రాయి కానిస్టేబుల్ కు తగిలింది.- పోలీసులు.
ఎవడికి తగిలితే ఏంటి అంటున్న టీడీపీ కార్యకర్త.
చాలా క్లియర్ గా దాడి దృశ్యాలు. అతడిని అరెస్ట్ చేస్తారా లేక.. తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం,,. అంతమాత్రానికే కేసులు పెడితే ఊరుకోం అన్న లోకేష్ మాట ప్రకారమే పోలీసులు ఊరుకుంటారా !.
"ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నా చాలు.. ఇప్పుడే ఇప్పుడే కుమ్మేద్దాం" .. అంటున్న కూటమి ఎమ్మెల్యేలు. వారిని కట్టడి చేయలేక నిస్సహాయ స్థితిలో అధినేతలు.
కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకే గ్రావెల్ , గ్రానైట్ అప్పగించి, వారి నుంచి వాటాలు తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.
- ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక
ఈ కథనం వెనుక ఉద్దేశం ఏంటి?.
1. ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నా అధినేతల వల్ల సాధ్యం కావడం లేదు, అయ్యో పాపం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకోవాలి. వారికి చెడ్డ పేరు రాకూడదు.
2. కూటమి ఎమ్మెల్యేలు ఎలాగో మారే పరిస్థితి లేదు కాబట్టి, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇదంతా వైసీపీకి అనుకూలిస్తుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి నేతలు చేస్తున్న దోపిడీలో వైఎస్ఆర్సిపి వాళ్లు కూడా వాటా తీసుకుంటున్నారు అని ప్రచారం చేస్తే, వైసిపి కూడా బదనామవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది అన్నది ఆంధ్రజ్యోతి ఉద్దేశం.
మొత్తానికి ఇంతకాలం రెండు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అంటూ రాస్కొచ్చిన ఆంధ్రజ్యోతి , ఈ సీరియస్ లీక్ వార్తలతో వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంతో, ఇప్పుడు ఏకంగా చంద్రబాబునాయుడు ఎవరిని అదుపు చేసే పరిస్థితుల్లో లేరు అని చెబుతోంది. దానికి ముద్దుగా నిస్సహాయత అని పేరు పెట్టింది.
ఆంధ్రజ్యోతి : సీఐ నాగరాజుకు మద్దతుగా మహిళలు, యువత నిరసన తెలుతున్నారు, బైఠాయిస్తున్నారు. సీఐ నాగరాజు సస్పెండ్ అవగానే కృష్ణలంక పరిధిలో గంజాయి బ్యాచ్ లు పని మొదలుపెట్టాయని ఆందోళన. - మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి కథనం.
అంటే సీఐ నాగరాజు తప్ప పోలీస్ శాఖలో సమర్ధుడైన పోలీసు అధికారే లేరని చెబుతున్నారా?!!. కృష్ణలంకలో నాగరాజు ఉంటారు సరే.. మరి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి బ్యాచ్ లు తమ పనులను ఇది వరకు నుంచే కొనసాగిస్తున్నాయా?!. ఇతర ప్రాంతాల్లో నాగరాజు లేరు కాబట్టి గంజాయి ఆగలేదా?!.
ఇతర పోలీసు ఉన్నతాధికారులు లేరా!. ఇప్పుడున్నపోలీసులకు చేతకాదు అని చెబుతున్నారా!. నాగరాజు లేకుండా గంజాయి బ్యాచ్ లు వస్తాయి కాబట్టి సాయికృష్ణ కేసులో వదిలేయాలని ఆంధ్రజ్యోతి చెబుతోందా?.
చంద్రబాబు మాకు న్యాయం చేశారు అని సాయికృష్ణ తల్లి మీడియా ముందే చెప్పారు కాబట్టి.. ఇక ఈ కేసు రాష్ట్ర పోలీసులను దాటి బయటకు వెళ్లకపోవచ్చు. మాకు సీబీఐ దర్యాప్తు కావాలని జూన్ 29న బాధితుడి కుటుంబం అడుగుతుందా అంటే అనుమానమే.
