి రూ: 3.03 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ముందస్తు చర్యలు..
చింతలపాలెం:- వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఉత్తమ్ గారి ఆదేశాల మేరకు, ఇరిగేషన్ శాఖ అధికారుల సహకారంతో జెసిబితో నడింకాలువను తవ్వి కాలువ ద్వారా అర్చనకుంట చెరువుకు నీటిని మళ్లించి
చెరువు నిండే విధంగా చర్యలు చేపట్టడమైనది.
పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రం ప్రారంభం
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కెప్టెన్ #ఉత్తమ్ ఆదేశాల మేరకు, చింతలపాలెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపాలెం మండల కేంద్రంలో ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు నందిరెడ్డి ఇంద్రారెడ్డి తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక "విజయదశమి"✌️
అధర్మంపై ధర్మం, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ విజయదశమి (దసరా)
అందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు.💐
@UttamINC@uttampadmavathi
చింతలపాలెం మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మార్వో రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో ఆండాలు, ఎస్సై పరమేష్ మండల అధికారులు, మండల నాయకులతో కలిసి పాల్గొన్నాను.
#క్రికెట్#చింతలపాలెం
అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు కెప్టెన్ ఉత్తమన్న..💪✌️
నీటిపారుదల రంగంలో అభివృద్ధికి మారుపేరు, రాష్ట్రంలో రైతుల సంక్షేమం, సాగునీటి అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి విశేష ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న మంత్రివర్యులు గౌరవ శ్రీ కెప్టెన్ #ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
చింతలపాలెం మండలం వదినేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను సందర్శించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నాను.