జడ శ్రవణ్ మాత్రం ఇది వ్యక్తి మీద దాడి కాదు సొసైటీ మీద దాడి.. కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ మేం పిటిషన్ వేస్తాం అన్నారు. ఒకవేళ కేసు విచారణ సందర్భంగా కుటుంబసభ్యులే రాష్ట్ర పోలీస్ దర్యాప్తు నమ్మకంతో ఉన్నప్పుడు మీకేంటి అభ్యంతరం అని జడ శ్రవణ్ బృందాన్ని కోర్టు ప్రశ్నిస్తే ఇక ఈ కేసు ఏ స్థాయిలో ఆగిపోతుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
అసలు ఇంతగా చేయడానికి మోటివ్ ఏంటి అన్నది తేలాలి. పోలీసుల మీదే ఆరోపణలు కాబట్టి సీబీఐ దర్యాప్తే సరైనది అని కోర్టు తనకు తానూ భావిస్తే ఈ కేసు మరో స్థాయికి వెళ్లవచ్చు.
జూన్ 29న కోర్టులో ఏం జరుగుతుంది అన్నదే కీలకం.
దక్షిణాది నాయకులు వారి వారి రాష్ట్రాల్లో కూర్చుని ఢిల్లీ మెడలు వంచుతాం అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతారు.
ఢిల్లీ రాగానే వారికి నోరు పెగలదు.
చీమలు బలమైన సర్పాన్ని చంపగలవు అన్నట్టు చిన్నచిన్న క్రిమికీటకాలు కూడా ఏకమై,.. ఈ దేశ సమగ్రత ప్రాముఖ్యతను సరిగా అర్థం చేసుకోలేక ఈ దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కాచుకుని ఉంటాయి. అలాంటి ప్రభావానికి జనసేననేతలు లోను కాకూడదు.- పవన్ కల్యాణ్.
గతంలో మీరే కదా సౌత్, నార్త్ అంటూ ప్రజలను రెచ్చగొట్టింది అంటూ పవన్ ను నిలదీస్తున్ననెటిజన్లు.
ఫస్ట్ ర్యాంకు వచ్చిన నవీన్ కు ఎందుకు టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు?. అతడే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు రాలేదు అంటున్నారు. మరి అలా రాని వ్యక్తి హైకోర్టుకు ఎందుకు వెళ్తాడు ?. ఈ వ్యవహారం నవీన్ తోనే ఆగిందన్న గ్యారెంటీ ఏంటి. ఇంకా ఎంత మందికి పేపర్ లీక్ అయిందో తేలాలి కదా!. అందుకే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి.
సిగ్గులేని, భయం లేని దొంగలు అంటే వీళ్ళే. అసలు దొంగలు నయం ముసుగులో వస్తారు. సామూహికంగా దోచుకుంటే అది దొంగతనం కాదు అన్నది వీరి ఆలోచన. అవకాశం కోసం ఎదురు చూసే దొంగలు వీరంతా.. దొంగ తనం చేసిన మందు తీసుకెళ్లి భర్త ప్రేమ పొందాలనే తాపత్రయం కొందరిది. ఫ్రీ కదా..
పాపం కాంగ్రెస్ వాళ్లు.. ఉచిత విద్యుత్ క్రెడిట్ కూడా టీడీపీకే త్యాగం చేసిన రేవంత్ రెడ్డి. తాను ఇలా ఎందు కోసం మాట్లాడుతున్నానో , ఏం ఆశించి మాట్లాడుతున్నానో ఆఖరిలో స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి..
తెలంగాణ జర్నలిస్ట్ లపై జనసేన నేత ధూషణలు. నాగేశ్వర్ చానళ్లకు వెళ్తే టిఫిన్లు పెట్టించాలి, డబ్బులు ఇవ్వాలి. చిల్లరగాళ్లతో ప్రెస్ మీట్ ఎలా పెడుతావ్ అంటూ దూషణలు.
ఉచిత బస్సు పథకం ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదా!.
ప్రైవేటీకరణ వైపు ఆర్టీసీ. ప్రైవేటీకరణ తప్పనిసరి అంటున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్ధిక భారం పడిందంటున్న నారాయణ. అసలు ఆ పథకం ప్రకటించినప్పుడు ఎంత మంది మహిళలు ప్రయాణిస్తారో వారి తప్పున టికెట్ సొమ్మును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి అలా చెల్లించడం లేదా ?. చెల్లిస్తుంటే ఆర్టీసీపై ఆ పథకం వల్ల భారం పడిందని ఆర్టీసీ చైర్మన్ ఎందుకు చెబుతారు?.
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబు, నారాయణను చూసి భూములు ఇస్తే మీ ఇష్టం. అది దాదాపు మీ మధ్య ఉన్న ప్రైవేట్ ఒప్పందం లాంటిదే. దానికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించరు. మీకు ఇబ్బంది వస్తే రాష్ట్ర ప్రజలు మీకు మద్దతుగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే రెండు,మూడు విడత ల్యాండ్ పూలింగ్ ఆలోచన మానుకోండి.